Categories: FeaturedMovie News

Galata Geethu : పర్సనల్ గా వచ్చి కలిస్తే ఎక్కువ పేమెంట్ ఇస్తామన్నారు… క్యాస్టింగ్ కౌచ్ గురించి బాంబు పేల్చిన గలాటా గీతూ..!

Galata Geethu : చిత్తూరు యాసతో బాగా ఫేమస్ అయిన గీతూ రాయల్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా ఉంది. గీతికా మొదట టిక్ టాక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా బాగా ఫేమస్ అయి ఆ తరువాత బిగ్ బాస్ రివ్యూలు చెబుతూ ఫాలోయింగ్ పెంచుకుంది. సోషల్ మీడియా కామన్ వ్యక్తిని సెలబ్రిటీని చేస్తుంది అనడానికి గీతూ వంటివారు మంచి ఉదాహరణ. సోషల్ మీడియా ద్వారా తనని తాను నిరూపించుకుని ఇప్పుడు బిగ్ బాస్ షో కి వెళ్లేంతలా ఎదిగిన గీతూకి ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులు ఎదురయ్యాయని బిగ్ బాస్ కి వెళ్లే ముందు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలిపింది.

పర్సనల్ గా కలిస్తే ఎక్కువ పేమెంట్…

యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ వంటి వాటితో బాగా ఫేమ్ వచ్చిన గీతూ బుల్లి తెర మీద అవకాశాలను అందుకుంది. ఇక జబర్దస్త్ లోనూ సందడి చేసిన గీతూకి పలు సినిమాల్లో కూడా ఆఫర్స్ వచ్చాయట. అయితే నటనలో అంత అనుభవం లేదని నటించడం రాదేమో అని కొన్ని పెద్ద బ్యానర్స్ నుండి వచ్చిన ఆఫర్స్ వదులుకుందట గీతూ. ఇక కొన్ని సినిమాల్లో నటించినా రేడియో జాకీ గా పనిచేయాలని బాగా కోరిక ఉండేదట.

ఇక ఒక షో కి హోస్ట్ గా వ్యవహారించాలని ఆఫర్ వస్తే అది కూడా ఆస్ట్రేలియా అనగానే మంచి పేమెంట్ ఆఫర్ చేయడంతో సరే అని అనుకున్నాక ఆ ఈవెంట్ కి సంబంధిచిన వ్యక్తి మేనేజర్ పిఏ ఫోన్ చేసి సార్ తో పర్సనల్ గా కలవాలి, అలా మీకు ఓకే అయితే పేమెంట్ ఎక్కువ ఇస్తారు అని చెప్పడంతో ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిందంటూ గీతూ ఇండస్ట్రీ లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి వివరించింది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago