యాంకర్ శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు.. పటాస్ షోతో ఫుల్ పాపులర్ అయిన శ్రీముఖికి బుల్లితెర ‘రాములమ్మ’గా కూడా మంచి పేరుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉంటుంది.
ఫోటో షూట్ లతో పాటుగా తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అందులో షేర్ చేస్తూ ఉంటుంది. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా తన తమ్ముడు సుష్రుత్ కి ఖరీదైన కారుని కొని గిఫ్ట్ గా ఇచ్చింది శ్రీముఖి. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు ఇద్దరికీ కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం ఫోర్డ్ కంపెనీ కారు ఎందుకు కొన్నావు అంటూ శ్రీముఖిని ప్రశ్నిస్తున్నారు. ఫోర్డ్ భారత్‌లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి కారు కొనడం కరెక్ట్ కాదంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భారత్ ను విడిచి వెళ్లే కంపెనీ కారు కొనడంపై నెటిజన్లు కాస్త అసహనంతో ఉన్నారు. ఇకపోతే శ్రీముఖి 2019 మార్చిలో ఖరీదైన బెంజ్ కారుని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీముఖి యాంకర్ గానే కాకుండా గ్లామర్ నటిగాను వెండితెరపై సత్తా చూపిస్తోంది. ఇటీవల క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో మెరిసిన శ్రీముఖి.. మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…