Sri Reddy: జగనన్న పార్టీని నమ్ముకున్నా ఒరిగిందేమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి!

Sri Reddy:వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి సంచలన తార శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా సంచలనం సృష్టించారు. ఈ వివాదంతో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన శ్రీ రెడ్డి ప్రస్తుతం సినిమాలకు దూరమై యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈమె సినిమాల పరంగా రాజకీయ పరంగా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను తెలియచేస్తూ ఉన్నారు.

Sri Reddy: జగనన్న పార్టీని నమ్ముకున్నా ఒరిగిందేమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి!

ఇకపోతే రాజకీయంగా పవన్ కళ్యాణ్ పైతోక తొక్కిన త్రాచులా బుసలు కొట్టే శ్రీ రెడ్డి జగన్ పార్టీకి ఎప్పుడూ మద్దతుగా ఉంటూ ఆయనపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తనదైన శైలిలో తిప్పికొడుతూ ఉంటుంది.ఇలా వైయస్సార్సీపి పార్టీకి మద్దతుగా నిలిచిన శ్రీ రెడ్డి తాజాగా పార్టీ వ్యవహారశైలిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఫేస్ బుక్ వీడియో ద్వారా ఈమె ఒక వీడియో షేర్ చేస్తూ పార్టీ వ్యవహారశైలి గురించి తెలియజేశారు.

Sri Reddy: జగనన్న పార్టీని నమ్ముకున్నా ఒరిగిందేమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి!

తాను ఇన్నిరోజులు పార్టీలో ఎంతో చురుగ్గా ఉంటూ జగన్ పార్టీకి మద్దతు తెలపడంతో తన అకౌంట్లో డబ్బులు పడతాయని చాలామంది భావిస్తారు నిజానికి వైయస్ఆర్సిపి పార్టీని నమ్ముకున్నందుకు తనకు రూపాయి ఆదాయం లేదని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి తెలిపారు.అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని వచ్చే ఎన్నికలలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తే చిక్కుల్లోపడతారని సూచించారు.

గతంలో వచ్చిన సీట్ల కన్నా పది లేదా 20 సీట్లు తక్కువ వచ్చినా కానీ ప్రజలలో అసంతృప్తి ఉందని అర్థం. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న వారిని గుర్తించకుండా అర్హత లేని వారికి పదవులు కట్టబెడుతూ ప్రభుత్వం తప్పు చేస్తోందని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి వెల్లడించారు. ఇక పోతే తన సొంత ఊరిలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి తన తండ్రితో పాటు ఈమె ఎంతో కష్టపడుతోంది. గత ప్రభుత్వం హయాంలో గుడి నిర్మాణానికి రావాల్సిన నిధులు వచ్చాయని అయితే ఈ ప్రభుత్వ హయాంలో గుడికి ఒక్క రూపాయి కూడా సహాయం అందలేదని శ్రీరెడ్డి ఆరోపించారు.

పార్టీ వల్ల ఏ ప్రయోజనం లేదు..

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన కల నెరవేరబోతుందని ఎంతో సంతోషపడ్డాను అయితే ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడిన, ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగిన గుడికి రావాల్సిన నిధులు మాత్రం రాలేదని, జగనన్న పార్టీని నమ్ముకున్నందుకు తనకు రూపాయి లాభం లేకపోయినా కనీసం తన గుడి నిర్మాణానికి డబ్బులు అందుతాయని భావించాను చివరికి అది కూడా నెరవేరలేదని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి వైయస్సార్ సీపీ పార్టీ గురించి కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి శ్రీ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ప్రభుత్వం గుడి నిర్మాణానికి కావలసిన నిధులను ఏర్పాటు చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.