Madhunandhan : 2001 లో విడుదలైన నువ్వు నేను సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన మధునందన్, చాలా సినిమాల్లో హీరోకి ఫ్రెండ్ పాత్రల్లో మెరిసాడు. మధ్యలో అమెరికా వెళ్లిపోయిన మధు మళ్ళీ సినిమా మీద ప్రేమతో ఇండియా వచ్చి అవకాశాల కోసం తిరిగాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాల్లో చేస్తూ వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టాడు.
చాలా డబ్బు నష్టపోయా, చిరు కోసం కాలు విరగ్గొట్టా….
సినిమాల్లోను, ఉద్యోగంలో సంపాదన అంతా వ్యాపారంలో నష్టపోయానని దాదాపు 25 లక్షల వరకు నష్టపోయినట్లు చెప్పారు. స్నేహితులతో కలిసి వ్యాపారం చేసి అందరూ నష్టపోయామని చెప్పారు. ఇక ఉప్పల్ లో పెరిగిన మధునందన్ చిన్నప్పటి నుండి మెగాస్టార్ అభిమాని. ఇక తన అభిమాన హీరో సినిమా ప్లాప్ అయినపుడు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్ అయిన తన బంధువులబ్బాయి ఎగతాళి చేస్తే తమాషాగా గొడవ పడుతూ అనుకోకుండా కాలు విరగ్గొట్టానని చిన్నతనంలో చాలా ఆవేశం తో ఉండేవాడినని గుర్తుచేసుకున్నాడు.
డైరెక్టర్ తేజ చితకబాదుతాడు….
ఎక్కువగా నితిన్ సినిమాల్లో ఫ్రెండ్ పాత్రల్లో మెరిసిన మధునందన్ మొదటి సినిమా ‘నువ్వు నేను’ సమయంలో, రాజమౌళి ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాలో ఒకే సారి అవకాశం వచ్చి రెండు సినిమాలకు ఓకే చేసానని, కానీ రెండు సినిమాల షూటింగ్స్ ఏక కాలంలో ఉండటంతో డైరెక్టర్ తేజ గారు కొడతారనే భయంతో ‘స్టూడెంట్ నెంబర్ 1’ వదులుకుని నువ్వు నేను సినిమా చేసానని ఆ తరువాత మళ్ళీ రాజమౌళి ‘సై’ సినిమాలో చేసినపుడు రాజమౌళి గారితో ఇంటి సభ్యుడిగా మెలిగేవాడట. ఇటీవల రాజమౌళిని చూసినపుడు మాట్లాడటానికి భయమేసిందని చాలా పెద్ద దర్శకుడు ఆయనతో మాట్లాడాలంటే భయమేసిందటు చెప్పారు.
లాక్ డౌన్ తరువాత మళ్ళీ కెరీర్ బాగా ఉందని మంచి పాత్రలు సినిమాల్లో వస్తున్నాయని చెప్పారు. మధునందన్, లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య, డైరెక్టర్ చందు మొండేటి మంచి స్నేహితులు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…