శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 68 కాలేజీలకు గుర్తింపును రద్దు చేస్తూ ఆయాకాలేజిలకు ఇంటర్ బోర్డు నోటీసులు జరీ చేసింది. అయితే ఇందులో శ్రీచైతన్య విద్యాసంస్థ కు సంబంధించి 18 కాలేజీలు, నారాయణ విద్యాసంస్థకు సంబందించిన 26 కాలేజీలకు ఈ నోటీసు జరీ చేసినట్టు తెలుస్తుంది. అయితే యాజమాన్యాలకు ఈమెయిల్ ద్వారా సమాచారం పంపంచారట.
గతంలో గుర్తింపు లేని కాలేజీలను రద్దు చేయాలని సామాజిక కార్యకర్త రాజేష్ దాఖలు చేసిన పిటీషన్ పై గతంలో తెలంగాణ హైకోర్ట్ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో గుర్తింపులేని కళాశాలల వివరాలపై నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డును సూచించింది హైకోర్టు. మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షల జరగాల్సిన నేపథ్యంలో కాలేజీలపై వేటువేస్తే ఆ ప్రభావం విద్యార్థులపై పడుతుందని అందుకే పరీక్షలు అయిపోయిన తరువాత నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అప్పట్లోనే తెలంగాణ ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. అయితే ఇరువురి వాదోపవాదనలు విన్న హైకోర్టు ఎన్ఓసి లేని కాలేజీలపై చర్యలు తీసుకుని ఏప్రిల్ 3న తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మొత్తానికి హైకోర్టు ఆదేశాలమేరకు తాజాగా నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకుంది తెలంగాణ ఇంటర్ బోర్డు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…