Categories: FeaturedMovie News

Sudigali Sudheer: శ్రీదేవి డ్రామా కంపెనీలో షోలో సందడి చేసిన సుధీర్… సంతోషంలో రష్మి!

Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా సందడి చేస్తున్న ఈయన అనంతరం ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో కూడా సందడి చేస్తూ వచ్చారు.ఇలా ఈ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ ఆటో రాంప్రసాద్ గెటప్ శ్రీను ఈ ముగ్గురు ఒకే టీం గా సందడి చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు.ఇలా రోజు రోజుకు సుధీర్ క్రేజ్ పెరిగిపోతూ ఉండడంతో ఈయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.ఇలా సినిమాలతో బిజీ కావటం వల్లే ఈయన బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు. అయితే సుధీర్ వెళ్లిపోవడంతో సుదీర్ లేని లోటు స్పష్టంగా కనపడుతుంది.

ఈ క్రమంలోనే ఎలాగైనా సుధీర్ ఈ కార్యక్రమాలలో సందడి చేయాలని అభిమానులు కోరుకున్నారు. తాజాగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుదీర్ సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. అయితే ఈ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ సందడి చేయడంతో ఒక్కసారిగా వేదికపై ఉన్నటువంటి రష్మీ ముఖం సంతోషంతో వెలిగిపోయింది.


Sudigali Sudheer: పర్మినెంట్ గా ఉండిపోతారా…

ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా రష్మీ మధ్య ఏదో ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే కేవలం షో రేటింగ్ కోసమే వీరి మధ్య ఇలాంటి లవ్ ట్రాక్ క్రియేట్ చేశారని తెలిసినప్పటికీ నిజజీవితంలో కూడా వీరిద్దరూ ఒకటైతే బాగుండేదని ఎంతోమంది అభిమానులు కోరుకున్నారు. అయితే చాలా కాలం తర్వాత సుధీర్ ఒక్కసారిగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలోకి రావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే సుధీర్ పర్మినెంట్ గా ఈ కార్యక్రమంలో కొనసాగడం కోసం వచ్చారా లేకపోతే గెస్ట్ మాదిరిగా ఈ కార్యక్రమంలో సందడి చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago