Featured

Super star Krishna house keeper : మహేష్ బాబు మంచోడు… నరేష్ పట్టించుకోడు, ఎలాంటి వాడంటే… బస్తి లీడర్స్ మమ్మల్ని బెదిరిస్తే కృష్ణ, విజయ నిర్మల గారు ఏమి చేసారంటే : కృష్ణ గారి పనిమనిషి లక్ష్మమ్మ అల్లుడు

Super star Krishna House keeper : సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించాక ఆయనకు ఇప్పటికీ ఎంత మంది అభిమానులు ఉన్నారో ఇప్పటి తరం వారికి అర్థమైంది. అలాగే ఆయన ఎంతో మందికి సహాయం చేసి ఆదుకున్నారు ఆలాంటి విషయాలన్నీ ఇప్పుడు బయటికి వస్తున్నాయి. కృష్ణ గారి పద్మాలయా స్టూడియోలో హౌస్ కీపర్ గా పనిచేసిన లక్ష్మమ్మ అనే పని మనిషి కుటుంబానికి కృష్ణ గారు అలాగే విజయనిర్మల గారు చేసిన సహాయం గురించి ఆమె, ఆమె కుటుంబ సభ్యులు తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె కూతుర్లను తమ కూతుర్లుగా చూసి బాధ్యతగా వారే పెళ్లి చేయించి వాళ్ళ పిల్లల పెళ్లిళ్లు కూడా చేసినట్లు చెప్పారు.

విజయ నిర్మల గారు చనిపోతే మహేష్ బాబు అలా చేసారు…

కృష్ణ గారు, విజయ నిర్మల గారు లక్ష్మమ్మ కుటుంబాన్ని మొదటి నుండి బాగా చూసుకున్నారు అంటూ లక్ష్మమ అల్లుడు చెప్పారు. నలభై ఏళ్లకు పైగానే లక్ష్మమ్మ అక్కడ పనిచేసింది. ఆమె పని మానేసాక కూతుర్లు కోడళ్ళు అక్కడే పనిచేస్తున్నారు అంటూ చెప్పారు. కూతుర్ల పెళ్లిళ్లకు లక్ష రూపాయలు ఇచ్చి తులం బంగారం పెట్టి వాళ్ళు పెళ్ళికి వచ్చి మాతో ఫోటో తీసుకుని వెళ్లారని, ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లకు అలానే చేసారని లక్ష్మమ్మ అల్లుడు చెప్పారు. ఇక లక్ష్మమ్మ మనవళ్ళ మనవరాళ్ళ పెళ్లిళ్లకు కృష్ణ, విజయనిర్మల గారు వచ్చారని చెప్పారు.

వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా కృష్ణ, విజయనిర్మల గారి పుణ్యమే అంటూ చెప్పారు. బస్తిలో మొదట గుడిసె వేసుకున్నపుడు బస్తి లీడర్లు గొడవ చేస్తే విజయనిర్మల గారు వారితో మాట్లాడి మాకు ఇప్పించారు. అదే గుడిసె ను ఇల్లు కట్టుకోడానికి సహాయం చేసారు. ఆ ఇంటి గృహప్రవేశం కి పిలిచినా వచ్చారు. అలా మాకు ఇప్పటికీ అన్నం పెడుతోంది వాళ్ళే. ఇక విజయ నిర్మల గారు చనిపోయినప్పుడు కార్యక్రమాలు పూర్తయ్యాక మహేష్ బాబు గారు పిలిచి లక్ష్మమ్మ ఆమె కూతుర్లకు చెరో ఇరవై వేలు అమ్మ పేరు మీద ఇస్తున్నా తెసుకోండి అని ఇచ్చారు. కృష్ణ విజయనిర్మల గారి తరువాత మహేష్ బాబు గారు మమ్మల్ని పట్టించుకుంటారు పండగలకు అలా డబ్బులుస్తారు. నరేష్ పెద్దగా ఎవరినీ పట్టించుకోరు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

ఆరోగ్యంగా ఉండాలంటే సీజన్ చేంజ్‌లో చేయాల్సింది ఇదే!

వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…

3 hours ago

బీపీ, షుగర్ మాత్రమే కాదు.. 40 తర్వాత ఈ టెస్టులు కూడా అవసరం!

40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…

3 hours ago

చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ ఘాటు కౌంటర్..!

మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…

3 hours ago

అక్షయ తృతీయ స్పెషల్: వాహనం కొనేటప్పుడు ఈ విషయాలు మిస్ అవొద్దు!

అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…

3 hours ago

పిల్లల్లో ఆటిజం సంకేతాలు ఇవేనా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి

పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…

3 hours ago

తిరుమల మాడ వీధుల రహస్యాలు.. ఈ ప్రదక్షిణకు అంతటి పవిత్రత ఎందుకు?

తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…

3 hours ago