Categories: FeaturedGeneral News

సూపర్ మార్కెట్లో వివక్ష.. చైనీయులనే అనుమానంతో అనుమతించని సెక్యూరిటీ…మంత్రి కేటీఆర్ ఆగ్రహం.. !!

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా ఫీవర్ తో వణికిపోతున్నారు. ఎవరైనా తుమ్మినా..దగ్గినా.. కరోనా భయంతో ప్రజలు కంగారు పడిపోతున్నారు. ఇంకా విదేశీయులు అయితే ఆ భయం మరింత ఎక్కువవుతుంది.. అందులోను చైనీయులైతే అసలు దగ్గరకి వెళ్లేందుకే భపడుతున్నారు. ప్రస్తుతం ఇటువంటి సంఘటనే హైదరాబాద్ వనస్థలిపురంలోని జరిగింది. వివరాల్లోకి వెళితే..

విదేశీయులను పోలి ఉన్న ఇద్దరు వ్యక్తులను సూపర్ మార్కెట్ లోనికి అనుమతించడానికి ససేమిరా అన్నారు అక్కడకి సెక్యూరిటీ గార్డ్ లు. చూడటానికి చైనీయులులా కంపించడంతో వారిద్దరిని లోపలకి వెళ్ళడానికి అనుమతిలేదు అంటూ అక్కడనుంచి పంపించేశారు. కరోనా భయంతో వీరు ఈ వివక్ష చూపించినట్టుగా తెలుస్తుంది. నిజానికి వారిరువురు మన భారతీయులే. వారి స్వస్థలం మణిపూర్. అయితే వీరిపోలికలు కాస్త చైనీయులకు దగ్గరగా ఉండడంతో వారిరువురిని సూపర్ మార్కెట్ లోనికి అనుమతించలేదు ఆ సూపర్ మార్కెట్ నిర్వాహకులు. తాము భారతీయలమేనని మొత్తుకుంటున్నా వినలేదు. చివరికి ఆధార్ కార్డు చూపించినా సరే వారిని లోని అనుమతించలేదు.

అయితే తమ పట్ల ఇటువంటి వివక్ష చూపించడం అమానుషం అంటూ జరిగిన తతంగం అంతా వీడియోతీసి ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ కు పిర్యాదు చేసారు. జరిగిన ఘటనపై వెంటనే స్పందించిన కేటీఆర్ సూపర్ మార్కెట్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ ని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కమిషనర్లు, ఎస్పీ లకు తగిన సూచనలు చేయాలనీ డీజీపీ కి అయన విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనపై రాచకొండ కమిషనర్ మహేష్ భగత్ స్పందించారు. ఇటువంటి ఘటనలను సహించేది లేదని… ఒకవేళ ఎవరైనా ఇటువంటి వివక్ష చూపిస్తే 9490617234 నంబర్ కు ఫోన్ చేసి పిర్యాదు చేయాలనీ సూచించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago