Movie News

చిరంజీవికి పోటీగా రంగంలోకి దిగిన సూర్య.. గెలుపెవరిది?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా షూటింగ్ ఇటీవలె పూర్తి అయ్యింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం తెరకెక్కిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమాకు పోటీగా ఎవరు రంగంలోకి దిగటం లేదు.

కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు పోటీగా తమిళ హీరో సూర్య తన సినిమాని ఆచార్యకు పోటీగా పెడుతున్నారు. సూర్య ప్రస్తుతం దర్శకుడు పాండీరాజ్ తో ఎతరక్కుమ్ తునిందవన్ ఆ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు భారీగానే అంచనాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్రబృందం ఫిక్స్ చేశారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా విడుదల రోజునే మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా కూడా విడుదల కానుంది. రెండు మంచి సినిమాలు ఒకే రోజు విడుదల అవుతుండటంతో పోటీ కూడా బాగానే ఉంటుందని భావిస్తున్నారు. తెలుగులో తాజాగా ఈ సినిమాపై ఉన్న అంచనాలు దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు పోటీగా వెళ్లడం లేదు. కానీ ఎవరూ ఊహించని విధంగా సూర్య సినిమా పోటీకి రావడం అందరికీ షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం ఆచార్య సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

6 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

7 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

8 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

9 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

9 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

9 hours ago