Suriya: సినీ నటుడు సూర్య ప్రస్తుతం కంగువ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. శివ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. నవంబర్ 14వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో సూర్య పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇప్పటికే ఈయన సినిమాలలో ఎంతో మంది హీరోయిన్లు నటించారు అయితే ఓ హీరోయిన్ తో మాత్రం తనకు మళ్ళీ కలిసి నటించాలని ఉంది అంటూ తన మనసులో కోరికను ఈ సందర్భంగా సూర్య బయటపెట్టారు.
మరి సూర్య ఇంకోసారి నటించాలనుకుంటున్న ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికొస్తే ఆమె మరేవరో కాదు తన సతీమణి జ్యోతిక అంటూ ఈయన వెల్లడించారు. జ్యోతికతో కలిసి నేను మరోసారి స్క్రీన్ పై కనిపిస్తాననే కోరిక అలాగే ఉండిపోయిందని తెలిపారు .తనతో కలిసి మరోసారి నటించాలని ఉంది అంటూ సూర్య తెలిపారు.
ఇలా నేను జ్యోతిక నటించే సినిమా మాకోసమే అనే విధంగా ఉండాలి తప్ప ఏదో నేను చెప్పానని తన పాత్రను ఇరికించే ప్రయత్నాలు చేయకూడదని కండిషన్ కూడా పెట్టారు. నేనెప్పుడూ నాకోసం జ్యోతిక కోసం కథ రాయమని ఏ దర్శకుని అడగలేదని, ఆ కథ మాకోసమే అనే విధంగా ఉంటే తప్పకుండా తిరిగి తనతో కలిసి నటిస్తానని సూర్య తెలిపారు.
జ్యోతిక..
సూర్య తన భార్యతో కలిసిన నటించాలని ఉందనే కోరిక బయట పెట్టడంతో ఈ అవకాశాన్ని ఎంతో మంది దర్శక నిర్మాతలు ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు. ఇక వీరిద్దరూ కలిసి పూవెల్లామ్ కేట్టుప్పార్, ఉయి రిలే కలందదు, కాక్క కాక్క, పేరళగన్, మాయావి, సిల్ల న్ను ఒరు కాదల్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…