Taapsee: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్, సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది తాప్సీ. కాగా ఈమె తెలుగులో దరువు, మొగుడు, మిషన్ ఇంపాజిబుల్, షాడో నీవెవరో,ఆనందో బ్రహ్మ, ఆడు కలం,వస్తాడు నా రాజు, ఝుమ్మంది నాదం, సాహసం,నీడ,గుండెల్లో గోదారి లాంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తమిళం హిందీ సినిమాలలో ఎక్కువగా నటిస్తూ దూసుకుపోతోంది. అందులో భాగంగానే తాజాగా షారుక్ ఖాన్ హీరోగా నటించిన కి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. భారత్ నుంచి ఎన్నో దేశాలు దాటి యూకేలోకి అక్రమంగా ప్రవేశించే స్నేహితుల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమా సక్సెస్‌లో భాగంగా తాప్సీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి వీసా నిబంధనల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ.. వీసా కోసం ప్రస్తుతం అమలుచేస్తోన్న నిబంధనలు కఠినంగా ఉన్నాయి. సమాజంలోని పేదవాళ్లకు అవి వర్తించడం దురదృష్టకరం. కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్ చూపించి ధనవంతులు సులభంగా వీసా పొందుతారు.
బ్యాంకు బాలన్స్ తక్కువ ఉండడంతో అలా..
తక్కువ ఆదాయం ఉన్నవారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఆ కారణంతోనే మా చిత్రబృందం లోని చాలామంది ఇబ్బందులు పడ్డారు. బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువ ఉన్నందున డంకీ యూనిట్‌లోని కొంతమంది యూకే వీసా పొందలేకపోయారు అని తాప్సీ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలామంది ఆమె మాటలను ఏకీభవిస్తూ అవును మేడం చాలా సూపర్ గా చెప్పారు సామాన్యుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే తాప్సీ పన్ను సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా కోసం తాప్సీ వర్క్ చేస్తున్నారు. హసీన్ దిల్‌రుబా సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. జయ్‌ప్రద్ దేశాయ్ దర్శకత్వంలో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…