Tag Archives: ప్రియా

Surekha Vani: సురేఖ వాణి ఇంట్లో గెట్ టుగెదర్ అయినా సీనియర్ నటిమనులు… వైరల్ అవుతున్న డాన్స్ వీడియో!

Surekha Vani: సురేఖ వాణి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలలో అక్క వదిన పిన్ని పాత్రలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే ఈమెకు అవకాశాలు రాకపోవడంతోనే ఇండస్ట్రీకి దూరమయ్యానని పలు సందర్భాలలో తెలియజేశారు.

ఇలా సినిమా అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం సురేఖ వాణి హవా కొనసాగిస్తున్నారు. తన కూతురితో కలిసి పొట్టి దుస్తులు ధరిస్తూ ఈ తల్లి కూతుర్లు చేసే హంగామా మామూలుగా ఉండడం లేదు. ఇలా తరచూ తల్లి కూతుర్లు కలిసి డాన్స్ లు చేయడం ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వీరిద్దరూ ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా మరొక డాన్స్ వీడియోని షేర్ చేశారు. అయితే ఇందులో తన కూతురు సుప్రీతకు బదులుగా ఇండస్ట్రీకి చెందిన నటీమణులు అందరూ కూడా తన ఇంట్లో గెట్ టుగెదర్ అయ్యారు. సీనియర్ నటిమలు అయినటువంటి సనా, బిగ్ బాస్ ప్రియా, హేమ, వంటి తదితరులు 12 మంది వరకు అందరూ సురేఖ వాణి ఇంట్లో గెట్ టుగెదర్ అయ్యారు.


Surekha Vani: రారా రక్కమ్మా అంటూ రెచ్చిపోయిన నటీమణులు…

ఇలా అందరూ కలిసి సరదాగా గడపడమే కాకుండా ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదే విధంగా ఈ నటీమణులు అందరూ కలిసి రారా రక్కమ్మా అంటూ అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఇక ఈ డాన్స్ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.