Surekha Vani: సురేఖ వాణి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలలో అక్క వదిన పిన్ని పాత్రలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే ఈమెకు అవకాశాలు రాకపోవడంతోనే ఇండస్ట్రీకి దూరమయ్యానని పలు సందర్భాలలో తెలియజేశారు.
ఇలా సినిమా అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం సురేఖ వాణి హవా కొనసాగిస్తున్నారు. తన కూతురితో కలిసి పొట్టి దుస్తులు ధరిస్తూ ఈ తల్లి కూతుర్లు చేసే హంగామా మామూలుగా ఉండడం లేదు. ఇలా తరచూ తల్లి కూతుర్లు కలిసి డాన్స్ లు చేయడం ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వీరిద్దరూ ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా మరొక డాన్స్ వీడియోని షేర్ చేశారు. అయితే ఇందులో తన కూతురు సుప్రీతకు బదులుగా ఇండస్ట్రీకి చెందిన నటీమణులు అందరూ కూడా తన ఇంట్లో గెట్ టుగెదర్ అయ్యారు. సీనియర్ నటిమలు అయినటువంటి సనా, బిగ్ బాస్ ప్రియా, హేమ, వంటి తదితరులు 12 మంది వరకు అందరూ సురేఖ వాణి ఇంట్లో గెట్ టుగెదర్ అయ్యారు.
ఇలా అందరూ కలిసి సరదాగా గడపడమే కాకుండా ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదే విధంగా ఈ నటీమణులు అందరూ కలిసి రారా రక్కమ్మా అంటూ అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఇక ఈ డాన్స్ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…