Rama Prabha: తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రమాప్రభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు అయితే ప్రస్తుతం వయస్సు పై పడటంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇక ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉండడంతో ఈమె ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని ఈమె పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అంటూ పెద్ద ఎత్తున రమాప్రభ గురించి వార్తలు వస్తున్నాయి. ఇలా తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై నటి రమా ప్రభ స్పందించారు.
ఈ సందర్భంగా ఆమె తన గురించి వస్తున్నటువంటి ఈ తప్పుడు వార్తల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తాను ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం లేదని తన పరిస్థితి మరి దారుణంగా లేదని తన గురించే వచ్చే ఈ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని తెలిపారు. తానేమి అడుక్కుతినే పరిస్థితులలో లేనని,నేను ఎలాంటి జీవితం గడుపుతున్నానో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదివరకే తెలియచేశాను..
ఇక నన్ను తమకు సొంత కుటుంబ సభ్యులుగా భావించినటువంటి చిరంజీవి పూరి జగన్నాథ్ వంటి వారు తనకు ఇప్పటికీ సహాయం చేస్తున్నారు కనుక అది కూడా అడుక్కుతిన్నట్టు కాదని, ప్రస్తుతం తన పరిస్థితి బాగా ఉందని ఈ సందర్భంగా రమాప్రభ తన గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించి అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…