Movie News

Taraka Ratna: తారకరత్న ట్రీట్మెంట్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నది ఎవరో తెలుసా?

Taraka Ratna: నందమూరి తారకరత్న నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సుమారు 21 సినిమాలలో నటించారు. అయితే ఈయన నటించిన ఈ సినిమాలలో రెండు మూడు యావరేజ్ హిట్ లు మాత్రమే అందుకున్నాయి. మిగిలిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ కావడంతో ఈయనకు సినిమాలు పెద్దగా కలిసి రాలేదని అందరూ భావించారు.పెద్దపెద్ద బ్యానర్లలో టాప్ డైరెక్టర్ల దర్శకత్వంలో నటించినప్పటికీ ఈయన సినిమాలో సక్సెస్ కాకపోవడంతో క్రమక్రమంగా తారకరత్న ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈ నందమూరి హీరో రాజకీయాలలో రావడానికి ఎంతో ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధమైనటువంటి తారకరత్న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కు మద్దతు తెలుపుతూ ఉన్నఫలంగా గుండెపోటుకు గురయ్యారు.

ఇలా గుండెపోటుకు గురైన ఈయనని తొలుత కుప్పంలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈయన హాస్పిటల్లో చేరి వారం రోజులు అవుతున్నప్పటికీ ఇంకా స్పృహలోకి రాలేదని తెలుస్తోంది. సోషల్ మీడియా సమాచారం ప్రకారం ఈయనకు మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిర్ అంబులెన్స్ లో విదేశాలకు తరలిస్తున్నారనే వార్తలు కూడా వినపడుతున్నాయి.

Taraka Ratna: వైద్య ఖర్చులను భరిస్తున్న చంద్రబాబు నాయుడు… లోకేష్…

ఇలా మెరుగైన వైద్యం కోసం ప్రముఖ హాస్పిటల్ కు తారకరత్నను తీసుకెళ్లడంతో ఈయన వైద్యం ఖర్చులకు కూడా భారీగానే ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈయనకు వైద్య చికిత్సల కోసం రోజుకు లక్షల్లో ఖర్చవుతుందట. ఇప్పటికే సుమారు 80 లక్షలకు పైగా ఖర్చు చేసినట్టు సమాచారం. అయితే ఈ ఖర్చును మొత్తం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ భరిస్తున్నట్లు తెలుస్తోంది.నందమూరి కుటుంబంలో కాస్త వెనుకబడ్డ వారిలో తారకరత్న ఉన్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఈయన వైద్య ఖర్చులను వారే భరించడమే కాకుండా తన భార్య పిల్లలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago