Tag Archives: allari priyudu

‘జెంటిల్‌మ్యాన్’ సినిమాను రాజ‌శేఖ‌ర్‌ వదులుకోవడానికి గల కారణం ఇదే..

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ప్రతీ సినిమా బంపర్ హిట్ అయ్యాయి. అతడి దర్శకత్వ మెలకువలు అలా ఉంటాయి మరి. ప్రతీ సినిమాలో ఏదో విభిన్నమైన కథాంశాన్ని తెరకెక్కిస్తారు. అయితే అతడి మొట్టమొదటి సారిగా దర్శకత్వం వహించిన సినిమా జెంటిల్ మెన్.

ఇందులో అర్జున్ హీరోగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా బంపర్ హిట్ కొట్టింది. అప్పటి నుంచి శంకర్ పేరు సినీ పరిశ్రమలో మారుమోగిపోయింది. తర్వాత అతడు పట్టిందల్లా బంగారమే అన్నట్లు ప్రతీ సినిమా హిట్ బాటలో నడిచాయి. జెంటిల్ మెన్ నుంచి మొన్న వచ్చిన రోబో 2.0 వరకు తన దర్శకత్వ మార్కును చూపించారు.

ఇదిలా ఉండగా.. 1993 లో వచ్చిన జెంటిల్‌మ్యాన్ సినిమాని మొద‌ట శంక‌ర్ డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్‌తో తీయాలనుకున్నారట. అప్పట్లో రూ.10 లక్షలు చేతపట్టుకొని అతడి వద్దకు వెళ్లాడట శంకర్ . ఎందుకంటే అప్పట్లో రాజశేఖర్ నటించిన సినిమాలు ఆహుతి, అంకుశం వంటి సినిమాలు అతడికి మంచి ఫేమ్ తీసుకొచ్చాయి. అయితే శంకర్ చెప్పిన సినిమాను అతడు తిరస్కరించాడట..

ఎందుకంటే.. అతడు అప్పటికే కె. రాఘ‌వేంద్ర‌రావుతో ‘అల్ల‌రి ప్రియుడు’ సినిమా చేయ‌డానికి అంగీక‌రించి, దానికి డేట్స్ ఇచ్చేశారు రాజ‌శేఖ‌ర్‌. జెంటిల్ మ్యాన్ కథ రాజశేఖర్ కు నచ్చినా డేట్స్ ఇవ్వడానికి కుదరలేదు. దీంతో అలా రాజశేఖర్ జెంటిల్ మ్యాన్ సినిమాను మిస్ చేసుకున్నారు. జెంటిల్‌మ్యాన్‌ సినిమాను వదులుకోవడం తన కెరీర్ లో పెద్ద లాస్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

హీరో రాజశేఖర్ డాన్స్ చూసి.. చిరంజీవి ఫోన్ చేసి ఏమన్నారో తెలుసా?!

సీనియర్ హీరోల్లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వారిలో జీవిత రాజశేఖర్ ఒకరు. అతడు ఎక్కువగా కోపంతో ఉన్న పాత్రలను నటించేవాడు. అయితే ఇదంతా రాజశేఖర్, రాఘవేందర్ రావు కాంబినేషన్ లో వచ్చిన అల్లరిప్రియుడు సినిమాకు ముందు మాట. వీరిద్దరు కలిసి సినిమా తీస్తున్నారంటే.. చాలామంది విమర్శలు చేశారట.

రాఘవేంద్ర రావు సినిమాలు క్లాస్ గా.. ఓ లవ్ యాంగిల్లో సినిమాలు ఉంటాయి.. అలా రాజశేఖర్ నటించే సినిమాలు మొత్తం మాస్ గా.. సీరియస్ గా ఉన్న క్యారెక్టర్లు చేస్తారు.. వీరిద్దరి మధ్య పెయిర్ కదురుతుందో లేదో.. అని అప్పట్లో సినీ ఇండస్ట్రీలో అందరూ చర్చించుకున్నారట. ఎవరి రూట్ లోకి.. ఎవరు వస్తున్నారో అర్థం కానీ పరిస్థితి. అయితే ఈ సినిమాను బాలివుడ్ లోని మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచిన సాజన్ మూవీ స్పూర్తితో ఈ సినిమాను తెరకెక్కించారు.

అనుకున్నట్టుగానే సినిమా విడుదల చేశారు. అల్లరి ప్రియుడు సినిమాలో రాజశేఖర్ అంతకముందు వేయని డ్యాన్స్, స్టెప్పులతో అందరినీ అలరించారు. రాజశేఖర్ నుంచి ఒక లవర్ బాయ్ యాంగిల్ ని తీసుకొచ్చారు రాఘవేంద్రరావు. ఇలా ఈ సినిమాలో రమ్యకృష్ణ, మధుబాలతో కలిసి అదిరిపోయే స్థాయిలో స్టెప్పులు వేశారు హీరో రాజశేఖర్.

సీరియస్ పాత్రల్లో నటించే రాజశేఖర్.. ఇలాంటి లవ్ యాంగిల్ ఉన్న పాత్రలో కూడా ఒదిగిపోయి నటించడంతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. అతడి కెరీర్ లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. అతడు వేసిన స్టెప్పులకు చిరంజీవి సైతం ఆశ్చర్యపోయారట. రాజశేఖర్ ఇంత బాగా డాన్స్ చేయగలడా అని అనుకున్నారట. ఆ సమయంలో రాజశేఖర్ కు ఫోన్ చేసి మరీ అభినందించారట. తర్వాత 100 రోజుల ఫంక్షన్ కి కూడా చిరంజీవి హాజరై.. షీల్డ్ ను ప్రధానం చేశారు.