Tag Archives: allu ramalingayya

Chiranjeevi : చిరంజీవి సురేఖను పెళ్లి చేసుకోవడం అయన తండ్రికి ఇష్టం లేదు.. కారణం ఏమిటంటే? డైరెక్టర్ ధవళ సత్యం షాకింగ్ కామెంట్స్ !

Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని మెగాస్టార్ అనే బిరుదుతో ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరంజీవి గురించి అందరికీ సుపరిచితమే. ఈయన నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

తాజాగా ప్రముఖ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ధవళ సత్యం ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చిరంజీవి పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎదుగుతున్న క్రమంలో, ధవళ సత్యం దర్శకత్వంలో జాతర సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా అల్లు అరవింద్ పని చేశారు. ఇకపోతే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం అనంతరం మెగాస్టార్ కి మరిన్ని అవకాశాలు రావడం ఆయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం జరిగిపోయింది.

ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా కూడా జాతర సినిమాని కాపీ కొట్టారు అంటూ పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన దవళ సత్యం తాను ఇప్పటివరకు రంగస్థలం సినిమా చూడలేదని తెలియజేశారు. రంగస్థలం సినిమా విడుదల అవగానే ఎంతో మంది తనకు ఫోన్ చేసి జాతర సినిమా దించేసారని చెప్పినట్లు ఈ సందర్భంగా ధవళ సత్యం వెల్లడించారు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గురించి అల్లు రామలింగయ్య ఒక సందర్భంలో తన వద్దకు చిరంజీవి గురించి ఆరా తీశారు. ఈ విధంగా అల్లు రామలింగయ్య చిరంజీవి గురించి అడగడంతో తన గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పాను. అయితే అబ్బాయిని చూడచ్చు అంటారా అని రామలింగయ్య అడిగారు. ఇక అప్పుడు నాకు తన పెళ్లి విషయం గురించి మాట్లాడుతున్నారని అర్థం అయి తను ఎప్పటికైనా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా పేరు సంపాదించుకున్నారని, కుర్రాడు చాలా మంచోడని అల్లు రామలింగయ్య దగ్గర చెప్పినట్లు ధవళ సత్యం ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం..

ఇకపోతే చిరంజీవి తండ్రికి ఈ విషయాన్ని చెప్పగా ఆయన చిరంజీవి పెళ్ళి సురేఖ గారితో చేయడానికి ఇష్టపడలేదు. అందుకు గల కారణం అల్లు రామలింగయ్య కుటుంబం సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి అమ్మాయి అంటే తను తన ఫ్యామిలీలో ఉండగలదా అంటూ వీరి పెళ్లి చేయడానికి నిరాకరించారు. ఆ సమయంలో నేను అల్లు రామలింగయ్య కుటుంబం గురించి వివరించడం వల్ల ఆయన తన పెళ్లికి ఒప్పుకున్నారని అలా చిరంజీవి గారి పెళ్లి జరిగిందని సత్యం ఈ సందర్భంగా తెలిపారు.

Allu Ramalingaiah : సినిమాల్లో కామెడీకి కాస్తంత విలనిజాన్ని కలగలిపి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లురామలింగయ్య !

Allu Ramalingaiah : ఆయన హాస్యం మూడు తరాల ప్రేక్షకులను అలరించింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టిన అల్లురామలింగయ్యకు చిన్నప్పుడు చదవు పెద్దగా అబ్బలేదు. తోటి మిత్రలతో తిరుగుతూ వారిని నవ్విస్తూ కాలం గడిపేవారు. కొద్ది కాలం తరువాత నాటకాల్లో నటించాలన్న ఆసక్తి కలిగింది. దీంతో ఊర్లోకి నాటకాల వారు వచ్చిన ప్రతి సారీ వారి వెంట తిరుగుతూ వారితే స్నేహం చేస్తూ ఏదో ఒక చిన్న వేషం ఇవ్వమని అడిగేవారట. ఆయన ఆసక్తిని మెచ్చిన వారు చిన్న అవకాశం ఇవ్వడం అలా తనకు వచ్చిరాని నటనతో మెప్పించడంతో తన నట జీవితాన్ని నాటకాలతో ప్రారంభించారు అల్లు రామలింగయ్య. 

అప్పట్లో ఓ వైపు నాటకాల్లో పాల్గొంటూనే గాంధీజి పిలుపుతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. అక్కడ కూడా సమయాన్ని వృధా చేయలేదు. తోటి వారిని ఏకం చేసి నాటకాలను ప్రదర్శించేవారు. జైలు నుంచి విడుదలైన తరువాత కూడా నాటకాలపైనే ఆసక్తి ఉండేది రామలింగయ్య గారికి అలా ఓ సారి గరికపాటి రాజారావు అల్లు రామలింగయ్య నటనను చూసి సినిమాల్లో తొలిసారిగా అవకాశం ఇచ్చారు. 1952 లో విడుదలైన పుట్టిల్లు చిత్రంలో మొదటి సారిగా నటించారు. ఆ తరువాత వద్దంటే డబ్బు, మూగమనసులు, దొంగరాముడు, మాయాబజార్, ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం ఇలా ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన హాస్యంతో అలరించారు అల్లు రామలింగయ్య. 

కొన్ని కొన్ని సినిమాల్లో కామెడీకి కాస్తంత విలనిజాన్ని కలగలిపి పోషించిన పాత్రలు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి. చిత్ర పరిశ్రమలో గాడ్ ఫాదర్‌లు , సపోర్ట్ చేసే వారు ఎవరూ లేకపోయినా కేవలం తన నటన, మనోధైర్యంతో ముందుకు సాగుతూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా సుమారు వెయ్యికిపైగా సినిమాల్లో కామెడీ విలన్ పాత్రలను పోషించారు అల్లు. అప్పట్లో కొన్ని పాటల్లోనూ తన విభిన్నమైన శైలితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా అనే పాటే అప్పట్లోనే కాదు ఇప్పటికీ ట్రెండీ సాంగ్ గానే హిట్ లిస్ట్ లో ఉంది. 90లలోనూ ఆయన అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తాను నవ్వుతూ తోటి వారిని నవ్విస్తూ 50 ఏళ్లు సినీ ఇండస్ట్రీలో కొనసాగిన ఈ సినీ దిగ్గజానికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు సొంతమయ్యాయి. మాయాబజార్ సినిమాల్లో అల్లు రామలింగయ్య నటించిన హాస్య సన్నివేశాలు ఇప్పటికీ ఎంతోగానో అలరిస్తాయి.  

Allu Ramalingaiah : ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన అల్లు రామలింగయ్య

అల్లు రామలింగయ్య నిర్మాతగానూ గీతా ఆర్ట్స్ బానెర్ పైన అనేక చిత్రాలను నిర్మించారు. అవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక అప్పటి స్టార్ హీరో చిరంజీవి ని తన అల్లుడిని చేసుకున్నారు అల్లు రామలింగయ్య. ఆ తరువాత చిరు నటించిన అల్లుడా మజాకా, ముఠామేస్త్రీ, ఆ ఒక్కటి అడక్కు, మెకానిక్ అల్లుడు, ఆపద్భాందవుడు, పెద్దరికం, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, రాజా విక్రమార్క, కొదమ సింహం, జగదేకవీరుడు అతిలోక సుందరి, కొండవీటి దొగ, ఖైదీ నెం.786, ఆకరి పోరాటం వంటి చాలా వరకు సినిమాల్లో తన హాస్యంతో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల జల్లు కురిపించారు. దేవుళ్లు, మావిచిరుగు సినిమాల్లోనూ చివరి దశకు చేరుకున్నా…తన హాస్యాన్ని అందరికీ పంచిన గొప్ప కళాకారుడు. ఆయన మాటలు మాట్లాడే శౌలీ, కామెడీ పంచ్ లు ఇప్పటికీ ప్రేక్షకుల నవ్వులో నిలిచిపోయాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  

మెగస్టార్ చిరంజీవి ఆస్తి విలువ ఎంతో తెలుసా..?

సినిమాలు అంటే ఎంతో ఇష్టం ఉన్నవారికి.. ఎక్కువగా తన అభిమాన నటుడితో పాటు ఇతర హీరోల వ్యక్తిగత విషయాలతో పాటు ఎంత పారితోషికం తీసుకుంటారనే విషయాన్ని తెలుసుకోవాలని ఉంటుంది. దాంతో పాటే ఎంత ఆస్తి ఉందనే విషయాలను తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

ఇందులో ముఖ్యంగా మెగస్టార్ చిరంజీవి ఆస్తి విలువ ఎంతో ఇక్కడ మనం తెలుసుకుందాం.. కష్టపడి పైగి ఎదిగి.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మెగస్టార్ చిరంజీవి. 1978లో మొదటగా అతడు నటించిన సినిమా ‘ప్రాణం ఖరీదు’. అతడి తండ్రి వెంకట్రావ్ ఒక కానిస్టేబుల్. అయినప్పటికీ అతడు సినిమా మీద ఫ్యాషన్ తో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేశారు.

దీంతో చిరంజీవి సినిమాలోకి రావాలనే ఆలోచన వచ్చిందట. తన తండ్రి సినీ ఇండస్ట్రీలో ఉండి… చిన్న చిన్న పాత్రలు చేస్తున్నప్పటికీ ఏనాడు అతడు సహాయాన్ని అడగలేదు. మొదటి సినిమా రిలీజ్ అయి రెండు సంవత్సరాల తర్వాత అంటే.. 1980 లో చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురును పెళ్లి చేసుకున్నారు. ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు చిరంజీవి.

మొదట చిరంజీవి తీసుకున్న పారితోషికం కేవలం రూ.25… ప్రస్తుతం రూ.30 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. చిరంజీవి మొత్తం ఆస్తి విలువ రూ.1650 కోట్ల వరకు ఉంటుందని సినీ వర్గాల టాక్. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 25 లో ఓ పెద్ద ఇల్లు కూడా ఉంది. ఇటీవల కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తన ఇంటిని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు మెగస్టార్ చిరంజీవి.