Tag Archives: apssdc.in

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా 800 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

ఈ మధ్య కాలంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ప్రైవేట్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. అమర్ రాజా గ్రూప్ కంపెనీలో 800 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు.

అమర్ రాజా కంపెనీ ఈ నోటిఫికేషన్ ద్వారా 800 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10,500 రూపాయలు వేతనంగా లభిస్తుంది. కంపెనీ ఫుడ్, ట్రాన్స్ పోర్ట్, వసతి, ఇతర సదుపాయాలను ఉద్యోగాలకు ఎంపికైన వారికి కల్పిస్తారు. https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం అభ్యర్థులు అమర్ రాజా సంస్థలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉంటే జనవరి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పది ఇంటర్ పాస్ అయినవారితో పాటు ఫెయిల్ అయిన వారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు డిప్లొమో, డిగ్రీ, బీటెక్ చదువులు మధ్యలో ఆపేసిన వారు సైతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రేపటి వరకు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.

పదో తరగతి పాసైన వాళ్లకు శుభవార్త.. రూ.20వేల వేతనంతో ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాలు..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వరుసగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రైవేట్ ఉద్యోగాల భర్తీ కోసం జగన్ సర్కార్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో జగన్ సర్కార్ జాబ్ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది. తాజాగా ఏపీ.ఎస్.ఎస్.డీ.సీ నుంచి తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.

పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10 వేల నుంచి 20 వేల రూపాయలు వేతనంగా లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ లో డెలివరీ బాయ్స్ గా పని చేయాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువకులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ అనుభవం లేనివాళ్లు, ఉద్యోగ అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న పురుష అభ్యర్థులు https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు దరఖాస్తు చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఒంగోలు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. స్థానికులకు ఈ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తారు.

బైక్, స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, అనుభవం ఆధారంగా వేతనాలకు సంబంధించి మార్పులు ఉంటాయి. నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. అరబిందో ఫార్మాలో ఉద్యోగాలు..?

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ గత కొన్ని నెలల నుంచి నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీఎస్‌ఎస్‌డీసీ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 150 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీన ఈ ఉద్యోగాల భర్తీ జరగనుండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

బీ.ఫార్మసీ, డిప్లొమా చదివిన అభ్యర్థులతో పాటు మెకానికల్, ఫిట్టర్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ చదివిన ఐటీఐ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ కెమిస్ట్రీ చదివిన వాళ్లు సైతం ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. గడిచిన నాలుగేళ్లలో ఉత్తీర్ణులైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు హాజరు కావాల్సి ఉంటుంది. మొత్తం 150 ఉద్యోగాలలో బీ ఫార్మసీ చదివిన వాళ్లకు 30 ఖాళీలు, డిప్లొమా చదివిన వాళ్లకు 50 ఖాళీలు ఉన్నాయి.

ఐటీఐ ఉద్యోగాలకు 50 ఖాళీలు ఉండగా బీఎస్సీ కెమిస్ట్రీ 20 ఖాళీలు ఉన్నాయి. అర్హత, అనుభవం ఆధారంగా వేతన చెల్లింపులు ఉంటాయి. టెక్నికల్ రౌండ్, హెచ్. ఆర్ రౌండ్ ద్వారా ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే https://www.apssdc.in/home/ వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

నెల్లూరు జిల్లాలోని నాయుడు పేట మండలంలోని కంపెనీ కార్యాలయంలో ఎంపికైన అభ్యర్థులు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.