Tag Archives: banana

Singer Sunitha: సంగీతమే కాదు.. వ్యవసాయం కూడా ఇష్టమే.. అరటి తోటలో సునీత..!

Singer Sunitha: తెలుగు సినీ ప్రేక్షకులు సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాటలే కాకుండా తనదైన మెలోడీ పాటలు పాడి ప్రేక్షకులను అలరించింది సునీత. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది.

ఆమె సింగ‌ర్‌గాను, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గాను ఎంతో మంది మంది అభిమానులను సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో ఉన్న సినీ హీరోయిన్లకు ఉన్న క్రేజ్ సింగర్ సునీతకు ఉంది. ఇదంతా ఇలా ఉండగా.. నాణానికి రెండు వైపులు ఉన్నట్లు ఆమెకు సంగీతంతో పాటు ప్రకృతి అంటే ఎంతో ఇష్టమట.

Singer Sunitha: సంగీతమే కాదు.. వ్యవసాయం కూడా ఇష్టమే..అరటి తోటలో సునీత..!

ఆమె ప్రకృతికి పెద్ద ప్రేమికురాలు అని ఆమె ఎన్నో సార్లు చెప్పింది. అయితే ప్రస్తుతం ఆమె చేస్తున్న పని తెలిస్తే.. అదే నిజం అని ప్రతి ఒక్కరూ అంటారు. తనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టమని సునీత చెప్పింది. తాజాగా సునీత అరటి తోట, కూరగాయల తోటలో పని చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

మనసులోని భావాలను పంచుకున్న సునీత..

అందులో అక్కడ ఒక అరటి గెలను స్వయంగా కోసి తన ఆనందాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. దీనికి జాయ్ ఆఫ్ ఫార్మింగ్ అనే క్యాప్షన్ కూడా ఉంది. అదనంగా.. నాకు సంగీతంతో పాటు.. నా కుటుంబాన్ని, స్నేహితులను, నన్ను ప్రేమించేవారిని ప్రేమిస్తున్నాను అనే వీడియో తెలిపింది. అందులో తన మనసులోని భావాలను వ్యాఖ్యల రూపంలో రాసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈమె గతేడాది రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని హెడ్‌లైన్స్‌లో నిలిచిన సునీత పెళ్లి తర్వాత సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆమెకు సంబంధించి అప్ డేట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో తన అభిమానులను పలకరిస్తున్నారు.

Black Dots Banana : నల్ల మచ్చలు ఉన్న అరటి పండు పడేస్తున్నారా.. ఈ ప్రయోజనాలు కోల్పోయినట్లే!

Black Dots Banana: కూరగాయలు ,పండ్లు , తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజు ఒక యాపిల్ పండు తినటం వల్ల డాక్టర్ ను కలవాల్సిన అవసరం రాదు.రోజుకో యపిల్ మాత్రమే కాదు రోజుకో అరటిపండు తినటం వల్ల కూడా ఆరోగ్యంగా ఉండచ్చు.అరటిపండ్లు ప్రతినిత్యం అతి తక్కువ ధరలో మన అందరికీ అందుబాటులో ఉండే పండ్లు. అరటి పండ్లు బాగా పండటం వల్ల వాటి మీద నల్ల మచ్చలు వచ్చినఅరటి పండును తినడానికి చాలా మంది ఇష్టపడరు అయితే ఇవి రుచి చాలా బాగుంటాయి . ఈ నల్ల మచ్చలు ఉన్న అరటి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

Black Dots Banana : నల్ల మచ్చలు ఉన్న అరటి పండు పడేస్తున్నారా.. ఈ ప్రయోజనాలు కోల్పోయినట్లే!

అరటి పండ్లు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉంటాయి. ప్రతిరోజు ఒక అరటిపండు తినడం వల్ల మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు. బాగా పండిన అరటిపండు తినటం వల్ల అరటిపండులో ఉండే ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ క్యాన్సర్ ట్యూమర్ లపై దాడి చేసి క్యాన్సర్ సమస్య నుండి విముక్తి కలిగిస్తాయి.

Black Dots Banana : నల్ల మచ్చలు ఉన్న అరటి పండు పడేస్తున్నారా.. ఈ ప్రయోజనాలు కోల్పోయినట్లే!

రక్తపోటు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల అరటి పండులో ఉండే పొటాషియం, సోడియం రక్తప్రవాహాన్ని మెరుగుపరిచి రక్తపోటు సమస్య నుండి విముక్తినిస్తుంది. అరటి పండు తినటం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా నివారించవచ్చు.

నెలసరి సమస్యల నుంచి విముక్తి:

అరటి పళ్లలో విటమిన్ B6 ఉంటుంది. ఇది మహిళలకు నెల నెల వచ్చే రుతుక్రమ సమస్యల నుండి కాపాడుతుంది. రోజు శ్రమించే వారు, క్రీడలు ఆడేవారు త్వరగా అలసిపోవడం జరుగుతుంది. ఇలాంటి వారు తక్షణ శక్తి కోసం అరటి పళ్ళను తినడం ద్వారా ఉత్తేజం అవుతారు. అల్సర్ లాంటి సమస్యలు ఉన్నవారు కూడా బాగా పండిన అరటి పళ్ళను తినడం ద్వారా వారు ఆ సమస్య నుండి బయటపడవచ్చు.

37 సెకన్లలో అరటిపండు తినేశాడు.. ఎవరైనా తినొచ్చు అనుకుంటున్నారా.. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోండి..

మనం యూట్యూబ్ మరియు కొన్ని సోషల్ మీడియాల్లో ఫుడ్ చాలెంజ్ లు చూస్తూ ఉంటాం. అయితే వాటిని కొందరు తక్కువ సమయంలో తిని గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంటారు. ఇలాంటి ఛాలెంజ్ ఒకటి జరిగింది. అదేంటంటే.. ఒక అరటిపండను కేవలం 37 సెకన్లలో తినేశాడు. అవును.. 30 సెకన్లో కూడా తినొచ్చు అని అనిపిస్తుంది కదా.. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.

అదేంటంటే.. చేతులతో అరటిపండును తక్కువ సమయంలో తినేయడం అంటే ఎవరైనా తింటారు. కానీ అతడి చేతులను వెనక్కి కట్టేసిన తర్వాత అరటి తొక్క తియ్యకుండా ఆ పండును అతడికి ఇచ్చారు. కేవలం 37 సెకన్లలో ఆ అరటి పండును తినేశాడు. దీంతో అతడు గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. మైక్ జాక్‌ అనే వ్యక్తి ఇలాంటి ఫీట్లు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ఇలాంటి ఫుడ్ చాలెంజ్ లు చాలానే చేసేశాడు. అయితే ఈ అరటిపండుకు సంబంధించిన ఆ వీడియో గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు ప్ర‌తినిధులు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా తెగ వైరల్ గా మారింది. దీనికి నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.

వావ్ వండర్ ఫుల్.. దిస్ ఈజ్ క్రేజీ.. కాంగ్రాట్స్ అంటూ అతడిని పొగడ్తలతో మొంచెతుత్తున్నారు. అతడు అంతక ముందు కూడా తక్కువ సమయంలో కొన్ని ఫుడ్ చాలెంజ్ లో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియోట్ చేశాడు. అతడికి అధికారులు పెట్టిన పేరే ఏంటో తెలుసా.. ‘ఫాస్టెస్ట్ ఈట‌ర్‌’.

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పదార్దాలు తీసుకోండి!

మనం సరైన ఆరోగ్యం పొందాలంటే పోషక విలువలతో కూడుకున్న ఆహారం మాత్రమే కాకుండా సరైన నిద్ర ఉన్నప్పుడే మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలము. కానీ చాలా మంది వారి రోజువారి పనులలో కలిగే ఒత్తిడి, ఆందోళన, కొన్ని కుటుంబ సమస్యల కారణంగా నిద్రలేమి ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధంగా నిద్ర లేని కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఈ సమస్య నుంచి మనం విముక్తి పొందాలంటే తప్పనిసరిగా కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు. మరి ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

  • నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి అరటిపండ్లు ఈ సమస్య నుంచి విముక్తి కల్పిస్తాయని చెప్పవచ్చు. అరటి పండ్లలో విటమిన్‌ బి6 ఉంటుంది. ఈ విటమిన్ కారణంగా మెలటోనిన్ హార్మోన్ పెరుగుతుంది. దీంతో మెదడుకు నిద్ర పోవాలనే సమాచారాన్ని పంపించడంతో మనకు నిద్ర కలుగుతుంది.
  • నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి బాదంపప్పు ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. బాదం పప్పు ఎన్నో పోషకాలకు నిలయం అని చెప్పవచ్చు.ప్రతిరోజూ పడుకునే ముందు నాలుగు బాదం పప్పులు తినడం వల్ల మన శరీరంలోని కండరాలకి విశ్రాంతి కలిగి నిద్రపోవడానికి దోహదపడతాయి.
  • ఒత్తిడి, నీరసం కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధంగా ఒత్తిడితో బాధపడేవారు పడుకోవడానికి అరగంట ముందు పాలలో కొద్దిగా గసగసాలు కలుపుకొని తాగడం వల్ల హాయిగా నిద్ర పోతారు.ఈ విధమైనటువంటి నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

అరటిపండు తొక్కతో పులిపిర్లు మాయం.. ఎలా అంటే?

కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాలలో లభించే పండ్లలో అరటి పండు ఒకటి. అరటి పండులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే. అరటిపండుని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిరోజూ ఒకటి తినడం వల్ల ఎన్నో పోషక విలువలు శరీరానికి అందడమే కాకుండా మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి దోహదపడుతుంది. అయితే చాలామంది అరటి పండును మాత్రమే తిని తొక్కను పక్కన పెట్టేస్తుంటారు.

నిజానికి అరటిపండులో కన్నా తొక్కలో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి.ఎన్నో పోషక విలువలు కలిగిన అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా మనలో చాలామంది పులిపిరి సమస్యలతో ఎంతో బాధపడుతుంటారు. అయితే వీటిని తొలగించే క్రమంలో నొప్పి కలగడం వల్ల చాలామంది వీటిని వదిలేస్తుంటారు.

పులిపిరి మొహంపై లేదా ముక్కు పై ఉంటే చూడటానికి ఎంతో అసభ్యంగా ఉంటుంది. కనుక ఈ విధమైన సమస్యతో బాధపడేవారికి అరటిపండు తొక్క ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగా పులిపిరి సమస్యతో బాధపడేవారు అరటిపండు తొక్క ని తీసుకొని పులిపిరి పై ఉంచి బాండేజ్ వేయాలి.ఈ విధంగా ప్రతి రోజూ చేయడం వల్ల మన మొహం పై ఉన్న పులిపిరి వాటంతట అవే తగ్గిపోతాయి.

అరటిపండు తొక్కలలో ఎక్కువ భాగం యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల అవి మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మన చర్మం పై ఏర్పడిన మచ్చలు, ముడతలను తొలగించడంలో యాంటీ ఆక్సిడెంట్లు కీలకపాత్ర వహిస్తాయి. అరటి తొక్క లోపలి భాగంతో ప్రతి రోజూ ఒక అరగంట పాటు మొహంపై మసాజ్ చేసుకుని, మొహాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

ఈ బిజినెస్ తో రోజుకు నాలుగు వేలు లాభం.. ఎలా అంటే?

మనలో చాలామంది పెద్దపెద్ద చదువులు చదువుకునప్పటికీ వారికి ఉద్యోగం చేయడం ఏమాత్రం ఇష్టం ఉండదు. చాలామంది బిజినెస్ చేయడానికి ఇష్టపడుతుంటారు.ఈ విధంగా బిజినెస్ చేస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందాలనుకునే వారికి ఈ బిజినెస్ మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు. ఈ బిజినెస్ కి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళ్తే..

ఈ బిజినెస్ బనానా చిప్స్ బిజినెస్. ఈ చిప్స్ తయారు చేయడానికి ఒక మిషన్ అవసరమవుతుంది. రోజుకు సుమారుగా 50 కేజీల చిప్స్ తయారు చేయాలంటే అందుకోసం 120 కిలోల అరటిపండ్లు అవసరమవుతాయి. ఈ అరటి పండ్ల కోసం వెయ్యి రూపాయల వరకు ఖర్చు అవుతుంది.

బనానా చిప్స్ తయారు చేయాలంటే అరటి పండ్లను ఫ్రై చేయడానికి ఒక లీటరు ఆయిల్ కావాలి. అదేవిధంగా ఈ మిషన్ పని చేయాలంటే విద్యుత్ సదుపాయం కాకుండా డీజిల్ అవసరమవుతుంది. 50 కేజీల చిప్స్ తయారు చేయడానికి మిషన్ కి పది లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. వీటన్నిటిని కొనడానికి రోజుకు సుమారు 3,200 రూపాయల వరకు ఖర్చు అవుతుంది.

కిలోధర రూ.70 అనగా మనం రూ.100 వరకూ అమ్ముకోవచ్చు. ఈ విధంగా బనానా చిప్స్ ద్వారా రోజుకు మంచి లాభాలను పొందవచ్చు. ఖర్చులన్నీ పోను ప్రతి రోజూ నాలుగు వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. బనానా చిప్స్ తయారు చేసే మిషన్ మనకు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయి కనుక మనం వీటిని ఎంతో సులభంగానే కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని పొందే సువర్ణ అవకాశమని చెప్పవచ్చు.

మలబద్దక సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పండు తినాల్సిందే..!

మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో కొన్ని సీజన్లలో మాత్రమే లభిస్తాయి. అయితే సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో దొరికే పండ్లలో అరటి పండు ఒకటి అని చెప్పవచ్చు. ఈ అరటి పండును ఎంతోమంది ఇష్టంగా తింటారు. ప్రతి రోజు ఒక అరటి పండును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఇందులో లభించే మినరల్స్, విటమిన్స్, ఫైబర్,పొటాషియం అధిక శాతంలో ఉండటం వల్ల రోజంతా మనకు ఎంతో శక్తిని కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు ఒక అరటి పండును తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

 

అరటి పండులో ఎక్కువ భాగం పోషకాలు లభించడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా అరటి పండ్లలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండటంవల్ల ఆహారం జీర్ణం అవ్వడంలో అరటిపండు కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం ఆహారం జీర్ణం అవ్వడమే కాకుండా మలబద్దక సమస్యను నివారించడంలో అరటిపండు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకోసమే భోజనం చేసిన తర్వాత ప్రతి రోజు ఒక అరటి పండును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్దక సమస్యను తొలగిస్తుంది.

అరటి పండులో ఉండే పొటాషియం, తక్కువ సోడియం కారణంగా అధిక రక్తపోటును నివారించడంమే కాకుండా రక్తహీనత సమస్య నుంచి కాపాడుతుంది. మన కడుపులో మంట, అజీర్తి ఏర్పడినప్పుడు అరటిపండు తినడం వల్ల అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అరటి పండులో ఉన్న విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన అరటి పండును ప్రతిరోజూ ఒకటి తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.