Singer Sunitha: తెలుగు సినీ ప్రేక్షకులు సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాటలే కాకుండా తనదైన మెలోడీ పాటలు పాడి ప్రేక్షకులను అలరించింది సునీత. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది.
ఆమె సింగర్‌గాను, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గాను ఎంతో మంది మంది అభిమానులను సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో ఉన్న సినీ హీరోయిన్లకు ఉన్న క్రేజ్ సింగర్ సునీతకు ఉంది. ఇదంతా ఇలా ఉండగా.. నాణానికి రెండు వైపులు ఉన్నట్లు ఆమెకు సంగీతంతో పాటు ప్రకృతి అంటే ఎంతో ఇష్టమట.
ఆమె ప్రకృతికి పెద్ద ప్రేమికురాలు అని ఆమె ఎన్నో సార్లు చెప్పింది. అయితే ప్రస్తుతం ఆమె చేస్తున్న పని తెలిస్తే.. అదే నిజం అని ప్రతి ఒక్కరూ అంటారు. తనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టమని సునీత చెప్పింది. తాజాగా సునీత అరటి తోట, కూరగాయల తోటలో పని చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
అందులో అక్కడ ఒక అరటి గెలను స్వయంగా కోసి తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దీనికి జాయ్ ఆఫ్ ఫార్మింగ్ అనే క్యాప్షన్ కూడా ఉంది. అదనంగా.. నాకు సంగీతంతో పాటు.. నా కుటుంబాన్ని, స్నేహితులను, నన్ను ప్రేమించేవారిని ప్రేమిస్తున్నాను అనే వీడియో తెలిపింది. అందులో తన మనసులోని భావాలను వ్యాఖ్యల రూపంలో రాసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈమె గతేడాది రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని హెడ్‌లైన్స్‌లో నిలిచిన సునీత పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆమెకు సంబంధించి అప్ డేట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో తన అభిమానులను పలకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…