Tag Archives: commit suicide

Prem Rakshit: సూసైడ్ చేసుకుందామనుకున్న కొరియోగ్రాఫర్… కట్ చేస్తే ఆస్కార్ విన్నర్!

Prem Rakshit: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నటువంటి పాటలలో నాటు నాటు పాట ఒకటి. ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎంతోమంది త్రిబుల్ ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ పాట ఇంత మంచి సక్సెస్ సాధించడానికి ఎందరో కృషి ఉందని చెప్పాలి. ఈ పాటకు సంగీతం అందించిన కీరవాణి పాట రాసిన చంద్రబోస్, డాన్స్ చేసిన హీరోలతో పాటు ఈ పాటకు కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్ రక్షిత్ పాత్ర కూడా అంతే ఉంది.

ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట కోసం ప్రేమ్ రక్షిత్ ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది. ఇక ఈయన కష్టానికి తగ్గ ప్రతిఫలం అందడంతో ప్రతి ఒక్కరు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నేడు ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఒకప్పుడు సూసైడ్ చేసుకొని చనిపోవాలని అనుకున్నారట. అసలు ఈ ప్రేమ్ రక్షిత్ ఎవరు ఈయన సూసైడ్ కథ ఏంటి అనే విషయానికి వస్తే…

ప్రేమ్ రక్షిత్ తండ్రి వజ్రాల వ్యాపారం చేసేవారు. 1993లో కుటుంబ విభేదాల కారణంగా ఆయన ఆస్తులు పోవడంతో ఆయన జీవనాధారం కోసం డ్యాన్స్ అసిస్టెంట్​గా మారారు. ఆ సమయంలో ప్రేమ్ రక్షిత్ ఓ టైలర్​ షాప్​లో పనిచేసేవారు. డ్యాన్స్​ పై మక్కువతో ఆయన కూడాnడాన్స్ మాస్టర్ గా ప్రయత్నాలు చేసిన అవకాశాలు రాలేదు. దీంతో విసిగిపోయిన ప్రేమ్ రక్షిత్ సైకిల్ పై చెన్నైలోని మెరీనా బీచ్ కి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట.

Prem Rakshit:సూసైడ్ ఆలోచనను ఆపిన సైకిల్…

అక్కడికి వెళ్లిన తర్వాత ఈయన ఒక నిమిషం ఆలోచిస్తూ తాను చనిపోతే డాన్స్ ఫెడరేషన్ వాళ్లు తన కుటుంబానికి 50వేల ఆర్థిక సహాయం అందిస్తారని భావించారట చనిపోయే ముందు తాను పక్కింటి వారి సైకిల్ వేసుకొని వచ్చానని అది కనుక తీసుకువెళ్లి ఇవ్వకపోతే తన ఫ్యామిలీని వేధిస్తారని భావించిఆ సైకిల్ ఇంటి దగ్గర పెట్టి వచ్చి సూసైడ్ చేసుకోవాలనుకున్నారట అయితే ఇంటికి వెళ్ళగానే తన తండ్రి ప్రేమ్ రక్షిత్ కు సినిమాలలో కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చిందని చెప్పడంతో ఈయన ఎగిరి గంతేయడమే కాకుండా తన సూసైడ్ ఆలోచనని కూడా విరమించుకున్నారు. ప్రేమ్ రక్షిత్ ఏకంగా ఆస్కార్ అవార్డు స్థాయికి ఎదగడం నిజంగా గర్వించదగ్గ విషయం.

ChalapathI Rao: ఆ క్షణం చలపతి రావు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా… ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో తెలుసా?

ChalapathI Rao: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న చలపతిరావు ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఇలా ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించిన చలపతిరావు మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.

ఇకపోతే చలపతిరావు మరణించడంతో ఈయనకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు. అయితే ఒకానొక సమయంలో ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చలపతిరావు తాను ఓ సంఘటన కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు తెలిపారు. ఇలా ఎందుకు ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు అనే విషయాన్నికి వస్తే…

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో విడుదల సమయంలో చలపతిరావు అమ్మాయిలు పడుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరారు అంటూ కామెంట్ చేశారు. అయితే తాను అలాంటి ఉద్దేశంతో అనలేదని చెప్పినప్పటికీ మహిళా సంఘాల నేతలు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు.తనని ఎంతో అసభ్యకరమైన పదజాలంతో దూషించడమే కాకుండా అలాంటి వ్యక్తి బతకడమే వేస్టు అంటూ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశారు.

ChalapathI Rao: 22 ఏళ్లకే భార్య చనిపోయిన రెండో పెళ్లి చేసుకోలేదు…

ఇక ఇండస్ట్రీ మొత్తం ఈయనకు మద్దతుగా నిలిచిన మాత్రం అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించారట. చలపతిరావు ఇదే విషయాన్ని సూసైడ్ నోట్ లో రాసి అమ్మ నన్ను క్షమించండి అంటూ మహిళా సంఘాల నేతలకు క్షమాపణలు చెబుతూ సూసైడ్ చేసుకుందామని భావించినట్లు ఆలీతో సరదాగా కార్యక్రమంలో తెలిపారు. తాను 22 సంవత్సరాలకి పెళ్లి చేసుకొని పెళ్ళాం చనిపోతే ఎవరు చెప్పినా రెండో పెళ్లి చేసుకోలేదు అలాంటి వ్యక్తి అమ్మాయిల గురించి అలా ఎలా ఎందుకు మాట్లాడతాను అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.

Syed Sohel: సినిమాలు సెట్ అవ్వలేదు… సూసైడ్ చేసుకోవాలనుకున్నా… బిగ్ బాస్ సోహైల్ షాకింగ్ కామెంట్స్!

Syed Sohel: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్న వారిలో సోహైల్ ఒకరు. బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సోహైల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక బుల్లితెరపై ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో ప్రతివారం కొందరు సెలబ్రిటీలు హాజరవుతూ ఆలీతో సరదాగా ముచ్చటిస్తూ ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈవారం సోహైల్ తో పాటు సింగర్ రాహుల్ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక వీరిద్దరూ కూడా వీరి జీవితంలో జరిగిన సంఘటనల గురించి తెలియజేశారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరు లైఫ్ లో ఎదుర్కొన్న స్ట్రగుల్స్ గురించి తెలియజేశారు.లైఫ్ లో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నారట కారణం ఏంటి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సోహైల్ సమాధానం చెబుతూ తాను చేస్తున్న సినిమాలేవి వర్కౌట్ కాలేదు. దాంతో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ఏం చేసినా సెట్ అయితలేదు.

Syed Sohel:ఇక లైఫ్ ఇంతేనా అనిపించింది…


ఇంతేనా లైఫ్ అనుకుని అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఈ సందర్భంగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో తెలియజేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సోహెల్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలో టాప్ 5 కంటెస్టెంట్ లలో ఒకరిగా నిలిచి టాప్ త్రీ లో పాతిక లక్షలు డబ్బు తీసుకొని వెను తిరిగారు. ఇక బిగ్ బాస్ తర్వాత ఈయన వరుస సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.

Comedian Yogi Babu: పేరుకే కమెడియన్… చేసేవన్నీ కంత్రి పనులే.. ఆత్మహత్యకు సిద్ధమైన కుటుంబం!

Comedian Yogi Babu:కమెడియన్ యోగి బాబు అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ ఈయన ఫోటో చూస్తే మాత్రం ఈయన అందరికీ పరిచయమైన విధంగానే అనిపిస్తారు. ఇలా కమెడియన్ యోగి బాబు పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ క్రమంలోనే ఈయన డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

తాజాగా యోగి బాబు, నితిన్‌ సత్య కథానాయకులుగా, గాయత్రి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీ విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ముత్తు, భువనేశ్వరి, ఉమా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన సినిమా దాదా.ఎనీ టైం మనీ ఫిలిమ్స్ పతకం పై గిన్నిస్ కిషోర్ కధ మాటలు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు.

ఇక ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల కాకుండా యోగి బాబు అడ్డుకున్నారని నిర్మాత కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సినిమాని కొనుగోలు చేయడానికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్లకు ఈయన పర్సనల్ గా ఫోన్ చేసి ఈ సినిమాలో కేవలం తాను నాలుగు సీన్లలో మాత్రమే నటించానని ఈ సినిమా కనుక కొనుక్కుంటే నష్టపోతారంటూ సినిమా గురించి చెడుగా ప్రచారం చేశారట.

Comedian Yogi Babu: సినిమా గురించి చెడుగా ప్రచారం చేసిన యోగిబాబు…


ఈ విధంగా ఈయన చెడుగా ప్రచారం చేయడంతో సినిమా కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావడంలేదని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి సినిమా కొనుక్కొని చూస్తేనే కదా ఆయన నాలుగు సీన్లలో నటించారా లేఖ 40 సీన్లలో నటించారా అనేది తెలుస్తుంది అంటూ ఆవేదన చెందారు.ఇక తన తదుపరి సినిమాకి కూడా యోగిబాబు అడ్వాన్స్ తీసుకున్నారని అలాగే ఆ సినిమాలో నటించిన మొండికేస్తున్నారంటూ కిషోర్ ఆవేదన చెందారు. ఇక ఈ సినిమా కనుక విడుదల కాకపోతే తన కుటుంబం మొత్తానికి ఆత్మహత్య తప్ప వేరే ఛాన్స్ లేదంటూ కిషోర్ ఆవేదన వ్యక్తం చేయడంతో పలువురు యోగి బాబు చూడటానికి కమిడియన్ గా అనిపించిన ఇంత కంత్రి నా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.