Tag Archives: Dalita bandu

రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలుచేస్తాం_ సీఎస్

కరీంనగర్ లో దళిత బంధు పై సోమేష్కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బందు అమలు చేస్తామని ఆయన తెలిపారు. దళిత బంధు పై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని అన్ని సరిచేస్తామని వెల్లడించారు. ఆర్థిక సాయం తో ఎలాంటి స్కీమ్ తీసుకుంటారో పర్యవేక్షిస్తామని సోమేష్ కుమార్ చెప్పుకొచ్చారు.

కాగా హుజరాబాద్ లో సర్వే చేసి వివరాలు సేకరించామని రాహుల్ బొజ్జా తెలిపారు. గ్రామాల్లో ప్రత్యేక సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపిక తర్వాత సాయం మంజూరు చేస్తామని రాహుల్ బొజ్జ చెప్పుకొచ్చారు.

దళిత బంధుకు ఆదిలోనే అడ్డంకి!

తెలంగాణ ప్రభుత్వం ప్రవేపెడుతున్న దళిత బంధుకు ఆదిలోనే నిరసన సెగ తాకింది. హుజరాబాద్ లో ప్రారంభం అవుతున్న ఈ ప్రాజెక్ట్ లో.. కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో కొంత మందిని ఎంపిక చేయడంపై గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధు కోసం అన్ని గ్రామాల్లో జాబితాను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కందుకూరు గ్రామం నుంచి 8 మందిని ఎంపిక చేయడంపై గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొంత సేపు అక్కడ ట్రాఫిక్ జాం అయ్యింది.

ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు_ సీతక్క

ఆదిలాబాద్ ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలియజేశారు.ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెళ్లి సభను విజయవంతం చేసిన ప్రజలకు, నేతలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల వచ్చిన ప్రతిసారి తెరాస ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. హుజూరాబాద్​ ఉపఎన్నిక కోసమే సీఎం కేసీఆర్ దళిత బందు తీసుకు వచ్చారన్నారు.

కాగా గిరిజనుల పోడు భూములకు పట్టాల కోసం గత కొంత కాలంగా కాంగ్రెస్​ పార్టీ పోరాడుతోందని సీతక్క పేర్కొన్నారు. పోడు భూములకు కాంగ్రెస్​ హక్కులు కల్పించిందని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరికి పట్టాలు ఇవ్వకుండా.. ఉన్న భూమిని లాక్కుంటున్న చరిత్ర కేసీఆర్​ది అని విమర్శించారు.