Tag Archives: deepthi

Shanmukh-Deepthi: మళ్లీ కలవనున్న బిగ్ బాస్ లవర్స్..! డేట్ కూడా ఫిక్స్..?

Shanmukh-Deepthi: బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఫేమస్ యూట్యూబ్ స్టార్లు షన్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయన మళ్లీ కలుసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఘాడంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరు కూడా గతేడాది డిసెంబర్ లో బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ జంట విడిపోవడం వారి ఫ్యాన్స్ కు మింగుడు పడటంలేదు.

Shanmukh-Deepthi: మళ్లీ కలవనున్న బిగ్ బాస్ లవర్స్..! డేట్ కూడా ఫిక్స్..?

ఈ బ్రేకప్ జరిగి నెలలు గడుస్తున్నా.. ఇంకా వీరిద్దరి వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ 5వ సీజన్ లో సిరితో షన్ముఖ్ చాలా దగ్గరగా మెలగడం.. కిస్సింగులు, హగ్గింగులు చూసిన ఆడియన్స్కు వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ షిప్ ఉందని అనుకున్నారు.

Shanmukh-Deepthi: మళ్లీ కలవనున్న బిగ్ బాస్ లవర్స్..! డేట్ కూడా ఫిక్స్..?

వీరిద్దరు మేం స్నేహితులమే అని చెప్పుకున్న వీరిద్దరి కెమిస్ట్రీని చూసిన వారికి నమ్మబుద్ది కాలేదు. అయితే ఈ వివాదమే షన్నూ, దీప్తిల మధ్య బ్రేకప్ కు  కారణమైంది. ఎన్నో ఎళ్లుగా ఉన్న తమ ప్రేమ బంధానికి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీప్తి తండ్రి మాట్లాడుతూ… షన్నూ, దీప్తి మళ్లీ కలుస్తారని అన్నారు.


బిగ్ బాస్ గ్రాండ్ గా ఓ కార్యక్రమాన్ని..

దీంతో వీరిద్దరు మళ్లీ కలవబోతున్నారంటూ.. వారి ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. ఫిబ్రవరి 14న వీరిద్దరు కలుస్తున్నారంటూ రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి. వీరిద్దరు కలవబోతున్నారంటూ.. దీనికి బిగ్ బాస్ వేదిక కాబోతుందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా బిగ్ బాస్ గ్రాండ్ గా ఓ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తోంది. దీనికి బిగ్ బాస్ కంటెస్టెంట్లను కూడా ఆహ్వానించింది. ఈ వేదికపై షన్నూ, దీప్తి కూడా కలిసి వస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఓటీటీలో బిగ్ బాస్ షో కూడా ప్రారంభం కాబోతోంది. అయితే ఈ వార్తలు ఎలా ఉన్నా… వీరిద్దరు మళ్లీ కలవాలంటూ.. వారి ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Shanmukh: షణ్ముఖ్, దీప్తి బ్రేకప్ తర్వాత.. తొలిసారిగా తన ఫోటోని షేర్ చేసిన షన్ను.. ఫోటో వైరల్!

Shanmukh: షణ్ముఖ్ జశ్వంత్ – దీప్తి సునయన విడిపోవడం చాలా మందికి నచ్చడం లేదు. చాలా ముచ్చటైన జంటగా ఉన్న వీరిద్దరు విడిపోతారని వారి ఫ్యాన్స్ కానీ..ప్రేక్షకులు కానీ ఎవ్వరూ ఊహించలేదు. బిగ్ బాస్ 5 మొత్తానికి ఈ జంటను విడగొట్టిందంటూ.. చాలా మంది నెటిజెన్ల కామెంట్లు కూడా చేశారు.

Shanmukh: షణ్ముఖ్, దీప్తి బ్రేకప్ తర్వాత.. తొలిసారిగా తన ఫోటోని షేర్ చేసిన షన్ను.. ఫోటో వైరల్!

న్యూ ఇయర్ కు ముందు రోజు షన్నూతో బ్రేకప్ అవుతున్న విషయాన్ని దీప్తి సునయన తన ఇన్ స్టా వేదికగా ప్రకటించింది.  బిగ్ బాస్ షోలో షణ్ముఖ్ – సిరిల మధ్య కెమిస్ట్రీ వీరిద్దరి మధ్య తగాదాలకు కారణం అయిందని తెలుస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ షోలో షన్నూ, సిరిల మధ్య రొమాన్స్ హద్దులు దాటింది.

Shanmukh: షణ్ముఖ్, దీప్తి బ్రేకప్ తర్వాత.. తొలిసారిగా తన ఫోటోని షేర్ చేసిన షన్ను.. ఫోటో వైరల్!

హగ్గింగులు, కిస్సింగులతో ఇద్దరు రెచ్చిపోయారు. ఒకానొక సమయంలో సిరి తల్లి కూడా ఈవిషయంపై ఫైర్ అయింది. అయితే తామిద్దరం మంచి స్నేహితులం అని చెప్పినప్పటికీ.. ఇంకేదో రిలేషన్ వీళ్ల మధ్య ఉందంటూ ప్రచారం సాగింది.


వీరిద్దరు కలిసి నటించిన మలుపు ..

దీంతోనే దీప్తి సునయన- షణ్ముఖ్ జశ్వంత్ మధ్య 5 ఏళ్ల రిలేషన్ బ్రేకప్ అయిందని తెలుస్తోంది.  తాజాగా జనవరి 10న దీప్తి సునయన పుట్టిన రోజు కావడంతో షన్నూ తన ఇన్ స్టా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘హ్యాపీ బర్త్‌డే డీ(D)’అంటూ దీప్తితో కలిసి దిగిన ఓ పాత ఫోటోను షణ్నూ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశాడు. దీనికి వీరిద్దరు కలిసి నటించిన మలుపు సిరీస్‌ సాంగ్‌ను జత చేయడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఈ విషయంపై దీప్తి ఇంకా స్పందించలేదు.

Sri Reddy: షణ్ముఖ్‌-దీప్తిల బ్రేకప్‌పై శ్రీరెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌..సోషల్ మీడియాలో వైరల్..!

Sri Reddy: బిగ్ బాస్ 5 సీజన్ ముగిసిన తర్వాత కూడా దీప్తి సునయన- షణ్ముఖ్ జశ్వంత్ బ్రేకప్ పై విషయం ఇప్పటికి నెట్టింట్లో ట్రెండింగ్ గానే ఉంది. బ్యూటిపుల్ పేయిర్ గా ఉన్న వీరిద్దరు విడిపోవడం వాళ్ల ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఐదేళ్లు రిలేషన్ షిష్ లో ఉన్న వీరిద్దరు విడిపోవడానికి బిగ్ బాస్ ఎపిసోడ్స్, సిరినే కారణం అంటూ ఇప్పటికే నెటిజెన్ల ట్రోలింగ్ మొదలైంది.

Sri Reddy: షణ్ముఖ్‌-దీప్తిల బ్రేకప్‌పై శ్రీరెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌..సోషల్ మీడియాలో వైరల్..!

బిగ్ బాస్ హౌజ్ లో సిరికి, షన్నూ దగ్గరగా ఉండటం, కిస్సింగ్, హగ్గింగులు చాలా మందికి నచ్చలేదు. వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కన్నా వేరే ఏదో రిలేషన్ ఉందని జనాలు అనుమానించారు. దీని కారణంగానే ఇటీవల దీప్తి, షన్ముఖ్ కు బ్రేకప్ చెబుతూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 

Sri Reddy: షణ్ముఖ్‌-దీప్తిల బ్రేకప్‌పై శ్రీరెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌..సోషల్ మీడియాలో వైరల్..!

ఇదిలా ఉంటే ఈ వ్యవహరంపై వివాదాస్పద నటి శ్రీ రెడ్డి స్పందించింది. మీరిద్దరు విడిపోవడం చాలా బాధగా ఉంది అని అంటూనే.. బిగ్ బాస్ వ్యవహారమే మీ మధ్య గ్యాప్ పెంచేందుకు కారణమైందని అంది. అయితే షన్నూ బిగ్ బాస్ లో చేసిందానిక బ్రేకప్ చెబితే.. గతంలో నువ్వు కూడా బిగ్ బాస్ షోకు వెళ్లావని, కొందరితో సన్నిహితంగా మెలిగావని దాని సంగతేంటని ప్రశ్నించింది.


షన్నూతో పెళ్లి కాలేదు కాబట్టి …

నీవరకు వచ్చే సరికి ఇది తప్పుకాదా అని అంది శ్రీరెడ్డి. షణ్ముఖ్ తో ఐదేళ్లు రిలేషన్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశామని చెబుతున్నావు. ఇలాంటి చిన్న విషయాలకే బ్రేకప్ చెప్పావా…అని శ్రీ రెడ్డి స్పందించారు. షన్నూతో పెళ్లి కాలేదు కాబట్టి బ్రేకప్ చెప్పావు.. అదే పెళ్లి అయితే షన్నూను ఇలాగే వదిలి వేళ్లేదానివా అని ప్రశ్నించింది. ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉన్నప్పుడు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. టాటూలపై కూడా శ్రీరెడ్డి స్పందించింది. గతంలో టాటూలు వేయించుకున్న వారంతా విడిపోయారని.. దీప్తి సునయన కూడా టాటూలు వేయించుకుంది.. ఇప్పుడు అది రిమూవ్ చేయించుకోవాలని అనుకుంటుంది. మీపై మీకు నమ్మకం లేకపోతే టాటూలు వేయించుకోకండి’ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. మనం ఎంత చేసినా భారతీయులమని మరిచిపోవద్దు.. జీన్స్ ఫ్యాంట్, టీ షర్ట్ వేసుకున్నా మన సంస్కృతి, సాంప్రదాయాలు మర్చిపోకూడదని హితవు పలికింది.

Shanmukh: దీప్తి సునైనా రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన షన్ను.. టైమ్ కావాలంటూ అభిమానులకు షాక్!

యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పలు వీడియోలు వెబ్ సిరీస్ ద్వారా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. ఇలా వెబ్ సిరీస్ ల ద్వారా సంపాదించుకున్న పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అవకాశాన్ని దక్కించుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే చాలామంది టైటిల్ సొంతం చేసుకుంటారు అని భావించారు.

Shanmukh: దీప్తి సునైనా రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన షన్ను.. టైమ్ కావాలంటూ అభిమానులకు షాక్!

కానీ బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ సిరితో కలిసి హాగ్గులు, ముద్దులు పెట్టుకుంటూ తీవ్రస్థాయిలో నెగిటివిటీ మూటగట్టుకున్నారు. ఇలా సిరితో చాలా చనువుగా ఉండటం వల్ల షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ టైటిల్ కు దూరం అవ్వడమే కాకుండా ఎంతో నెగిటివిటీ తో బయటకు వచ్చారు.

Shanmukh: దీప్తి సునైనా రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన షన్ను.. టైమ్ కావాలంటూ అభిమానులకు షాక్!

ఇలా షణ్ముఖ్ జస్వంత్ బయటకు రాగానే తన ప్రేయసి దీప్తి సునయన తనతో బ్రేక్ అప్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక ఇదే విషయాన్ని పలువురు నెటిజన్లు షణ్ముఖ్ జస్వంత్ అని ప్రశ్నించడంతో షణ్ముఖ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ దీప్తి సునయనతో ఉన్న తన రిలేషన్ గురించి బయట పెట్టారు.

మాకు కొంచెం టైం కావాలి అంటూ క్లారిటీ ఇచ్చిన షన్నూ..

దీప్తి సునయనతో తను రిలేషన్ లో ఉన్నది వాస్తవమే అయితే ఇలా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కాస్త సమయం కావాలి. ఆ సమయం వచ్చిన తరువాత తప్పకుండా అందరికీ మా గురించి తెలియజేస్తానని ఈ సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయనతో తన రిలేషన్ గురించి బయట పెట్టారు.

షణ్ముఖ్, దీప్తి పెళ్లి గురించి కండీషన్ పెట్టిన షన్ను తల్లిదండ్రులు..!

దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబర్స్ గా ఫేమస్ అయినా వీరిద్దరు ఎన్నో వీడియో సాంగ్స్ వెబ్ సిరీస్ లో నటిస్తూ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇకపోతే వీరు తరచూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండటం వల్ల వీరికి సంబంధించిన విషయాల గురించి షేర్ చేయటం వల్ల వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సందేహాలు వ్యక్తం చేశారు.

ఇటీవల ఈ విషయాన్ని వీరిద్దరూ బహిర్గతం చేశారు. ఇక ఒకరినొకరు ప్రేమించుకుంటున్న ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై షణ్ముఖ్ తల్లిదండ్రులు స్పందించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా షన్ను పేరెంట్స్ మాట్లాడుతూ…

వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి మాకు తెలియదని మేము కూడా టీవీ షో లో చూసి ప్రేమించుకున్నట్లు తెలుసుకున్నామని ఈ సందర్భంగా షణ్ముఖ్ తల్లిదండ్రులు వెల్లడించారు. ఇక వీరు పెళ్లి గురించి మాట్లాడుతూ వీరి పెళ్లి విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే దీప్తి సునయన తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుందని ఈ సందర్భంగా షణ్ముఖ్ తల్లి వెల్లడించారు. ఒకవేళ వారు ఒప్పుకున్న దీప్తి సునయన పెళ్లి ఇప్పుడే చేయమని ఇంకా షణ్ముఖ్ అన్నయ్య ఉన్నారని తనకు పెళ్లి అయిన తర్వాతే పెళ్లి చేస్తామని క్లారిటీ ఇచ్చారు.