Shanmukh-Deepthi: మళ్లీ కలవనున్న బిగ్ బాస్ లవర్స్..! డేట్ కూడా ఫిక్స్..?
Shanmukh-Deepthi: బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఫేమస్ యూట్యూబ్ స్టార్లు షన్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయన మళ్లీ కలుసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఘాడంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరు కూడా గతేడాది డిసెంబర్ లో బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ జంట విడిపోవడం వారి ఫ్యాన్స్ కు మింగుడు పడటంలేదు.
ఈ బ్రేకప్ జరిగి నెలలు గడుస్తున్నా.. ఇంకా వీరిద్దరి వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ 5వ సీజన్ లో సిరితో షన్ముఖ్ చాలా దగ్గరగా మెలగడం.. కిస్సింగులు, హగ్గింగులు చూసిన ఆడియన్స్కు వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ షిప్ ఉందని అనుకున్నారు.
వీరిద్దరు మేం స్నేహితులమే అని చెప్పుకున్న వీరిద్దరి కెమిస్ట్రీని చూసిన వారికి నమ్మబుద్ది కాలేదు. అయితే ఈ వివాదమే షన్నూ, దీప్తిల మధ్య బ్రేకప్ కు కారణమైంది. ఎన్నో ఎళ్లుగా ఉన్న తమ ప్రేమ బంధానికి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీప్తి తండ్రి మాట్లాడుతూ… షన్నూ, దీప్తి మళ్లీ కలుస్తారని అన్నారు.
దీంతో వీరిద్దరు మళ్లీ కలవబోతున్నారంటూ.. వారి ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. ఫిబ్రవరి 14న వీరిద్దరు కలుస్తున్నారంటూ రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి. వీరిద్దరు కలవబోతున్నారంటూ.. దీనికి బిగ్ బాస్ వేదిక కాబోతుందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా బిగ్ బాస్ గ్రాండ్ గా ఓ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తోంది. దీనికి బిగ్ బాస్ కంటెస్టెంట్లను కూడా ఆహ్వానించింది. ఈ వేదికపై షన్నూ, దీప్తి కూడా కలిసి వస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఓటీటీలో బిగ్ బాస్ షో కూడా ప్రారంభం కాబోతోంది. అయితే ఈ వార్తలు ఎలా ఉన్నా… వీరిద్దరు మళ్లీ కలవాలంటూ.. వారి ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…