Shanmukh: దీప్తి సునైనా రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన షన్ను.. టైమ్ కావాలంటూ అభిమానులకు షాక్!
యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పలు వీడియోలు వెబ్ సిరీస్ ద్వారా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. ఇలా వెబ్ సిరీస్ ల ద్వారా సంపాదించుకున్న పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అవకాశాన్ని దక్కించుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే చాలామంది టైటిల్ సొంతం చేసుకుంటారు అని భావించారు.
కానీ బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ సిరితో కలిసి హాగ్గులు, ముద్దులు పెట్టుకుంటూ తీవ్రస్థాయిలో నెగిటివిటీ మూటగట్టుకున్నారు. ఇలా సిరితో చాలా చనువుగా ఉండటం వల్ల షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ టైటిల్ కు దూరం అవ్వడమే కాకుండా ఎంతో నెగిటివిటీ తో బయటకు వచ్చారు.
ఇలా షణ్ముఖ్ జస్వంత్ బయటకు రాగానే తన ప్రేయసి దీప్తి సునయన తనతో బ్రేక్ అప్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక ఇదే విషయాన్ని పలువురు నెటిజన్లు షణ్ముఖ్ జస్వంత్ అని ప్రశ్నించడంతో షణ్ముఖ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ దీప్తి సునయనతో ఉన్న తన రిలేషన్ గురించి బయట పెట్టారు.
దీప్తి సునయనతో తను రిలేషన్ లో ఉన్నది వాస్తవమే అయితే ఇలా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కాస్త సమయం కావాలి. ఆ సమయం వచ్చిన తరువాత తప్పకుండా అందరికీ మా గురించి తెలియజేస్తానని ఈ సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయనతో తన రిలేషన్ గురించి బయట పెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…