Home Minister: సన్నీలియోన్ పాటపై హోం మంత్రి సీరియస్..స్పందించిన మ్యూజిక్ కంపెనీ..!
Home Minister: బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఇటీవల నటించిన ఓ పాట వివాదాల్లో చిక్కుకుంది. ఆమె మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలు వచ్చాయి. ఆమె తాజా పాట ‘మధుబన్’ పాటలో.. బోల్డ్ దుస్తులలో ఆమె కనిపించగా.. మధురకు చెందిన పూజారులు సన్నీ లియోన్ పై మండిపడుతున్నారు. తాజా వీడియో ఆల్బమ్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు.
బాలీవుడ్ నటి “మధుబన్ మే రాధిక నాచే” పాటలో “అశ్లీల” నృత్యం చేయడం ద్వారా తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. దీనిపై సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. దేవుడిని కించపరిచే హక్కు నీకు లేదంటూ సన్నీలియోన్ పై మండిపడుతున్నారు. అయితే ఈ పాటను 1960లో కోహినూర్ చిత్రం కోసం మహమ్మద్ రఫీ పాడారు. ప్రభుత్వం నటిపై చర్యలు తీసుకోకపోతే తాము కోర్టుకు వెళ్తాం అని బృందాబన్‌కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజ్ అన్నారు.
ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే జరిగే పరిణామాలకు మాకు సంబంధం లేదంటూ హెచ్చరించారు. అఖిల భారతీయ తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ పాఠక్ కూడా ఈ పాటను నిషేధించాలని డిమాండ్ చేశాడు. ఇలా గత ఐదు రోజుల నుంచి ఆమె పాటపై.. వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి కూడా స్పందించాడు. కావాలనే ఈ పాటలో కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ.. సన్నీలియోన్ తో పాటు.. పాటపాడిన వారు కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఆ వీడియోను తొలగించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హోం మత్రి హెచ్చరికలతో వీడియోలోని కొన్ని పదాలను మార్చేందుకు సరిగమప మ్యూజిక్ కంపెనీ ముందుకు వచ్చినట్లు తెలిసింది. మార్చిన పాటను అత్యంత త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది సరిగమప కంపెనీ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…