Shanmukh: షణ్ముఖ్, దీప్తి బ్రేకప్ తర్వాత.. తొలిసారిగా తన ఫోటోని షేర్ చేసిన షన్ను.. ఫోటో వైరల్!
Shanmukh: షణ్ముఖ్ జశ్వంత్ – దీప్తి సునయన విడిపోవడం చాలా మందికి నచ్చడం లేదు. చాలా ముచ్చటైన జంటగా ఉన్న వీరిద్దరు విడిపోతారని వారి ఫ్యాన్స్ కానీ..ప్రేక్షకులు కానీ ఎవ్వరూ ఊహించలేదు. బిగ్ బాస్ 5 మొత్తానికి ఈ జంటను విడగొట్టిందంటూ.. చాలా మంది నెటిజెన్ల కామెంట్లు కూడా చేశారు.
న్యూ ఇయర్ కు ముందు రోజు షన్నూతో బ్రేకప్ అవుతున్న విషయాన్ని దీప్తి సునయన తన ఇన్ స్టా వేదికగా ప్రకటించింది. బిగ్ బాస్ షోలో షణ్ముఖ్ – సిరిల మధ్య కెమిస్ట్రీ వీరిద్దరి మధ్య తగాదాలకు కారణం అయిందని తెలుస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ షోలో షన్నూ, సిరిల మధ్య రొమాన్స్ హద్దులు దాటింది.
హగ్గింగులు, కిస్సింగులతో ఇద్దరు రెచ్చిపోయారు. ఒకానొక సమయంలో సిరి తల్లి కూడా ఈవిషయంపై ఫైర్ అయింది. అయితే తామిద్దరం మంచి స్నేహితులం అని చెప్పినప్పటికీ.. ఇంకేదో రిలేషన్ వీళ్ల మధ్య ఉందంటూ ప్రచారం సాగింది.
దీంతోనే దీప్తి సునయన- షణ్ముఖ్ జశ్వంత్ మధ్య 5 ఏళ్ల రిలేషన్ బ్రేకప్ అయిందని తెలుస్తోంది. తాజాగా జనవరి 10న దీప్తి సునయన పుట్టిన రోజు కావడంతో షన్నూ తన ఇన్ స్టా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘హ్యాపీ బర్త్‌డే డీ(D)’అంటూ దీప్తితో కలిసి దిగిన ఓ పాత ఫోటోను షణ్నూ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. దీనికి వీరిద్దరు కలిసి నటించిన మలుపు సిరీస్ సాంగ్‌ను జత చేయడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఈ విషయంపై దీప్తి ఇంకా స్పందించలేదు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…