Nandamuri Tejaswini: నందమూరి నటసింహం ప్రస్తుతం అఖండ సినిమా విజయోత్సవం కావడమే కాకుండా మరోవైపు ఆహాలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ఈ కార్యక్రమం కూడా అద్భుతమైన విజయాన్ని అందుకొని దూసుకుపోతుంది. ఇటీవల కాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న టాక్ షో లలో బాలకృష్ణ టాక్ షో IMDB టాప్ 10లో ఉండటం విశేషం.
ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి బాలకృష్ణ రెండవ కూతురు కూడా కారణమని చెప్పాలి. బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని గురించి మనందరికీ తెలిసిందే. ఈమె ప్రముఖ విద్యావేత్త ఎంవివిఎస్ మూర్తి మనవడు భరత్ ని వివాహం చేసుకున్నారు. అయితే తేజస్వినికి బాలయ్య బాబు టాక్ షో విజయవంతం అవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…
బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి తన చిన్న కూతురు తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఆమె క్రియేటివిటి వల్లే బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హోస్టింగ్ చేస్తూ అద్భుతంగా.. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధంగా తేజస్విని కెమెరా వెనక ఉంటూ కెమెరా ముందు తన తండ్రి విజయానికి కారణమైనదని తెలుస్తుంది.
ఈ విధంగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోవడమే కాకుండా ఎంతో మంది సబ్ స్కైబర్లు దక్కించుకోవడంతో బాలకృష్ణ పారితోషికం కూడా పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ కార్యక్రమాన్ని మొదట్లో ప్రకటించినప్పుడు బాలకృష్ణ ఏంటి? యాంకర్ గా చేయడం ఏంటి? అనే వాళ్లకు బాలయ్య దీటుగా సమాధానం చెప్పారు. ఇక అఖండ సినిమా కూడా విజయవంతం కావడంతో బాలకృష్ణ తర్వాత చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…