Tag Archives: Diet for Health

జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి.. అవేంటంటే..?

మనం తినే ఆహారంలో ఆయిల్ గానీ.. కారం గానీ అధికంగా ఉంటే కడుపంతా మంటగా.. విసుగ్గా అనిపిస్తుంది. అందుకే.. మనం తినే ఆహారం ఎప్పుడూ తేలికపాటిగా ఉండాలి. అటువంటి సమయంలోనే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు.

మసాలాలు, నూనెలు తక్కువగా ఆహారంలో తీసుకోవాలి. అప్పుడే సరైన పోషకాలు శరీరానికి అందుతాయి. సరైన పోషకాలను అందించే తేలికపాటి ఆహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దక్షిణ భారతదేశంలో ప్రతీ ఒక్కరు ఇష్టపడే తేలికపాటి ఆహార పదార్థం అన్నంలో పెరుగు. ఇది కొన్ని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ప్రతీ ఒక్కరూ చేసేదే.. అన్నంలో కొద్దిగా పెరుగు, ఉప్పు వేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది.

అంతేకాకుండా అజీర్ణ సమస్య కూడా ఉండదు. కడుపులో ఇబ్బందిగా అనిపించినప్పడు ఖిచిడీని తింటే మంచిగా ఉంటుంది. ఇది చాలా తేలికగా ఉంటుంది. లూజ్ మోషన్ సమస్య ఉన్నవారికి ఇది ఒక రెమిడీ లాంటిది. దీనిలో బియ్యం, పప్పు, పసుపు, మసాలా దినుసులు కలిపి ఉండికించి.. వేడి వేడిగా తినేయాలి. కడుపు నొప్పిగా ఉండే వారికి ‘గుల్హత్’ ప్రయోజనకరంగా ఉంటుంది.

అర కప్పు బియ్యం, 2 కప్పుల నీరు, చిటికెడు ఉప్పు వేసి కుక్కర్లో పెట్టాలి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ తెరిచి బియ్యాన్ని మరింత మెత్తగా చేసుకోవాలి. దీనిని ఊరగాయతో తింటే అదిరిపోతుంది. ఇడ్లీ కూడా తేలికపాటి ఆహారమే. దీనిని తీసుకోవడం వల్ల కూడా అజీర్ణసమస్యలు తొలగిపోతాయి. పై తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.