Tag Archives: divorced

Danush -Aishwarya: ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు తీసుకోవడానికి ఆ ఇల్లే కారణమా?

Danush -Aishwarya: రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య సినీ నటుడు ధనుష్ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరి వివాహం చేసుకున్న తర్వాత వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలా 18 సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట గత ఏడాది విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించారు.

ఇలా వీరు విడాకులు తీసుకోబోతున్నామని తెలియజేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే వీరి విడాకులకు కారణాలు ఇప్పటివరకు తెలియలేదు కానీ వీరి విడాకుల గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే వీరి విడాకులకు తాజాగా ధనుష్ నిర్మించిన కొత్త ఇల్లే కారణం అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ధనుష్ ఇటీవల కొత్త ఇల్లు నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు 150 కోట్లతో నిర్మించిన ఈ ఇంటి గృహప్రవేశం చేశారు.

అయితే ఈ ఇంటికి 2021 వ సంవత్సరంలో భూమి పూజ కార్యక్రమం చేశారు. 2022వ సంవత్సరంలో ధనుష్ ఐశ్వర్య విడిపోయారు. 2023వ సంవత్సరంలో ధనుష్ తన తల్లిదండ్రులతో కలిసి ఈ ఇంటికి గృహప్రవేశం చేశారు. ధనుష్ ఇంటిని చెన్నైలోనే పోయేస్ గార్డెన్ లో నిర్మించారు. ఇక్కడ ఇంటిని నిర్మించాలని చెప్పినప్పటి నుంచి రజనీకాంత్ వాస్తు పరంగా ఇక్కడ ఇల్లు కట్టడం మంచిది కాదని వారికి చెబుతూ ఉన్నప్పటికీ వారు మాత్రం వినకుండా ఇంటి నిర్మాణం చేపట్టారట.

Danush -Aishwarya: వాస్తు పరంగా ఇల్లు లేకపోవడమే కారణమా…

ఇలా ఇంటి నిర్మాణం చేపట్టిన సమయం నుంచి వీరీ మధ్య తరచూ గొడవలు రావడం ఆ గొడవలు కాస్త పెద్దవిగా మారు చివరికి విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చిందని తెలుస్తుంది. ఇలా వాస్తు పరంగా ఇల్లు లేకపోవడంతోనే ఇద్దరు మధ్య గొడవలు విడాకుల వరకు వెళ్లిందని చివరికి వీరి విషయంలో రజనీకాంత్ చెప్పిన మాటలే నిజమయ్యాయి అంటూ పలువురు ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు.

Samantha: చైతన్యతో తన ప్రేమకు గుర్తుగా ఉన్న ఆ జ్ఞాపకాన్ని కూడా సమంత చెరిపేసారా?

Samantha:సమంత నటుడు నాగచైతన్యను ప్రేమించి పెద్దల సమక్షంలో ఇద్దరు ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి కోడలుగా అడుగుపెట్టడంతో సమంతకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే నటుడు నాగచైతన్యత ఎంతో సంతోషంగా ఉన్నటువంటి సమంత చివరికి ఆయనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఈ విధంగా సమంత నాగచైతన్యవిడాకులు తీసుకొని విడిపోయి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ వీరి విడాకులకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఇక సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ అంటూ నాగచైతన్య ఒక సందర్భంలో తెలియజేశారు.

ఇలా నాగచైతన్య సమంత ఇద్దరు విడిపోయిన వీరీ గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది.ఇలా సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత వీరిద్దరూ వారి ప్రేమకు గుర్తుగా ఒకరికోసం ఒకరు ఇచ్చుపుచ్చుకున్నటువంటి కానుకలను వీరి మధ్య ఉన్నటువంటి జ్ఞాపకాలను కూడా చెరిపివేశారు. సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా తొలగించారు.

Samantha: మ్యారేజ్ సర్టిఫికెట్ ను కాల్చి వేశారా…


చైతన్య జ్ఞాపకాలు ఏ ఒక్కటి తన వద్ద లేకుండా సమంత చెరిపేశారు. అయితే చివరిగా చైతన్య ప్రేమకు గుర్తుగా తన వద్ద ఉన్నటువంటి ఒక జ్ఞాపకాన్ని కూడా సమంత చెరిపేసారని తన కళ్ళముందే కాకుండా ఊహలలో కూడా చైతన్య జ్ఞాపకాలు ఉండకూడదని భావించిన ఈమె తన మ్యారేజ్ సర్టిఫికెట్ ను కాల్చి బూడిద చేసారని తెలుస్తోంది. విడాకుల తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ తో తనకు అవసరం లేదని ఈ ఒక్క జ్ఞాపకాన్ని కూడా ఆమె చెరిపేసారట.

Niharika: నిహారిక జాతకం ప్రకారం విడాకులు తీసుకుంటారని ముందే తెలుసా…అయినా పెళ్లి చేశారా?

Niharika: మెగా డాటర్ కొణిదల నిహారిక పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ గా ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయమైనటువంటి ఈమె అనంతరం ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగారు. అయితే హీరోయిన్గా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడంతో నిహారిక తర్వాత వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు అయితే ఈ వైవాహిక జీవితం మూనాల్ల ముచ్చటగా మారిపోయింది.

నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకొని అనంతరం తనకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా నిహారిక విడాకులు తీసుకుని విడిపోవడంతో ఈమె గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నిహారిక వెంకట చైతన్య ముందుగానే విడిపోతారని తమ కుటుంబ సభ్యులకు ఈ విషయం ముందే తెలుసట.

ఈ విధంగా వీరిద్దరూ విడిపోతారని ముందుగానే వీరికి తెలిసినప్పటికీ నిహారిక చైతన్య వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించారు అయితే జాతకం ప్రకారమే వీరిద్దరు కూడా విడిపోయారు. నిహారిక వెంకట చైతన్య జాతకాలు చూస్తున్నటువంటి సమయంలో జాతక దోషాలు కారణంగా పెళ్లి చేసుకుంటే విడాకులు తీసుకుంటారని అయితే కొన్ని పరిహారాలు తప్పకుండా చేయాల్సి ఉంటుందని తెలిపారట.

Niharika: జాతక దోషాలే కారణమా…


ఈ విధంగా నిహారిక వెంకటచైతన్య తర్వాత జాతక పరిహార దోషాలను తొలగిపోవడానికి పూజలు చేయకుండా వీరిద్దరూ మాత్రం హనీమూన్ అంటూ ఇతర దేశాలకు వెళుతూ ఎంజాయ్ చేశారు ఇలా దోష పరిహారం చేయకపోవడం వల్ల నిహారిక వెంకట చైతన్యకు విభేదాలు రావడం విడాకులు తీసుకోవడం వంటివి జరిగిపోయాయని ఈ సందర్భంగా నిహారిక విడాకుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Niharika: విడాకుల తర్వాత తెగ చిల్ అవుతున్న నిహారిక… మండిపడుతున్న ఫ్యాన్స్!

Niharika: మెగా డాటర్ నిహారిక తన విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారకంగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. జొన్నలగడ్డ వెంకట చైతన్య నుంచి విడాకులు తీసుకున్నానని అయితే ఇద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని తెలియజేశారు. అయితే వీరి విడాకుల కోసం వేసిన పిటిషన్ చూస్తే ముందుగా చైతన్య విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.

ఇక వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణం ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలేనని తెలుస్తోంది. నిహారిక సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. అయితే చైతన్య ఫ్యామిలీకి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. దీంతో చైతన్య నిహారిక వ్యవహార శైలి కారణంగా విసిగిపోయి తనతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయారు.

నిహారిక విడాకులు వార్తలు గురించి రోజుకొక ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నిహారిక మాత్రం తాను విడాకులు తీసుకున్నానన్న బాధ తనలో ఏ మాత్రం కూడా కనపడటం లేదని తెలుస్తోంది.ఈమె విడాకులను ప్రకటించి కనీసం వారం కూడా కాకుండానే సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ అవుతూ ఉన్నారు.

Niharika: మెగా ఫ్యామిలీ జాతి రత్నానివి..


ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన స్నేహితులతో కలిసి ఎంతో చిల్ అవుతున్నటువంటి ఫోటోలను వీడియోలను షేర్ చేశారు. ఇలా ఈ వీడియోలను షేర్ చేయగా అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.మన కులపు పరువు తీసావని కొందరు కామెంట్లు చేయగా మరికొందరు నువ్వు మెగా ఫ్యామిలీ జాతి రత్నానివి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు భర్త నుంచి విడిపోయాను అన్న బాధ ఏ మాత్రం లేదుగా అంటూ నిహారిక వ్యవహార శైలి పై కామెంట్ చేస్తున్నారు.

Niharika: నిహారిక విడాకులు తీసుకోవడానికి పెద్దవారు చేసిన ఆ తప్పే కారణమా… అందుకే విడిపోయారా?

Niharika: మెగా డాటర్ నిహారిక విడాకుల విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.నాగబాబు కుమార్తె నిహారిక కూడా విడాకులు తీసుకుని విడిపోవడంతో మెగా ఆడపడుచులకు పెళ్లిళ్లు కలసి రావా అందుకే ఇలా అందరూ విడాకులు తీసుకొని విడిపోతున్నారా అంటూ వీరి విడాకుల గురించి ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నిహారిక విడాకులు తీసుకుంటున్నానని ప్రకటించడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.

ఇక నిహారిక విడాకులు తీసుకోవడానికి తన కుటుంబ సభ్యులు చేసిన తప్పు కూడా కారణమని సమాచారం. అయితే నిహారిక విడాకులకు మెగా ఫ్యామిలీకి సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే…పెళ్లి అంటే ఎన్నో ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ చేస్తాము కానీ ప్రస్తుత కాలంలో ఇలాంటి ఆచారాలకు తావు లేకుండా పోయింది కేవలం ఫోటోలు వీడియోలు అంటూ వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు దీంతో సరైన సమయానికి పెళ్లిళ్లు జరగడం లేదు.

పెళ్లి అంటే అమ్మాయి అబ్బాయి జాతకాన్ని చూసి వారిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందా లేదా అన్నది నిర్ణయించుకుని సంబంధం కలుపుకుంటారు. ఇక పోతే వారి జాతకం ప్రకారమే వారికి పెళ్లి ముహూర్తాన్ని కూడా నిర్ణయిస్తారు కానీ ప్రస్తుత కాలంలో ఫోటోల మీద వ్యామోహంతో పెళ్లిళ్లు సరైన సమయానికి జరగడం లేదు నిహారిక విషయంలో కూడా అదే జరిగిందని తెలుస్తుంది.

Niharika: సరైన ముహూర్తానికి పెళ్లి జరగలేదా…


నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య జాతకాల ప్రకారం నిర్ణయించిన ముహూర్తానికి వీరు పెళ్లి జరగలేదట పెళ్లి కాస్త ఆలస్యంగా జరగడంతోనే ఇలా వీరి వైవాహిక జీవితంలో ఆటంకాలు ఏర్పడ్డాయని అవే పెద్ద ఎత్తున వివాదాలుగా మారి విడాకులు తీసుకునే వరకు వచ్చాయనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Niharika Divorce: నిహారిక కు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదా… ముందుగా చైతన్యనే విడాకులు కోరారా?

Niharika Divorce: ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక తన భర్త వెంకట చైతన్యతో విడాకులు తీసుకుని విడిపోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ దూరంగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు అలాగే పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేశారు.

ఈ విధంగా వెంకట చైతన్య నిహారిక విడాకులు తీసుకున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నటువంటి తరుణంలో కోర్టు కూడా వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది దీనితో నిహారిక సోషల్ మీడియా వేదికగా తన విడాకుల గురించి స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే నిహారిక విడాకులకు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది. ముందుగా విడాకుల కోసం నిహారిక కాకుండా తన భర్త వెంకట చైతన్య కోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది.

నిహారికకు విడిపోవడం ఇష్టం లేదని కానీ తన భర్త ఇష్ట ప్రకారమే తాను కూడా విడాకులు ఇవ్వడానికి సిద్ధమైందని తెలుస్తోంది. నిహారిక కంటే ముందుగా వెంకట చైతన్య విడాకులు ఇవ్వడానికి కారణం కూడా ఉంది. నిహారిక తిరిగి ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేనటువంటి వెంకట చైతన్య తనకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకొని తానే ముందుగా విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.

Niharika Divorce: వెంకట చైతన్య ముందుగా పిటిషన్ వేశారా…

నిహారిక తరపు న్యాయవాది విరి విడాకుల గురించి చెబుతూ ముందుగా వెంకట చైతన్య విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఇక్కడ నిహారిక తరపు న్యాయవాది మరెవరో కాదు పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు అయినటువంటి దిలీప్ సుంకర నిహారిక తరపు లాయర్ గా నిలబడ్డారు నాగబాబుకి కూడా అత్యంత సన్నిహితుడు.

Niharika Divorce: అఫీషియల్ విడాకుల గురించి అధికారికంగా ప్రకటించిన నిహారిక… అర్థం చేసుకోండంటూ?

Niharika Divorce: మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోని కూకట్ పల్లి కోర్టులో ఈమె విడాకులు కోసం పిటిషన్ దాఖలు చేశారన్న వార్త వైరల్ అవుతుంది. ఇలా అధికారికంగా వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు అయితే తాజాగా నిహారిక విడాకుల గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించి చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

ఇలా తన విడాకుల గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టాయి. దీంతో ఈమె తన విడాకుల గురించి అధికారకంగా ప్రకటిస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది ఇంస్టాగ్రామ్ వేదికగా ఈమె స్పందిస్తూ.. నేను చైతన్య ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకోబోతున్నామని తెలిపారు. ఇది చాలా సున్నితమైన విషయం.

మేమిద్దరం కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితంలో ప్రైవసీని కోరుకుంటున్నాము. ఇలాంటి సమయంలో నా కుటుంబం నా స్నేహితులు నాకు మంచి సపోర్ట్ ఇస్తూ పిల్లర్ లా నిలబడ్డారు. దయచేసి మాపై నెగిటివ్ ప్రచారం చేయకండి ఇది ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయం.ఇలాంటి సమయంలో ఇబ్బంది పెట్టకండి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అంటూ నిహారిక చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Niharika Divorce: నెగిటివ్ ప్రచారం చేయకండి…


ఈ విధంగా ఇన్ని రోజుల నుంచి నిహారిక విడాకుల గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్న ఎవరు కూడా ఈ వార్తలపై స్పందించలేదు.తాజాగా నిహారిక మాత్రం ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకోబోతున్నాము అంటూ విడాకుల గురించి అధికారక ప్రకటన చేయడంతో పలువురు ఈమె వ్యవహారం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Samyuktha Menon: ఇదేం పోయేకాలం సంయుక్త… పెళ్లయి విడాకులు తీసుకున్న హీరోతో ప్రేమాయనమా?

Samyuktha Menon: సంయుక్త మీనన్ పరిచయం అవసరం లేని పేరు.మలయాళీ ముద్దుగుమ్మగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం తెలుగులో మాత్రం వరుస సినిమా అవకాశాలను అందుకుని వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని దూసుకుపోతున్నారు. తాజాగా ఈమె విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సాయి ధరమ్ తేజ్,సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఈ సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల వల్ల కూడా వార్తల్లో నిలుస్తున్నారు.

సంయుక్త మీనన్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అఫైర్ పెట్టుకుంది అంటూ గత కొద్దిరోజులకు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో లేదో తెలియదు కానీ ఈ వార్తల ద్వారా ఈమె ఫేమస్ అయ్యారు. ఇకపోతే తాజాగా మరో వార్త ద్వారా ఈమె సోషల్ మీడియా వార్తలలో నిలిచారు. సంయుక్త మీనన్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోతో ప్రేమాయణం కొనసాగిస్తుందని సమాచారం.

Samyuktha Menon: విడాకుల తీసుకున్న హీరోతో ఎఫైర్…


కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోతో ఈమె సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. అయితే ఆ హీరోతో ఈమె ప్రేమలో పడ్డారని వార్తలు వస్తున్నాయి అయితే ఆ హీరోకి ఇదివరకే విడాకులు కూడా జరగడం గమనార్హం. ఇలా విడాకులు తీసుకున్న హీరోతో సంయుక్త మీనన్ ప్రేమలో పడటం ఏంటి అంటూ అందరూ పెద్ద ఎత్తున ఈ విషయంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో తెలియాల్సి ఉంది.

Niharika: విడాకుల గురించి నిహారికకి ఎదురైన ప్రశ్న.. నిహారిక రియాక్షన్ ఏమిటో తెలుసా..?

Niharika: మెగా డాటర్ నిహారిక పేరు గత కొంతకాలంగా తరచు వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా నిహారిక విడాకుల వార్తలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. జొన్నలగడ్డ వెంకట చైతన్యని వివాహం చేసుకున్న నిహారిక గత కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడమే కాకుండా వారి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయటంతో వీరి విడాకులు వార్తలకు మరింత బలం చేకూరింది. ఇలా విడాకుల గురించి రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ నిహారిక మాత్రం తన కెరీర్ మీద దృష్టి పెట్టింది. పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన నిహారిక ఇటీవల కొత్త ఆఫీసు కూడా ప్రారంభించింది. ఇక నిహారిక నటించిన ‘ డెడ్ పిక్సెల్స్ ‘ అనే వెబ్ సిరీస్ మే 19వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి విడుదలైన ట్రైలర్ అంచనాలను పెంచింది.ఈ వెబ్ సిరీస్ లో గాయత్రి అనే పాత్రలో నిహారిక కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో నిహారిక పాల్గొనింది. ఈ క్రమంలో విడాకుల గురించి నిహారిక కి ప్రశ్న ఎదురయింది. జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో నిజా నిజాలు ఏంటి అని నిహారికను ప్రశ్నించగా…ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నిహారిక దాటవేసింది.

Niharika: విడాకుల ప్రశ్న దాటివేసిన నిహారిక…

ఇలా విడాకుల వార్తలు గురించి నిహారిక మౌనం వహించటంతో ఈ వార్తలలో నిజం ఉందని నమ్ముతున్నారు. ఒకవేళ తన భర్తతో విడాకులు తీసుకోకపోతే నిహారిక ఈ వార్తలను ఖండించేదని , ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి నిహారిక మౌనంగా ఈ ప్రశ్నను దాటవేసిందని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు కూతురి గురించి ఏ చిన్న వార్త బయటికి వచ్చిన స్పందించే నాగబాబు ఇన్ని రోజులుగా కూతురి విడాకులు వార్తలు వినిపిస్తున్నప్పటికీ నాగబాబు స్పందించకపోవడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది

Kalyan Dev: మిస్ అవుతున్న అంటూ కళ్యాణ్ దేవ్ పోస్ట్…. విడాకుల విషయాన్ని పక్కా చెప్పినట్లేనా?

Kalyan Dev: చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి పరిచయం అవసరం లేదు. ఈయన చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను రెండవ వివాహం చేసుకున్నారు. ఇలా కళ్యాణ్ దేవ్ శ్రీజ దంపతుల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటూ ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అయితే పాప పుట్టిన తర్వాత వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

అయితే శ్రీజ కళ్యాణ్ దేవ్ ఇద్దరు ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారని వీరిద్దరికి విడాకులు అధికారకంగా పూర్తి అయినప్పటికీ మెగా ఫ్యామిలీ మాత్రం ఈ విషయాన్ని తెలియజేయడం లేదని తెలుస్తుంది.అయితే కళ్యాణ్ దేవ్ మాత్రం సోషల్ మీడియా వేదికగా తన కుమార్తెను మిస్ అవుతున్నాను అంటూ పలుమార్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే కళ్యాణ్ దేవ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలోఒక పాప స్కూల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ వేదిక ముందే కూర్చున్నటువంటి తన తల్లిదండ్రులను చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక ఈ వీడియోని కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తాను కూడా తన పిల్లలని మిస్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

Kalyan Dev: తల్లిదండ్రుల ఇద్దరు ప్రేమ కావాలి..

ఈ క్రమంలోనే ఈ వీడియోని షేర్ చేసిన కళ్యాణ్ పిల్లలకు తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ కావాలి. నవిష్క నివృత్తిని చాలా మిస్ అవుతున్నాను అంటూ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. అయితే నవిష్క మాత్రమే కళ్యాణ్ దేవ్ కుమార్తె అని నివృతి మాత్రం శ్రీజ మొదటి భర్త కూతురు అయినప్పటికీ తనని కూడా మిస్ అవుతున్నాను అంటూ కళ్యాణ్ దేవ్ పోస్ట్ చేయడం గమనార్హం.