Niharika: మెగా డాటర్ నిహారిక తన విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారకంగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. జొన్నలగడ్డ వెంకట చైతన్య నుంచి విడాకులు తీసుకున్నానని అయితే ఇద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని తెలియజేశారు. అయితే వీరి విడాకుల కోసం వేసిన పిటిషన్ చూస్తే ముందుగా చైతన్య విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.
ఇక వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణం ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలేనని తెలుస్తోంది. నిహారిక సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. అయితే చైతన్య ఫ్యామిలీకి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. దీంతో చైతన్య నిహారిక వ్యవహార శైలి కారణంగా విసిగిపోయి తనతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయారు.
నిహారిక విడాకులు వార్తలు గురించి రోజుకొక ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నిహారిక మాత్రం తాను విడాకులు తీసుకున్నానన్న బాధ తనలో ఏ మాత్రం కూడా కనపడటం లేదని తెలుస్తోంది.ఈమె విడాకులను ప్రకటించి కనీసం వారం కూడా కాకుండానే సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ అవుతూ ఉన్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన స్నేహితులతో కలిసి ఎంతో చిల్ అవుతున్నటువంటి ఫోటోలను వీడియోలను షేర్ చేశారు. ఇలా ఈ వీడియోలను షేర్ చేయగా అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.మన కులపు పరువు తీసావని కొందరు కామెంట్లు చేయగా మరికొందరు నువ్వు మెగా ఫ్యామిలీ జాతి రత్నానివి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు భర్త నుంచి విడిపోయాను అన్న బాధ ఏ మాత్రం లేదుగా అంటూ నిహారిక వ్యవహార శైలి పై కామెంట్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…