Movie News

Salaar: సలార్ పృధ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో ఆ టాలీవుడ్ హీరోని తీసుకోవాలనుకున్నారా… ఏమైందంటే?

Salaar: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం సలార్. ఈ సినిమా ఎన్నో అంచనాలను ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ఇకపోతే ఈ సినిమాలో జగపతిబాబు ఆయన కొడుకు మెయిన్ విలన్లుగా కనిపించబోతున్నారు ఇక జగపతిబాబు కొడుకు పాత్రలో మలయాళ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే పృధ్విరాజ్ పాత్రలో టాలీవుడ్ హీరో అయితే బాగుంటుందని ప్రభాస్ డైరెక్టర్ కి సలహా ఇచ్చారట అయితే డైరెక్టర్ మాత్రం చాలా సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది.

ప్రభాస్ తన ఆప్తమిత్రుడు అయినటువంటి హీరో గోపీచంద్ ఈ సినిమాలో విలన్ పాత్రలో తీసుకోవాలని సూచించారట ఇదివరకు వీరిద్దరూ వర్షం సినిమాలో హీరో విలన్లుగా నటించిన సంగతి మనకు తెలిసిందే. దీంతో ప్రభాస్ గోపీచంద్ పేరును సూచించగా ప్రశాంత్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇద్దరూ కూడా తెలుగువారే అయితే మార్కెట్ పరంగా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాదని చెప్పడంతో ప్రభాస్ ఈ విషయంలో సైలెంట్ అయ్యారట.

Salaar: రెండు భాగాలుగా సలార్…


ఈ విధంగా ప్రభాస్ గోపీచంద్ పేరును సూచించగా ఆయన మాత్రం మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ మొదటి సారి హీరోయిన్ గా నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28 విడుదలకు సిద్ధమవుతుంది.ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago