Smriti Irani: కేంద్ర స్త్రీ శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మంత్రి స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమె కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకోక ముందు నటిగా పలు బుల్లితెర కార్యక్రమాలలోనూ నటించి పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న స్మృతి ఇరానీ అనంతరం రాజకీయాలలోకి వెళ్లి అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇకపోతే ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన సినీ కెరియర్ గురించి కొన్ని విషయాలు తెలియజేశారు.బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతోమందికి ఒక కుటుంబ సభ్యురాలుగా మారిపోయానని తెలిపారు. అయితే అప్పట్లో సీరియల్స్ ద్వారా వచ్చే డబ్బు తనకు ఏమాత్రం సరిపోయేది కాదని తెలిపారు.
పెళ్లి చేసుకున్న తర్వాత బ్యాంకు నుంచి 25 లక్షల లోన్ తీసుకొని ఇల్లును కొనుగోలు చేసాము ప్రతినెల ఈఎంఐ కట్టడానికి కూడా డబ్బు సరిపోయేది కాదు.ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాము అలాంటి సమయంలో కొందరు వ్యక్తులు నా వద్దకు వచ్చి ఒక యాడ్ చేయమని చెప్పారు. అందుకోసం వారు కోటి రూపాయల రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారు.అయితే తాను ఆఫర్ రిజెక్ట్ చేసానని తెలిపారు. అప్పుడు తన స్నేహితులందరూ పిచ్చి గాని పట్టిందా నీకు అంటూ తనని తిట్టారని తెలిపారు.
ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈమె కోటి రూపాయలు ఆఫర్ వచ్చినప్పటికీ ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయానికి వస్తే ఈమెకు అంత పెద్ద ఆఫర్ ఇచ్చినది మరెవరో కాదు పాన్ మసాలా కంపెనీకి చెందినటువంటి వారు. ఇలా పాన్ మసాలా యాడ్ చేస్తే తనకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పడంతో హానికరమైన వస్తువులను తాను ప్రమోట్ చేయనని చెప్పి ఈ ఆఫర్స్ రిజెక్ట్ చేశానని స్మృతి ఇరానీ వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…