Tag Archives: Fish

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహార పదర్ధాలను తినాల్సిందే!

ప్రస్తుత జీవన గమణంలో పని మీద పెట్టిన దృష్టి ఆరోగ్యంపై ఏ మాత్రం పెట్టలేకపోతున్నారు. దీంతో వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ వ్యాధుల్లో కిడ్నీలకు సంబంధించి వ్యాధుల్లో ఎక్కువగా బాధపడుతున్నారు. ఇది మానవ శరీరంలోని టాక్సిన్ అన్నింటిని బయటికి పంపే పనిని నిర్వహిస్తాయి.

శరీరంలో ప్రతీ అవయవం ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. లేదంటే.. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచాలంటే.. తీసుకోవాల్సిన ఆహార పదర్థాలు ఇవే.. అందులో వెల్లుల్లి ముఖ్యమైనది.. దీనిలో పాస్పరస్, పొటాషియం, సోడియం లాంటివి తగిన పరిమాణంలో ఉంటాయి.

ఇవి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువగా సహాయపడతాయి. రెండోది క్యాప్సికమ్.. క్యాప్సికమ్ అంటే కూడా కొంతమందికి ఇష్టం ఉంటుంది.. మరి కొంతమందికి ఇష్టం ఉండదు. దీనిలో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. ఇది కూడా ముత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి.చేపలు కూడా కిడ్నీలకు మేలు చేస్తాయి.

ఇక ప్రతీ ఒక్కరు ఇష్టపడే యాపిల్ కూడా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి. దీనిలో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది కిడ్నీలకు ఎక్కువగా మేలు చేస్తుంది. ఇక చివరగా క్యాబేజీ ఒకటి. దీనిలో ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయి.

వారానికి రెండు సార్లు చేపలు తింటే ఈ సమస్యను దూరం పెట్టవచ్చు..?

సాధారణంగా మన ఆరోగ్యానికి చేపలు ఎంతో మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే.చేపలు ఎన్నో పోషక పదార్థాలు ఉండటం వల్ల చేపలను తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి కనుక చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. అయితే తాజా అధ్యయనాల ప్రకారం వారానికి కనీసం రెండు సార్లు చేపలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వెల్లడైంది.

ముఖ్యంగా వారంలో రెండు సార్లు చేపలు తినటం వల్ల మెదడుకు సంబంధించిన వ్యాధులను దూరం పెట్టవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. సెరెబ్రోవాస్కులర్ డిసీజ్ ఇది మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలను మూసివేసి మెదడు రక్త ప్రసరణ వ్యవస్థ కు ఆటంకం కలిగిస్తుంది. దీంతో మెదడులో స్ట్రోక్స్ రావడం లేదా అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది.

అయితే ఈ విధమైనటువంటి సమస్యను దూరం చేసుకోవడానికి వారానికి తప్పనిసరిగా రెండుసార్లు చేపలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.చేపలలో ఉండే ఒమేగా 3 పాలీఅన్‏శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ సెరెబ్రోవాస్కులర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదేవిధంగా మెదడులో ఏ విధమైనటువంటి స్ట్రోక్ రాకుండా కాపాడటమే కాకుండా అధిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

కేవలం మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఏ కాకుండా ఇతర అనారోగ్య సమస్యలను కూడా దూరం చేయడంలో చేపలు ఎంతో కీలకపాత్ర వహిస్తాయి కనుక చేపలను తరచూ తినడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని ఫ్రాన్స్ లోని బోర్డోక్స్ యూనివర్సిటీలో సీనియర్ పరిశోధకురాలు..డాక్టర్ సిసిలియా సమీరీ వెల్లడించారు.

మత్స్యకారుడి వలలో లక్షలు విలువ చేసే చేప… ఈ చేప ప్రత్యేకత ఏమిటంటే?

సాధారణంగా మత్స్యకారులు చేపల వేట నమ్ముకుని బతుకుతుంటారు.అయితే వేటకు వెళ్ళిన సమయంలో కొన్నిసార్లు మత్స్యకారులకు తీవ్ర నిరాశ ఎదురవుతూ ఉంటుంది.అదే విధంగా మరి కొన్నిసార్లు అదృష్టం తలుపు తట్టినట్టు ఎంతో అరుదైన చేపలు వలలోకి పడటంతో ఒక్కసారిగా లక్షాధికారులుగా మారిపోతుంటారు. ఇలాంటి సంఘటనలు ఇదివరకు ఎన్నో జరిగాయి. తాజాగా ఇలాంటి ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది.

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన కృష్ణాజిల్లా మత్స్యకారుల వలలో అరుదైన చేపలు పడ్డాయి. కచిలి చేపలి అనే 16 కిలోల మగ చేప, 15 కిలోల ఆడచేప దొరకడంతో మత్స్యకారులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మత్స్య కారులు ఆ చేపను ఫిషింగ్ హార్బర్ కు తీసుకువచ్చారు.

ఈ అరుదైన చేపల కోసం ఫిషింగ్ హార్బర్ లో వ్యాపారస్తులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.మార్కెట్లో ఒక చేప లక్ష రూపాయల పైగా ధర పలకగా లక్షలోపు ధర పలకడంతో ఒక్కసారిగా లక్షాధికారిగా మారిపోయాడు. ఎంతో ఖరీదు చేసే ఈ చేప ఎక్కువగా మందుల తయారీకి ఉపయోగించడం వల్ల వీటికి అధిక డిమాండ్ ఏర్పడింది. అదేవిధంగా ఈ చేపలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడంతో ఈ చేపలు అధిక ధర పలకడం విశేషం.

సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు జాలర్ల గల్లంతు!

శ్రీకాకుళం: సముద్ర తీరంలో చేపల వేటకు ముగ్గురు జాలర్లు గల్లంతయ్యారు. వారిలో జాలరి గణేశ్‌ మృతదేహం లభ్యం కాగా మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. వేకువజామున సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు సముద్రంలో ఏర్పాడిన ప్రతికూల పరిస్థితుల కారణంగా గల్లంతయ్యారు. ఈ సంఘటన శ్రీకాకుళం గార మండలం బందరువానిపేటలో చోటుచేసుకుంది.

పాలు.. చేపలు కలిపి తింటే చర్మ సమస్యలు వస్తాయా… దీనిలో నిజమెంత?

పాలు ప్రతిరోజు త్రాగటం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే చేపలు ఎంతో మంది ఇష్టంగా తినే మాంసాహారం. కానీ ఈ రెండింటిని కలిపి తినటం వల్ల లేదా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే తీసుకోవటం వల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయని మన పెద్దలు చెబుతుంటారు. నిజానికి పురాతన కాలం నుండి ఆయుర్వేదాన్ని అనుసరించి మన పెద్దలు చేపలు మరియు పాలు కలిపి తీసుకోవటంవల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు.కానీ మన శాస్త్రవేత్తలు దీనిని కొట్టిపారేస్తున్నారు.

పాలు మరియు చేపలు కలిపి తినటం వల్ల అందరిలోనూ చర్మ సమస్యలు తలెత్తుతాయని చెప్పలేము. అయితే ఇది వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. కొందరిలో ఈ పాలు, చేపలను కలిపి తీసుకోవటంవల్ల స్వల్ప జీర్ణ సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం చేపలు మరియు పాలు కలిపి తినకూడదని కచ్చితంగా చెబుతున్నారు

ఆయుర్వేదం ప్రకారం పాలు మరియు చేపలు ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవటం వల్ల మన శరీరంలో లూకోడెర్మా స్థితి రావచ్చు. లూకోడెర్మా అంటే స్కిన్ పిగ్మెంటేషన్(చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడటం). కానీ కొందరు మాత్రం చేపలు అసిడిక్ ప్రభావాన్ని మరియు పాలు ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల అవి మన శరీరంలో జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు దారితీయవచ్చని చెబుతున్నారు.

ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అంజు సూత్ మాత్రం చేపలు మరియు పాలు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అనటానికి శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు. అందువలన పాలతో కలిపి ఎటువంటి ఆహారాన్ని అయినా తీసుకోవచ్చని ఆమె పేర్కొంది.

జాలరికి తగిలిన జాక్ పాట్.. ఏకంగా చేప కడుపులో అది చూసి ఆశ్చర్యపోయిన జాలరి?

సాధారణంగా వేటకు వెళ్లే జాలర్లకు రోజు ఎన్నో విచిత్ర సంఘటనలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి వేటలో చేపలు పడక నిరాశతో వెను తిరిగి వస్తుంటే మరోసారి అనుకోకుండా వారికి వివిధ రూపాలలో అదృష్టం వరిస్తుంది. ఇలాంటి అదృష్టం తన్నుకొచ్చినప్పుడు జాలర్లు సంతోషానికి అవధులు ఉండవు. తాజాగా ఇలాంటి అద్భుతమైన ఘటన ఓ జాలరికి దక్కింది.

ఎప్పుడూలాగే వేటకు వెళ్ళిన ఆ జాలరికి ఓ భారీ చేప పడటంతో ఎంతో సంతోషంగా దానిని బయటకు లాగాడు. ఆ సంతోషంలోనే జాలరి చేపలను కట్ చేస్తుండగా ఒక చేపలో అతనికి ఏదో గట్టిగా ఉన్నట్లు గమనించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతడు ఆ చేపను కట్ చేసి చూస్తే అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం బయటపడింది.

ఆ చేప కడుపులో ఓపెన్ చేయనీ ఒక మద్యం బాటిల్ కనిపించడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం మనుషులు చేసే పనుల వల్ల ఎన్నో మూగజీవాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పడానికి ఇదొక మంచి నిదర్శనమని కామెంట్లు చేయగా, మరికొందరు మనుషుల బాధ్యతారహిత ప్రవర్తనకు ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందని జంతు ప్రేమికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం  ‘జాక్‌పాట్‌ కొట్టావ్‌.. క్యాచ్‌ ఆఫ్‌ ది డే’ అంటూ ఫన్నీగా కామెంట్‌ చేశారు.