సాధారణంగా వేటకు వెళ్లే జాలర్లకు రోజు ఎన్నో విచిత్ర సంఘటనలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి వేటలో చేపలు పడక నిరాశతో వెను తిరిగి వస్తుంటే మరోసారి అనుకోకుండా వారికి వివిధ రూపాలలో అదృష్టం వరిస్తుంది. ఇలాంటి అదృష్టం తన్నుకొచ్చినప్పుడు జాలర్లు సంతోషానికి అవధులు ఉండవు. తాజాగా ఇలాంటి అద్భుతమైన ఘటన ఓ జాలరికి దక్కింది.
ఎప్పుడూలాగే వేటకు వెళ్ళిన ఆ జాలరికి ఓ భారీ చేప పడటంతో ఎంతో సంతోషంగా దానిని బయటకు లాగాడు. ఆ సంతోషంలోనే జాలరి చేపలను కట్ చేస్తుండగా ఒక చేపలో అతనికి ఏదో గట్టిగా ఉన్నట్లు గమనించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతడు ఆ చేపను కట్ చేసి చూస్తే అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం బయటపడింది.
ఆ చేప కడుపులో ఓపెన్ చేయనీ ఒక మద్యం బాటిల్ కనిపించడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం మనుషులు చేసే పనుల వల్ల ఎన్నో మూగజీవాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పడానికి ఇదొక మంచి నిదర్శనమని కామెంట్లు చేయగా, మరికొందరు మనుషుల బాధ్యతారహిత ప్రవర్తనకు ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందని జంతు ప్రేమికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ‘జాక్‌పాట్ కొట్టావ్.. క్యాచ్ ఆఫ్ ది డే’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు.
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…