Categories: FeaturedMovie News

కె.ఆర్.విజయ కూతురు టాలీవుడ్ హీరోయిన్ అని… మనం రోజు చూస్తున్న సీరియల్ నటీమణి అని మీకు తెలుసా..?

నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న తెలుగు సీనియర్ నటీమణి కె.ఆర్.విజయ కు సంబంధించిన ఎవరూ కూడా సినీ పరిశ్రమలో లేరని అందరూ అనుకుంటారు కానీ ఆమె కూతుర్లు, చెల్లెల్లు తదితరులు కూడా మూవీ ఇండస్ట్రీ అరంగేట్రం చేసారు.

తన చెల్లి కె.ఆర్ విజయ తెలుగు, తమిళం మలయాళం పలు భాషల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నారు. చెల్లి సావిత్రి కేవలం మలయాళం సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యారు. కె.ఆర్ సావిత్రి తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కేఆర్ సావిత్రి తండ్రి ఆంధ్రప్రదేశ్ కి చెందినవాడు కాగా తల్లి మాత్రం కేరళ రాష్ట్రానికి చెందిన వారు. ఇకపోతే కే.ఆర్ విజయ కూతురు అనూష కూడా నటీమణే. ఆమె సోదరి మణి రాగసుధ కూడా తమిళ, కన్నడ, మలయాళం తెలుగు సినిమాలలో నటించారు. నిజం చెప్పాలంటే కేఆర్ విజయ బంధువులంతా దిగ్గజ నటీనటులుగా భారతీయ సినిమా పరిశ్రమలో ఒక ఊపు ఊపారు. కె.ఆర్.విజయ అమ్మవారి పాత్రల్లో ఎక్కువగా నటించేవారు. ముఖ్యంగా కనకదుర్గ అమ్మవారి పాత్రలలో ఆమె నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

ఇకపోతే కేఆర్ విజయ కూతురు పదమూడవ యేట మలయాళం సినిమాల్లో హీరోయిన్ గా అరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే నటీమణిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 13 ఏళ్ళ వయసులోనే తన అద్భుతమైన నటన చాతుర్యం చూపించి సినీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు. ఈ సినిమాలో ఆమె చూపించిన నటనా ప్రతిభ కి ఫిదా అయిపోయిన దర్శకనిర్మాతలు అందరూ ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఆ విధంగా తన అందచందాలతో, నటనా చాతుర్యంతో మలయాళం అనేక అవకాశాలు చెక్కించుకుంటూ.. సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. మలయాళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అనూష తదనంతరం తెలుగు సినీ రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. కొన్ని సంవత్సరాల తర్వాత తెలుగు ధారావాహికలలో ప్రధాన పాత్రల్లో నటించడం ప్రారంభించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన గోల్ మాల్ గోవిందం సినిమాలో హీరోయిన్ గా కనిపించారు. ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ మహాయజ్ఞం, అగ్రిమెంట్ నాగజ్యోతి వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి అనూష ఎదగలేకపోయారు కానీ మలయాళ పరిశ్రమలో మాత్రం ఎదురులేని హీరోయిన్ గా దూసుకెళ్లారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆమెకు సినిమా అవకాశాలు బాగా సన్నగిల్లిపోయాయి. దీంతో బ్రతుకుతెరువుకోసం ఏకంగా తెలుగు టీవీ సీరియల్ లో నటించడానికి సిద్ధమయ్యారు అనూష. గృహలక్ష్మి, నిన్నేపెళ్లాడుతా, జయం వంటి సీరియల్ లో నటించే మంచి పేరు సంపాదించారు. ఏది ఏమైనా ఎంతో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కూడా అనూష సరైన గుర్తింపు తెచ్చుకోలేక పోయారు. సినిమా రంగాల్లో గుర్తింపు తెచ్చుకోవాలంటే కేవలం ఒక బ్యాక్ గ్రౌండ్ ఉంటే సరిపోదని నటనా ప్రతిభ, అందం అభినయం అన్ని ఉండాలని అనూష విషయంలో నిరూపితమయింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago