Tag Archives: glass

Pawan Kalyan: గ్లాస్ డైలాగుపై మరోసారి స్పందించిన పవన్.. మీరు ఒప్పుకోవాలంటూ రియాక్ట్ అయిన హరీష్?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ప్రకటించి పూర్తిగా రాజకీయాల పైన ఫోకస్ పెట్టారు. ఇలా రాజకీయాల పరంగా ఈయన ఎంతో బిజీగా ఉండడంతో తన సినిమా షూటింగ్లన్నీ కూడా వాయిదా పడిన సంగతి మనకు తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలలో బిజీ అవుతున్నటువంటి తరుణంలో ఆయన నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఇటీవల భగత్స్ బ్లేజ్ అంటూ ఒక వీడియో విడుదలైన సంగతి మనకు తెలిసిందే.

ఈ వీడియోలో భాగంగా పవన్ కళ్యాణ్ గ్లాస్ డైలాగులు అదిరిపోయాయని చెప్పాలి. పగిలే కొద్ది గ్లాస్ కి పదును ఎక్కువ.. గ్లాస్ అంటే సైజు కాదు అది కనిపించని సైన్యం అంటూ చెప్పినటువంటి ఈ డైలాగ్స్ భారీ స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ డైలాగు పట్ల తాజాగా పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

తనకు సినిమాలలో ఇలాంటి డైలాగులు చెప్పడం అంటే ఇష్టం ఉండదని నేను హరీష్ శంకర్ దగ్గర చెప్పాను ఎందుకు ఇలాంటి డైలాగ్స్ పెట్టారని అడగగా అందుకు హరీష్ సమాధానం చెబుతూ మీకు తెలియదు మా బాధలు మాకు ఉన్నాయి ఇలాంటి డైలాగ్స్ రాకపోతే అభిమానులు ఊరుకోరు అంటూ హరీష్ సమాధానం చెప్పారని పవన్ వెల్లడించారు.

అభిమానులు ఊరుకోరు..
ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందిస్తూ.. మీ ప్రేమకు ధన్యవాదాలు సర్కార్ మీరు అంగీకరించాలే కానీ ఇలాంటివి ఇంకా రాస్తాము అంటూ ఈ సందర్భంగా హరీష్ శంకర్ చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Trending News: ఇదెక్కడి వింత రా బాబు..! టీ తాగుతూ ఇలాంటి పని చేశాడేంటి..?

Trending News: ఆ వ్యక్తికి 55 సంవత్సరాలు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా.. బంధువులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ నొప్పి గత కొన్ని రోజులుగా ఉందని.. అతడు వైద్యుడికి చెప్పాడు. అస్సలు ఏమైందా అని వాళ్లు పరీక్షలు చేయగా.. షాక్ అయ్యారు.

Trending News: ఇదెక్కడి వింత రా బాబు..! టీ తాగుతూ ఇలాంటి పని చేశాడేంటి..?

సీటీ స్కాన్ తీయగా.. కడుపులో ఉన్న ఆ వస్తువు చూసి వైద్యులే దిమ్మతిరిగిపోయారు. ఆ టెస్ట్‌ల్లో బాధితుడి కడుపులో గ్లాసు ఉన్నట్టుగా గుర్తించారు వైద్యులు. దాంతోనే అతడికి కొడుపు నొప్పి వస్తుందని కుటుంబసభ్యులకు చెప్పారు.

Trending News: ఇదెక్కడి వింత రా బాబు..! టీ తాగుతూ ఇలాంటి పని చేశాడేంటి..?

అసలు ఆ గ్లాస్ కడుపులోకి ఎలా వెళ్లింది.. అతడు దానిని చిన్న పిల్లల మాదిరిగా ఎలా మింగాడు.. దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని ముజఫర్పుర్ జిల్లా మడిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆ వివవరాలు తెలుసుకుందాం..

ఎండోస్కోపీ చేసి గ్లాస్ ను తొలగించే ప్రయత్నం..


మడిపూర్ గ్రామానికి చెందిన 55ఏళ్ల వ్యక్తికి సడన్ గా కడపు నొప్పి రావడం స్టార్ట్ అయింది. వెంటనే పోతుందిలే అనుకున్నాడు. కానీ నొప్పి మాత్రం అస్సలు తగ్గలేదు. దీంతో అతడు.. వైద్యుడిని సంప్రదించగా.. పరీక్షల అనంతరం అతడి కడుపులో గ్లాస్ ఉన్నట్లు గమనించారు వైద్యులు. అది ఎలా మింగావని అడగ్గా.. అతడు ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ రోజు అతడు టీ తాగేటప్పుడు గ్లాస్ కూడా మింగేసినట్లు తెలిపాడు. అయితే టీ తాగుతుండగా గ్లాస్‌ను మింగేసినట్టు చెప్పిన రోగి మాటలు నమ్మశక్యంగా లేవని వైద్యులు అంటున్నారు. అయితే తొలుత అతడికి ఎండోస్కోపీ చేసి గ్లాస్ ను తొలగించే ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాకపోవడంతో.. చివరకు ఆపరేషన్‌ చేసి గ్లాస్‌ ను తొలగించారు. దీంతో అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు వైద్యులు. గ్లాస్ ఆహార నాళంలో ఎలా పట్టిందో అర్థం కాక వైద్యులు తలలు పట్టుకుంటన్నారు. చిన్న పిల్లల మాదిరిగా గ్లాస్ మింగేయడం ఏంటి అంటూ.. గ్రామస్తులు గుసగుసలు ఆడుతున్నారు.