Tag Archives: god

Allu Arjun: నాకు అన్ని ఇచ్చిన నాన్నే నాకు దేవుడు.. ఎమోషనల్ అయిన అల్లు అర్జున్!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటూ ఉండగా అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ 2 గ్రాండ్ ఫినాలే కి అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన అక్కడ కంటెస్టెంట్లతో కలిసి సరదాగా ముచ్చటించారు. అంతేకాకుండా శృతి అనే కంటెంట్ పాట పాడటంతో తనకు శృతి అనే పేరు అంటే చాలా ఇష్టమని తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా శృతి అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ తన తండ్రి గురించి కూడా మాట్లాడారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ నాకు దేవుడు ఎలా ఉంటారో తెలియదు కానీ నాకు అన్ని ఇచ్చిన మా నాన్నే నాకు దేవుడు.నాకు మా నాన్నని కనిపించే దేవుడు అంటూ అల్లు అర్జున్ ఈ సందర్భంగా తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.ఇక అల్లు అర్జున్ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో సక్సెస్ సాధించారు అంటే అందుకు కారణం తన తండ్రి కూడా అని చెప్పాలి.

Allu Arjun: దేవుడు ఎలా ఉంటారో తెలీదు…

ఇలా ఇండస్ట్రీలో తాను ఏదగడానికి తన తండ్రి సహకారం ఎంతో ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా అల్లు అర్జున్ తెలియజేస్తూ తనకు తన తండ్రి దేవుడు అంటూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

K.A Paul: చనిపోయిన నా భార్యను దేవుడితో మాట్లాడి బ్రతికించుకున్నా: K.A పాల్

K.A Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన 2019 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రజాశాంతి పార్టీ స్థాపించి పెద్దఎత్తున వార్తల్లో నిలిచారు. అప్పటి నుంచి ఈయన ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఇక కరోనా సమయంలో ఈయన తన ఇష్ట దైవం గురించి చేసిన వ్యాఖ్యలు మనకు తెలిసిందే.

K.APaul: చనిపోయిన నా భార్యను దేవుడితో మాట్లాడి బ్రతికించుకున్నా: పాల్

తాజాగా కేఏ పాల్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని గతంలో కే ఏ పాల్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు. కరోనా సమయంలో తన భార్య కరోనా సోకీ చనిపోయి తన భార్యను బ్రతికించుకున్నానని ఈయన చేసిన వ్యాఖ్యల పై స్పందించి అసలు విషయం వెల్లడించారు.

K.APaul: చనిపోయిన నా భార్యను దేవుడితో మాట్లాడి బ్రతికించుకున్నా: పాల్

తన భార్య కరోనా సోకిన 2 నెలల పాటు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సమయంలో నేను నా మిగతా పనులన్నింటినీ పక్కనపెట్టి కేవలం తన భార్య కోసమే దేవుడిని ప్రార్థించానని తన ప్రార్థనతో తన భార్యను బ్రతికించుకున్నానని ఈ సందర్భంగా పాల్ తెలియజేశారు. తన భార్యను బ్రతికించమని దేవుడికి కండిషన్ పెట్టి నిరంతరం రెండు నెలలపాటు దేవుడి ప్రార్థనలో ఉన్నానని పాల్ వెల్లడించారు.

డ్రగ్స్ లో కూరుకుపోయాయి…

అదేవిధంగా మీ ఇంటర్వ్యూ సందర్భంగా తనకు వచ్చిన భారతరత్న, నోబెల్ అవార్డులు అన్నింటిని తానే రిజెక్ట్ చేశానని పాల్ వెల్లడించారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ కూబిలో ఇరుక్కుపోయిందని రెండు తెలుగు రాష్ట్రాలు ఇలాగే ఉన్నాయని ఆయన రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు.

అయ్యప్పమాల ధరిస్తావా.. అయితే పాఠశాలకు రాకు. రావాలంటే ఆ పని చెయ్యి!

ఏమైనా కష్టాలు తీరినా.. కోరికలు తీరాలని మనకు అనిపించినా.. దేవుడికి పూజలు చేస్తాం. పూజకు సంబంధించి అన్ని సామాగ్రితో పూజలు చేస్తుంటారు. అయితే అయ్యప్ప భక్తులు మాత్రం మాలాధారణ ధరించి పూజలు చేస్తారు. ఇలా వయస్సుతో సంబంధం లేకుండా అయ్యప్ప మాల వేస్తారు. ఆ మాల ధరించినంత మాత్రానా ఏం పని చేయకుండా ఉంకూడదు అనేది కాదు.

ఏ పని అయినా చేసుకోవచ్చు. విద్యార్థులు అయితే అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వెళ్లొచ్చు. ఇక్కడ జరిగిన ఓ ఘటనలో అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వచ్చిన విద్యార్థిని ప్రిన్సిపాల్‌ పాఠశాలలోకి అనుమతించలేదు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో చోటు చేసుకుంది. దీనిపై అయ్యప్ప స్వామి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని సెయింట్‌ మేరీస్‌ హైస్కూల్‌లో పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థి అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు. అతడు ఇటీవల మాలధారణలో పాఠశాలకు వెళ్లాడు. మాల ధరించి పాఠశాలకు వచ్చినందుకు పాఠశాల ప్రిన్సిపాల్ క్లాస్ రూంలోకి రానివ్వలేదు. ఒక వేళ క్లాస్ రూంకి రావాలంటే.. ఆ మాల తీసేసి రండి అంటూ ఆదేశించారు.

ఇలా ఏం చేయలేక అతడు.. దాదాపు 40 నిమిషాల పాటు బయటనే నిలబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప మాలధారులు పాఠశాలకు వచ్చి.. పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన పాఠశాల యాజమాన్యంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని అయ్యప్ప మాలధారులు హెచ్చరించారు.

దేవుడు ఉన్నాడా.. లేడా.. ? దీనిపై పూరీ జగన్నాథ్ ఇలా చెప్పాడు..

కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు.. కొంతమంది దేవుడు లేడని నమ్ముతారు. దేవుడు లేడని వాధించేవారిని నాస్థికుడు అంటారు. అతడు కేవలం ప్రకృతి మాత్రమే అన్ని ప్రసాదిస్తుంది. దేవుడు అస్సలు ఈ సమస్థ భూగోళంలో లేడని.. అది కేవలం కట్టుకథలుగా చెప్పే గూడు పుఠాని అంటూ చెబుతాడు నాస్థికుడు. అయితే టాలీవుడ్ డైనమిక్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మొహమాటం లేకుండా ముక్కు సూటిగా మాట్లాడే పూరీ.. తన మనసులో ఏముందో బయటకు కూడా అదే అనేస్తుంటారు. ఇతడు కూడా నాస్తికుడిగా గుర్తింపు పొందాడు.

అతడు దేవుడిపై నిత్యం ఏదో ఒక అంశం మాట్లాడుతూ.. వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఈ టాపిక్ పై మరోసారి స్పందించాడు. దేవుడు ఉన్నాడా.. లేడా అంటూ ఓ వీడియోను వదిలాడు. దేవుడు ఉన్నాడా.. లేడా అనే ప్రశ్నకు ఎక్కువ సమాధానం అవసరం లేదు.. ఒక్క ముక్కలో చెప్పేయాలి.. అని ఒక వ్యక్తి జిడ్డు కృష్ణమూర్తిని ఒకరోజు నిలదీసి అడిగారు. దానికి కృష్ణమూర్తి దానికి సున్నితంగా సమాధానం చెప్పారు. కానీ ప్రశ్న అడిగిన వ్యక్తికి అర్థం కాలేదు. ఇది చెబుతూ తన ప్రసంగాన్ని ఇలా మొదలు పెట్టాడు.. ఈ ప్రశ్నకు సమాధానం జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్లుగా సున్నితంగా చెబితే కుదరదు.. కొంచెం అర్థం అయ్యేలా చెప్పాలంటూ అతడు ఇలా చెప్పుకొచ్చాడు. ఇక్కడ రెండు ప్రశ్నలు అవేంటంటే.. దేవుడు మనిషిని తయారు చేశాడా.. ? లేదా మనిషి దేవుడిని తయారు చేశాడా..? అని ప్రశ్నించుకుంటూ అతడే రెండింటికి సమాధానాలు చెప్పాడు.

దేవుడు మనుషులను తయారు చేస్తే… మనుషులు తయారు చేసిన ఐ ఫోన్ , టెస్లా కారు అద్బుతాలు అయితే దేవుడు తయారు చేసిన మనం ఇంకెంత అద్బుతంగా ఉండాలి.. అసలు మనం అలా ఉన్నామా.. లేదు కదా అని అన్నాడు. మనం దేవుడి పిల్లలమని అందరూ అంటారు.. అది నిజమైతే.. ఎందుకు కరుణ, జాలి, దయ అనేవి ఉండవు.. దేవుడు ఎలా ఉంటాడో మనం కూడా అలానే ఉండాలి కదా.. అలా ఎందుకు లేము మరి అంటూ చెప్పాడు.

మనిషే దేవుడిని తయారు చేస్తే.. దేవుడిని ఐనస్టీన్, న్యూటన్ లాంటి వారు తయారుచేశారా లేదు.. మనలాంటి వాళ్లే రాయినో, రప్పనో కొలిచి.. వాళ్లకు కష్టం వచ్చినప్పుడు ధైర్యం కోసం ఇలా చేసుకుంటూ వచ్చారు. వాళ్ల భయం నుంచి, ఆకలి నుంచి, ఆశల నుంచి, తీరని కోరికల నుంచి దేవుడు పుట్టాడు అని చెప్పాడు. ఇవన్ని లాజిక్ కు అందని ప్రశ్నలు కావునా.. దేవుడు ఉన్నాడా.. అంటే లేడని చెప్పండి అంటూ పూరీ తనదైన శైలిలో వివరించాడు.

గుడికి వెళ్ళినప్పుడు ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో తెలుసా..?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయాన్ని సందర్శించినప్పుడు మొదటగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు పూర్తిచేసిన తరువాత ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శనం చేసుకుంటాను. అయితే కొందరు దేవుడి ఆలయం చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలో పూర్తిగా అవగాహన ఉండదు. వారికి తోచిన విధంగా 3,5,7,9 ఈ విధంగా ప్రదక్షిణలు చేస్తారు. మరికొందరు ప్రత్యేకమైన కోరికలు కోరుకొని స్వామి వారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం మనం చూసే ఉంటాం. అయితే ఏ దేవుడి గుడిలో ఎన్ని ప్రదక్షిణాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

సూర్య భగవానుడికి, నవగ్రహాలకు,18 ప్రదక్షిణాలు చేయాలి. అదేవిధంగా సుబ్రమణ్యేశ్వర స్వామికి,27 ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి జరుగుతుంది.
*సోమవారం శివుడికి18 మహాలక్ష్మి అమ్మవారికి 20 ప్రదక్షిణలు చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.
*మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ 21 ప్రదక్షణలు చేయాలి.
*బుధవారం సరస్వతీదేవికి17, వినాయకుడుకి 27 ప్రదక్షిణలు చేయాలి.
*గురువారం సాయిబాబా దేవాలయంలో 16 ప్రదక్షిణలు చేయాలి.
*శుక్రవారం దుర్గా మాత ఆలయంలో 20 ప్రదక్షిణలు చేయాలి.
*శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి 21 ప్రదక్షిణలు శనీశ్వరునికి 18 ప్రదక్షిణలు చేయాలి.

ఈ విధంగా ఇష్టమైన రోజు ఇష్టమైన దేవునికి ఇన్ని ప్రదక్షిణలు చేసి ఆలయంలోనికి దేవుని దర్శనార్థం ఆలయంలోనికి ప్రవేశించాలి. ఈ విధంగా ప్రదక్షిణలు చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా, అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.