K.A Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన 2019 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రజాశాంతి పార్టీ స్థాపించి పెద్దఎత్తున వార్తల్లో నిలిచారు. అప్పటి నుంచి ఈయన ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఇక కరోనా సమయంలో ఈయన తన ఇష్ట దైవం గురించి చేసిన వ్యాఖ్యలు మనకు తెలిసిందే.
తాజాగా కేఏ పాల్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని గతంలో కే ఏ పాల్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు. కరోనా సమయంలో తన భార్య కరోనా సోకీ చనిపోయి తన భార్యను బ్రతికించుకున్నానని ఈయన చేసిన వ్యాఖ్యల పై స్పందించి అసలు విషయం వెల్లడించారు.
తన భార్య కరోనా సోకిన 2 నెలల పాటు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సమయంలో నేను నా మిగతా పనులన్నింటినీ పక్కనపెట్టి కేవలం తన భార్య కోసమే దేవుడిని ప్రార్థించానని తన ప్రార్థనతో తన భార్యను బ్రతికించుకున్నానని ఈ సందర్భంగా పాల్ తెలియజేశారు. తన భార్యను బ్రతికించమని దేవుడికి కండిషన్ పెట్టి నిరంతరం రెండు నెలలపాటు దేవుడి ప్రార్థనలో ఉన్నానని పాల్ వెల్లడించారు.
అదేవిధంగా మీ ఇంటర్వ్యూ సందర్భంగా తనకు వచ్చిన భారతరత్న, నోబెల్ అవార్డులు అన్నింటిని తానే రిజెక్ట్ చేశానని పాల్ వెల్లడించారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ కూబిలో ఇరుక్కుపోయిందని రెండు తెలుగు రాష్ట్రాలు ఇలాగే ఉన్నాయని ఆయన రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…