Tag Archives: Guavas Benefits

వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలా.. అయితే జామను తీసుకోండి..!

కరోనా మహమ్మారి వ్యాధి ప్రజలపై విరుచుకుపడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మరణించారు. అందులో కొంతమంది వ్యాధి సోకిన వారిలో కొన్నిసమస్యల కారణంగా బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇదిలా ఉండగా.. వ్యాధి నిరోధక శక్తి ఉన్న వాళ్లు కరోనాతో పోరాడి.. ప్రాణాలను కాపాడుకోగలిగారు.

ప్రతీ మనిషికి ఇమ్యూనిటీ పవర్ ఉండాలని.. వైద్యులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. వినే వాళ్లు విన్నారు.. వినని వాళ్లు వినలేదు. మంచి ఆరోగ్యం కోసం పోషకాలు కలిగిన పదర్ధాలను కూడా తీసుకోవాలని అన్నారు. కానీ ప్రస్తుత పరిస్తితుల్లో ఆ ఇమ్యూనిటీ పవర్ కోసమే చాలామంది ప్రయత్నిస్తున్నారు.

దాని కోసం వివిధ రకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్ ను తింటున్నారు. అయితే పండ్లలో మనం ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా పెంచుకోవాలంటూ జామ పండు అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. నారింజలో ఉండే విటమిన్‌–సి కంటే కూడా జామలో ఉండే విటమిన్‌–సి ఎక్కువగా ఉంటుంది.

అందుకే జామపండు ఎన్నెన్నో వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంతో పాటు ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా ఉపయోగిస్తారు. విటమిన్ సి అంటేనే వ్యాధి నిరోదక శక్తి ఎక్కువగా ఉండేది. జామలో దానితో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దీని ద్వారా మలబద్దకం కూడా తేలికగా నివారించవచ్చు. ఇలాంటి ఎన్నో గుణాలు ఉన్న జామను ఎక్కువగా చాలామంది ఇష్టపడుతుంటారు.