Tag Archives: health problems

Lunula: మీ చేతివేలి గోర్ల పై ఉన్న గుర్తులను బట్టి మీరు ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఇట్టే గుర్తుపట్టవచ్చు?

Lunula: సాధారణంగా మన చేతి వేలి గోళ్లను బట్టి మన ఆరోగ్యం ఏవిధంగా ఉంటుందో అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన ఆరోగ్యం మొత్తం మన చేతి వేలి గొర్లలోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మన చేతి గోటిపై అర్ధచంద్రాకారపు వలయాలు కనబడుతుంటాయి. వీటి ఆధారంగా మన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అంచనా వేయవచ్చు.

Lunula: మీ చేతివేలి గోర్ల పై ఉన్న గుర్తులను బట్టి మీరు ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఇట్టే గుర్తుపట్టవచ్చు?

సాధారణంగా ఇలా చేతి గోర్ల పై అన్ని వేళ్ళకు అర్ధచంద్రాకారంలో తెల్లని వలయం ఉంటుంది. దీనిని లునులా అంటారు. ఎవరికైతే గోళ్లపై లునులా ఉండదో వాళ్ళు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అర్థం. ఇలాంటివారు పౌష్టికాహార లోపం అదేవిధంగా థైరాయిడ్ గ్రంధి లోపం రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని అర్థం. ఎవరికైతే గోళ్లపై లునులా పెద్దగా ఉంటుందో అలాంటి వారు ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నారని అర్థం.

Lunula: మీ చేతివేలి గోర్ల పై ఉన్న గుర్తులను బట్టి మీరు ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఇట్టే గుర్తుపట్టవచ్చు?

ఇక గోర్ల పై లునులా చిన్నగా ఉండే వారిలో జీర్ణక్రియ సమస్యలు ఉండడమే కాకుండా శరీరంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోయాయని రక్తప్రసరణ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. ఇక కొందరికి ఈ లునులా నీలిరంగులో లేదా పాలిపోయినట్టు కనబడుతుంటాయి. ఇలా ఉండే వారు త్వరలోనే డయాబెటిస్ బారిన పడతారని అర్థం. ఈ విధంగా చేతి గోళ్ళ పై సుమారు 8 వేళ్ళకు లునులా ఉంటే ఆ వ్యక్తి ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని అర్థం.ఎనిమిది కంటే తక్కువగా ఉన్న వారిలో విటమిన్ల లోపం ఉందని వీరు శరీరానికి సరిపడే ఆక్సిజన్ సరఫరా కావడం లేదని అర్థం.

పసుపు రంగులో గోర్లు ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదిం చండి…

ఇలాంటి వారు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకుంటూ సరైన వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.ఇక కొందరిలో గోళ్లు పసుపు రంగులో ఉంటాయి. ఈ విధంగా పసుపు రంగులో ఉన్న వారు ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్టు అర్థం. అయితే ఎక్కువగా నెయిల్ పాలిష్ వేసుకునే వారి గోళ్లు పసుపు రంగులో ఉంటాయి.ఇలా ఎక్కువ రోజులపాటు గోళ్లు పసుపు రంగులోకి కనబడితే వెంటనే వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో అవసరం.

Health Tips: మష్రూమ్స్ ఎక్కువగా తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

Health Tips: సాధారణంగా నాన్ వెజ్ ఇష్టపడనివారు మష్రూమ్స్ తినటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. మష్రూమ్స్ లో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు దాగివున్నాయి. మష్రూమ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి రోగాల బారి నుండి మనల్ని కాపాడతాయి. ప్రస్తుత కాలంలో మష్రూమ్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఏ విధమైన ఆహార పదార్థాలు అయినా మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా అమితంగా తీసుకోవటంవల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Health Tips: మష్రూమ్స్ ఎక్కువగా తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

మష్రూమ్స్ బాగా ఇష్టపడే వారు ఎక్కువ మోతాదులో వాటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం అనేక రకాల పుట్టగొడుగులు లభిస్తున్నాయి. వాటిలో చాలా రకాల పుట్టగొడుగులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అటువంటి వాటిని తినటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీర్ణాశయ సమస్యలతో బాధపడే వారికి మష్రూమ్స్ ఎక్కువగా తినటం వల్ల అజీర్తి కడుపు నొప్పి వాంతులు విరేచనాలు వంటివి వచ్చే ప్రమాదం ఉంది.

Health Tips: మష్రూమ్స్ ఎక్కువగా తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడే వారు మష్రూమ్ తక్కువగా తీసుకోవటం శ్రేయస్కరం.
చాలామంది అలర్జీ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు మష్రూమ్ ఎక్కువగా తినటం వల్ల చర్మం పై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కొంతమందికి మష్రూమ్ తిన్న తర్వాత నీరసంగా అనిపిస్తుంది. అటువంటి వారు మష్రూమ్స్ తీసుకోకపోవడమే మంచిది.

గర్భవతులు దూరంగా ఉండటం మంచిది….


ముఖ్యంగా గర్భవతిగా ఉన్న వారు మష్రూమ్స్ తినకపోవడం శ్రేయస్కరం. ప్రస్తుత కాలంలో మష్రూమ్స్ ని కూడా నాచురల్ పద్ధతిలో కాకుండా అనేక రకాల రసాయనాలను ఉపయోగించి పండిస్తున్నారు. గర్భవతిగా ఉన్న సమయంలో మష్రూమ్ ఎక్కువగా తినటం వల్ల అవి తల్లి బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి.

Coconut water: కొబ్బరి నీటితో ఆరోగ్యమే కాదు.. ఈ సమస్యలు కూడా ఉన్నాయి.

Coconut water: ప్రకృతి అందించిన దివ్యజౌషధం కొబ్బరి. కొబ్బరి చెట్టులోని ప్రతీ భాగం మనిషికి ఏదో ఓ రకంగా ఉపయోగపడేదే. కొబ్బరి నీళ్లు మనిషి ఆరోగ్యానికి జౌషధంగా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లుతాగితే గుండెకు సంబంధించి సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. జీవక్రియ రేటు పెరగడమే కాకుండా… బరువు తగ్గుతారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. 

Coconut water: కొబ్బరి నీటితో ఆరోగ్యమే కాదు.. ఈ సమస్యలు కూడా ఉన్నాయి.

జ్వరం.. లేదా ఎదైనా సమస్యలు వచ్చినా.. పరామర్శించేందుకు వచ్చేవారికి ముందుగా గుర్తుకువచ్చేది కొబ్బరి బొండాలే. అంతగా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని కొబ్బరికి పేరుంది. కొబ్బరి నీళ్లలో ఉంటే ఖనిజాలు.. శరీరానికి శక్తినిస్తాయి. 

Coconut water: కొబ్బరి నీటితో ఆరోగ్యమే కాదు.. ఈ సమస్యలు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే కొబ్బరి నీరును తీసుకునే కొన్ని సందర్భాల్లో ఇవి ఆరోగ్యానికి చేటు చేస్తాయి. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. అలాగే సరైన సమయంలో కాకుండా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొబ్బరి నీటిని తీసుకుంటే… సమస్యలు ఏర్పడుతాయి. 

ఈ సమస్యలు ఉంటే..కొబ్బరి నీరు తీసుకోవద్దు:

జలుబు ఉన్నవారు రాత్రిళ్లు కొబ్బరి నీళ్లు అస్సలు తాగకూడదు. అలాగే కడుపులో సమస్యలు ఉన్నవారు కూడా .. కొబ్బరి నీటికి దూరంగా ఉండాలి. శరీరంలో నీటిని పెంచి విరేచనాలకు కారణం అవుతుంది. కొందరికి ప్రతీసారి జలుబు చేస్తుంది. వీరు చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. కొబ్బరినీరు చల్లగా ఉండటంతో.. మళ్లీ జలుబు పెరిగే అవకాశం ఉంది. అధిక రక్తపోటుకు మందులు వాడే వారు కొబ్బరీ నీరు ఎక్కువగా తాగకూడదు. ఇందులో రక్తపోటును తగ్గించే గుణాలు ఉంటాయి. దీని వల్ల తక్కువ రక్తపోటు సమస్యలు ఎదురవుతాయి.

Panipuri Water: పానీపూరి నీళ్లు ఎక్కువ తాగుతున్నారా… అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Panipuri Water: ఈ మధ్యకాలంలో పానీపూరి ప్రియులు మరింత పెరిగారు. అంతేకాకుండా పానీ పూరి స్టాల్స్ కూడా విరివిగా పెరిగాయి. ఇక పానీపూరి అతిగా తినడం వల్ల అది మన ఆరోగ్యానికి ముప్పు అని కొందరు సూచిస్తుంటే. కొంతమంది నిపుణులు మాత్రం పానీ పూరి నీళ్లు తాగడం వల్ల మన శరీరానికి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు.

Panipuri Water: పానీపూరి నీళ్లు ఎక్కువ తాగుతున్నారా… అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

అవేమిటో మనము ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. పానీ పూరి లో ఎక్కువగా ఉపయోగించే వేడి నీరు రుచిగా ఉండే కారం ఇది మన శరీరానికి ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా శరీర బరువు తగ్గాలనుకునేవారు ఈజీ గా బరువు తగ్గవచ్చు. ఇక డైటీషియన్ లు ఏమని సలహా ఇస్తున్నారా అంటే ఇంట్లో తయారుచేసిన పానీపూరి తినడం శరీరానికి మంచిదని తెలియజేస్తున్నారు.

Panipuri Water: పానీపూరి నీళ్లు ఎక్కువ తాగుతున్నారా… అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

ఎందుకంటే ఇంట్లో తయారుచేసిన పానీ పూరి లో పుదీనా, జీలకర్రను తగిన మొత్తంలో వేసుకుంటారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన నీటిని పానీపూరి లో ఉపయోగిస్తారు. తద్వారా కడుపు ఉబ్బరం, అలసట వంటి సమస్యలను దూరం పెట్టవచ్చు. పుదీనా కలిపిన పానీ పూరి ను తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది అని నిపుణులు వెల్లడిస్తున్నారు.


పుదీనా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది..

ఇందులో కలిగే పుదీనా నీరు శరీర బరువు తగ్గడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది అని తెలియజేస్తున్నారు. ఇక రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా పుదీనా మంచిగా సహాయ పడుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా పానీ పూరిలో ఉపయోగించే జీలకర్ర మన శరీర ఆరోగ్యంలో ఎంతో మేలు చేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Smoking: ధూమపానంతో పెరిగిపోతున్న గుండె జబ్బులు..! అధికారులు ఏమంటున్నారంటే..!

Smoking: దేశంలో గుండెజబ్బులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు వయసు పైబడిన వారికి మాత్రమే గుండె జబ్బులు వస్తాయి అనుకున్నారు… కానీ ఇప్పుడు పాతికేళ్ళలోపు ఉండే యువకులు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. 2015లో భారతదేశంలో దాదాపు 6 కోట్ల 20 లక్షల మందికి గుండె సంబంధ వ్యాధులు ఉన్నాయని గుర్తించారు.

Smoking: ధూమపానంతో పెరిగిపోతున్న గుండె జబ్బులు..! అధికారులు ఏమంటున్నారంటే..!

వారిలో రెండు కోట్ల 30 లక్షల మంది వయసు కేవలం 40 ఏళ్ల లోపు అని సర్వే తేల్చింది. ఈ గణాంకాలను చూస్తే గుండె జబ్బులు పెరుగుతున్నాయి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, ధూమపానం కారణం అవుతున్నాయి.  ఓ సర్వే ప్రకారం ఒక వ్యక్తి ధూమపానానికి ఏడాది పాటు దూరంగా ఉంటే గుండె జబ్బులు వచ్చే తీవ్రత దాదాపు సగానికి పడిపోతుంది.

Smoking: ధూమపానంతో పెరిగిపోతున్న గుండె జబ్బులు..! అధికారులు ఏమంటున్నారంటే..!

ధూమపానం చేసే వారిని.. చేయని వారిలో పోలిస్తే కరొనరి ఆర్టెరీ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ అని అధికారులు చెబుతున్నారు. సిగరెట్ తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 15 శాతం మంది గుండె సంబంధిత మరణాలు సంభవిస్తున్నాయి.

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా..

ఇదొక్కటే కాకుండా బ్రెయిన్ స్ట్రోక్, రక్తం గడ్డ కట్టడం, కాళ్లలో ధమనుల వాపు వంటివి గమనిస్తున్నాం. సిగరెట్ తాగడం వల్ల గుండె కండరాలకు ఆక్సిజన్ను తీసుకెళ్లే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటానికి కారణం అవుతుంది. దీనివల్లనే గుండెపోటు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. గుండెకు రక్షణ ఇవ్వాలంటే మన ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు వ్యసనాలను దూరంగా పెట్టుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల గుండె సంబంధ వ్యాధుల నుంచి పూర్తిగా రక్షణ పొందవచ్చు. సాల్మాన్, టూ నా, మాకెరెల్ చేపలు ఇతర సముద్ర చేపలను తరచుగా తినాలి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి చాలా అవసరం. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. గుండె ధమనుల్లో వాపు రాకుండా చేయాలంటే బాదం, వాల్నట్, కిస్మిస్ జీడిపప్పు ,ఖర్జూరాలు వంటివి రోజు తీసుకోవాలి. గుండెకు మేలు చేసే క్యారెట్లు, చిలగడదుంపలు అధికంగా తీసుకోవాలి. మాంసాహారం అధికంగా తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానేయాలి.

Mint Benefits: పుదీనాతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..? ఆ సమస్యలు అన్నీ మాయం..

Mint Benefits: ప్రస్తుతం ఆహారపు అలవాట్లతో ఎక్కువ ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రజలు ముఖ్యంగా జంక్ ఫుడ్ తినటం ఉబకాయం, గుండె వ్యాధులకు కారణం అవుతుంది. మనం తీసుకున్న సంతులిత ఆహారం తోనే ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Mint Benefits: పుదీనాతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..? ఆ సమస్యలు అన్నీ మాయం..

కానీ బిజీ లైఫ్, టైం దొరకక పోవడం వల్ల ప్రజలు పిజ్జాలు, బర్గర్లు, న్యూడిల్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ కు ఆహారానికి అలవాటు పడుతున్నారు. అయితే మన నిత్య జీవితంలో వాడే ఆకుకూరలు, కూరగాయలు, కరివేపాకు, పుదీనా వంటి వాటి నుంచి కూడా పోషక విలువలు పొందవచ్చు.

Mint Benefits: పుదీనాతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..? ఆ సమస్యలు అన్నీ మాయం..

ముఖ్యంగా పుదీనా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. మన పురాతన కాలం నుంచి పుదీనాను ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు. ఏడాది పొడుగునా పుదీనా విరివిగా లభిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో పుదీనాను కూడా చేర్చుకుంటే పలు పలు విటమిన్లను పొందవచ్చు. పుదీనాలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కానీ క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటివల్ల శరీరానికి శక్తి లభిస్తుంది విటమిన్ ఏ, సీ,డీ, బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మం రక్షణకు ఎంతో తోడ్పడతాయి.

ఆస్తమాను అదుపులో పెట్టడంలో కూడా..

పుదీనాలో ఉండే మాంగనీస్, పొటాషియం, ఐరన్ వంటివి శరీరానికి చాలా అవసరం. వీటివల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగవుతుంది. ఆహారం జీర్ణం కావడం లో కూడా పుదీనా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఆహారం జీర్ణం త్వరగా అవుతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు బాగా మెరుగుపడుతుంది. ఆస్తమాను అదుపులో పెట్టడంలో కూడా సహకరిస్తుంది. తల నొప్పి తగ్గించడానికి పుదీనా రసంతో మసాజ్ చేస్తే నొప్పి తగ్గుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి పుదీనా వాసన చూస్తే చాలని నిపుణులు పేర్కొంటున్నారు. జీవక్రియ మెరుగుపరచడానికి అవసరమయ్యే గుణాలన్నీ పుదీనా లో ఉన్నాయని.. పుదీనా వల్ల బరువు కూడా తగ్గవచ్చనే అభిప్రాయాలున్నాయి. పుదీనాలో ఉండే సహజ ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి.. ఫలితంగా సహజసిద్ధంగా బరువును తగ్గించుకోవటానికి ఉపయోగపడుతాయని పరిశోధనలు తెలుపుతున్నాయి

Mother – Son: ఆస్తి కోసం కన్న తల్లిని కడతేర్చిన కొడుకు…భార్యను పుట్టింటికి పంపించి ఇలా!

Mother – Son: నవమాసాలు మోసి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన పిల్లలకు తల్లిదండ్రుల చివరి రోజులలో ఆసరాగా ఉండి వారికి జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులకు రుణ పడాల్సింది పోయి..ఆస్తి కోసం డబ్బు కోసం కన్న తల్లిదండ్రులని నిర్దాక్షిణ్యంగా చంపుతున్న ఘటనలు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటన సంగారెడ్డిలో వెలుగులోకి వచ్చింది.

Mother – Son: ఆస్తి కోసం కన్న తల్లిని కడతేర్చిన కొడుకు…భార్యను పుట్టింటికి పంపించి ఇలా!

పోలీసులు తెలిపిన వివరాల మేరకు…సంగారెడ్డి జిల్లాలోని వట్‌పల్లి మండలం పోతులబోగుడా గ్రామంలో నివాసముండే మొండి మల్లమ్మ పేరు పై నాలుగు ఎకరాల పొలం ఉంది. ఈ క్రమంలోనే ఆమె కొడుకు మురళి నిత్యం తాగి వచ్చి తనకు ఆస్తి రాసివ్వాలని తన తల్లితో గొడవ పడేవాడు..

Mother – Son: ఆస్తి కోసం కన్న తల్లిని కడతేర్చిన కొడుకు…భార్యను పుట్టింటికి పంపించి ఇలా!

ఈ క్రమంలోనే తన తల్లి దగ్గర ఉన్న ఆస్తి తన సొంతం చేసుకోవాలంటే తన తల్లిని చంపడమే మార్గమని భావించిన మురళి తన భార్యను పుట్టింటికి పంపించి బుధవారం మధ్యాహ్నం బాగా తాగి వచ్చి ఎవరూ లేని సమయంలో తన తల్లి గొంతు నులిమి చంపేశాడు. అయితే తనకు ఏమీ తెలియనట్టు తన తల్లి మృతి చెందిందని చుట్టుపక్కల వారికి చెప్పాడు.

బయటపడిన అసలు విషయం..

ఈ విధంగా తల్లి అనారోగ్యంతో మృతి చెందిందనే విషయాన్ని అందరికీ చెప్పడంతో స్థానికులు అతన్ని తీరుపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే పోలీసులకు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అసలు విషయం బయటపడింది. దీంతో మల్లమ్మ అల్లుడు జనార్ధన్ ఫిర్యాదు మేరకు తన కొడుకు మురళి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

తరచూ తుమ్ములతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!

సాధారణంగా వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు లేదా ఏదైనా దుమ్ము ధూళి కారణంగా తుమ్ములు రావడం సర్వసాధారణం. ఇక ముఖ్యంగా వర్షాకాలం చలికాలంలో ఈ సమస్య చాలా మందిని వెంటాడుతుంది. ఇలా తరచూ తుమ్మల సమస్యతో బాధపడేవారు ఈ చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

మన శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనపడినప్పుడు తుమ్ములు వస్తాయి అదేవిధంగా మన ముక్కులో శ్లేష్మ పొర ఉంటుంది దీనిలో ఉన్నటువంటి కణజాలాలు కణాలు బయట ఏదైనా వాసన వీటిని ఉత్తేజపరిస్తే అప్పుడు తుమ్ములు రావడం అనేది జరుగుతుంది. అయితే తరచూ వచ్చే తుమ్ముల నుంచి బయట పడాలంటే ఈ ఇంటి నివారణ చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి.

దీనిలో ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయి. కనుక తరచు తేనెని తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా అధిక తుమ్మల సమస్యతో బాధపడేవారు ఆవిరి పట్టడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఆవిరి పట్టడం వల్ల మన శరీరానికి చలి ప్రభావాన్ని తగ్గించి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడానికి మార్గాన్ని సులభతరం చేస్తుంది.

విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది మన శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉన్నప్పుడు తుమ్ములు రాకుండా ఉంటాయి. పాలలో చిటికెడు పసుపు కలుపుకొని రోజు తాగాలి ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అలర్జీ సమస్యలు నుంచి విముక్తి కల్పించి తుమ్ములు రాకుండా కాపాడుతుంది.

ప్రయాణ సమయంలో వాంతులు ఎక్కువగా అవుతున్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!

కొంతమందికి ప్రయాణాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే.. కొంచెం దూరం ప్రయాణం చేసినా వాళ్లు వాంతులు చేసుకుంటారు. అలా అని అన్ని వాహనాలపై ప్రయాణానికి ఉంటుందని కాదు.. కొంతమందికి బస్సు పడదు, మరికొంతమందికి ఆటో.. మరికొంతమందికి బైక్ ఇలా చాలా వరకు ఉంటాయి.

ఇంకా కొంతమందికి రైలు ప్రయాణం అంటే కూడా భయపడుతుంటారు. దీనికి మెయిన్ కారణం వాంతులు అవుతాయనే కారణం. అందుకే ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు ప్రయాణం చేయాలంటే వెనకడుగు వేసే పరిస్థితి ఉంటుంది. ఈ సమస్యతో బాధపడే వారు ఏం చేయాలి.. ఏం తీసుకుంటే బాగుంటుంది అనేవి ఇక్కడ తెలుసుకుందాం.

ఇక్కడ చెప్పే కొన్ని చిన్న చిట్కాలు వాడితే ఆ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందొచ్చు. ఏ వాహనంలో ఎక్కినా వాంతు సమస్య ఉన్న వ్యక్తి ముందు సీట్లో కూర్చొవడానికి ట్రై చేయాలి. దీంతో ఆ ఆలోచన నుంచి బయటపడి.. బయట వైపు చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఇక మన పక్కన కూర్చున్న వ్యక్తితో మాట్లాడటం వల్ల కూడా ఈ సమస్య ఉన్నవారు తప్పించుకోవచ్చు.

పుస్తకాలు చదవడం.. మొబైల్ ఫోన్ చూడటం వంటివి చేస్తుండాలి. ఇలా వర్కౌట్ కాకపోతే ప్రయాణ సమయంలో అల్లం తీసుకుంటే వాంతి అనేది రాదు. కొంతమందికి నిమ్మకాయ వాసన చూసినా వాంతులు అనేవి రావు. ఏదేమైనా ప్రయాణ సందర్భంలో మనకు వాంతు వస్తుందన్న భావన, ఆలోచన అనేది తీసుకురాకుండా ఉండాలి. ఇలా చేస్తే పైన చెప్పినవి కూడా పాటించాల్సిన అవసరం లేదు.

ఉదయాన్ని కాఫీ, టీ తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..!

ఎవరికైనా ఆరోగ్యం మంచిగా ఉంటే.. ఎంత పని అయినా చేస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారు. ఆరోగ్యం ఉంటే.. కొన్ని కోట్లు ఆస్తి మన దగ్గర ఉన్నట్లే. ఇటీవల కరోనా కారణంగా ఎంతమంది తమ ప్రాణాలను విడిచారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో ఎంతో మంది ఉన్నతులు కూడా ఉన్నారు.

వాళ్లను ఆ డబ్బులు బతికించలేకపోయాయి. కొంతమంది ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ప్రాణాలు మాత్రం తిరిగి రాలేదు. అలా అతలాకుతలం చేసింది మాయదారి కరోనా మహమ్మారి. అందుకే ఆరోగ్యం బాగా చూసుకుంటే.. ఎంతటి దానిని అయినా సాధించవచ్చు అనేది అదొక్కటే ఉదాహరణ. కరోనా కారణంగా కొంతమంది తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారనేది వాస్తవమే అయినా.. చిన్న చిన్న తప్పుల కారణంగా.. అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి.

అవేంటంటే.. రోజూ వారి దిన చర్యలో భాగంగా ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ప్రతీ ఒక్కరికీ అలవాటు. ఇక్కడే కొంతమంది తప్పు చేస్తున్నారు. తీసుకునే ఆ ఆహారం విషయంలో పొరపాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం కాఫీ, టీ తాగేవారు ఖాళీ కడుపుతో తీసుకోవడంతో.. ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

వాటివలన చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని వీలైనంత వరకు ఉదయాన్నే కాఫీకి దూరంగా ఉండడం మంచిదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఎసిడిటీ ఎక్కువగా ఫామ్ అవుతుందని.. ఇది పేగులపై ప్రభావం చూపుతుందని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందు ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాతనే కాఫీ, టీలాంటికి ఒక కప్పుతాగాలని చెబుతున్నారు. లేదంటే పరిగడుపున మంచి నీళ్లు తాగి.. కాస్త సమయం తీసుకొని తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.