Mother - Son: ఆస్తి కోసం కన్న తల్లిని కడతేర్చిన కొడుకు…భార్యను పుట్టింటికి పంపించి ఇలా!
Mother – Son: నవమాసాలు మోసి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన పిల్లలకు తల్లిదండ్రుల చివరి రోజులలో ఆసరాగా ఉండి వారికి జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులకు రుణ పడాల్సింది పోయి..ఆస్తి కోసం డబ్బు కోసం కన్న తల్లిదండ్రులని నిర్దాక్షిణ్యంగా చంపుతున్న ఘటనలు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటన సంగారెడ్డిలో వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు…సంగారెడ్డి జిల్లాలోని వట్‌పల్లి మండలం పోతులబోగుడా గ్రామంలో నివాసముండే మొండి మల్లమ్మ పేరు పై నాలుగు ఎకరాల పొలం ఉంది. ఈ క్రమంలోనే ఆమె కొడుకు మురళి నిత్యం తాగి వచ్చి తనకు ఆస్తి రాసివ్వాలని తన తల్లితో గొడవ పడేవాడు..
ఈ క్రమంలోనే తన తల్లి దగ్గర ఉన్న ఆస్తి తన సొంతం చేసుకోవాలంటే తన తల్లిని చంపడమే మార్గమని భావించిన మురళి తన భార్యను పుట్టింటికి పంపించి బుధవారం మధ్యాహ్నం బాగా తాగి వచ్చి ఎవరూ లేని సమయంలో తన తల్లి గొంతు నులిమి చంపేశాడు. అయితే తనకు ఏమీ తెలియనట్టు తన తల్లి మృతి చెందిందని చుట్టుపక్కల వారికి చెప్పాడు.
ఈ విధంగా తల్లి అనారోగ్యంతో మృతి చెందిందనే విషయాన్ని అందరికీ చెప్పడంతో స్థానికులు అతన్ని తీరుపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే పోలీసులకు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అసలు విషయం బయటపడింది. దీంతో మల్లమ్మ అల్లుడు జనార్ధన్ ఫిర్యాదు మేరకు తన కొడుకు మురళి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…