Tag Archives: health

వాటర్ బాటిల్లో నీరు తాగుతున్నారా.. అయితే ప్రమాదం పొంచి ఉన్నట్లే..?

చాలామంది పంపు నీరు, ట్యాప్ వాటర్ తాగితే రోగాలు వస్తాయని అందరు భావిస్తుంటారు. అయితే బాటిల్ వాటర్ కే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తుంటారు. ప్రజల్లో ఈ అభిప్రాయం ఉండటం వల్లే వాటర్ బాటిళ్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వాటి కారణంగా పర్యావరణంపై 3,500 రెట్లు ఎక్కువగా ప్రభావం పడుతుందని బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది.

దీనికి సంబంధించి సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్‌లో ప్రచురితమయింది. ఎక్కువగా పంపు నీటిలో క్రిమిసంహారక మందులు వాడటంతో నీటిలోని ట్రై హలో మీథేన్ ఉత్పన్నమవుతుంది. దీని వల్ల మూత్రశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అయితే బార్సిలోనాలోని నీటి పంపులో తక్కువగా క్రిమిసంహారక మందులు తక్కువగా వాడటం వల్లే ముప్పు తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది.

బాటిల్ వాటర్ తో పోలిస్తే పంప్ వాటరే మంచిదని పరిశోధకుడు క్రిస్టినా విల్లానుయేవా చెప్పారు. పంపు నీటిని వాడటం వల్ల వాటర్ బాటిల్ తో పర్యావరణానికి హాని కలకుండా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. దీంతో ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అధ్యయనం సూచించింది.

ఇక్కడ వెల్లడించిన అధ్యయన ఫలితాల్లో బాటిల్ వాటర్ కంటే ట్యాప్ వాటరే చాలా మంచిదని తమ ఫలితాలు చూపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ఫిల్టర్ చేసిన నీరు కూడా ఇతర నీటితో పోలిస్తే చాలా ఆరోగ్యకరమని అక్కడి శాస్త్రవేత్తలు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు పాటపడాలని సూచించారు.

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ లడ్డు తినండి!

ప్రస్తుత జీవన శైలిలో ఆహారపు అలవాట్ల విషయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. శారీరక శ్రమ విషయంలో ఎలాంటి వ్యాయామం చేయకపోవడంతో బరువు పెరిగిపోతున్నారు. దీంతో వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. ఆ తర్వాత బరువు తగ్గడానికి వివిధ రకాలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కొందరు బరువు తగ్గడం లేదు. బరువు తగ్గాలని అనుకునే వారు ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలతో సహా ఇతర పోషకాలు అధికంగా ఉండే వాటిని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

బరువును అతి వేగంగా తగ్గాలనుకునే వారికి పలు రకాల గింజలను ఆహారంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా చియా, గుమ్మడికాయ, అవిసె గింజలు, పుచ్చకాయ మొదలగునవి ఉన్నాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటంతో బరువు నియంత్రణలో ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ గింజలతో కొద్దిగా బెల్లంను లడ్డూల్లాగా తయారు చేసుకొని తినాలి. దీంతో ఆకలి వేయకుండా ఉండటంతో శరీరంలో ఎక్కువ కొవ్వు చేరకుండా ఉంటుంది.

అయితే ఈ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలంటే.. అవిసె గింజలు, పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు, చియా గింజలు గింజలను కప్పు చొప్పున తీసుకోవాలి.. అతేకాకుండా నెయ్యిని ఆఫ్ కప్పు, రెండు కప్పుల ఓట్స్, కప్పు బెల్లం మరియు ఎండిన పండ్లను తీసుకోవాలి. ముందుగా గింజలను ఓ గిన్నెలో తీసుకొని వేడి చేయాలి. గింజలను చల్లార్చి వాటితో పాటు వేడి చేసిన నెయ్యిని కలపాలి.

తర్వాత ఓట్స్ బాగా వేయించిన అనంతరం దానిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష, బెల్లం పొడి జోడించాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని కదిలిస్తూ.. బెల్లం పాకం బాగా కలిసే వరకు చూడాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని చల్లార్చాలి. దీనిలో చల్లార్చిన విత్తనాలను ఇందులో వేసి చేతులకు నెయ్యి పూసుకొని లడ్డూలను తయారు చేయాలి. ఈ లడ్డూలను ఉదయం, సాయంత్రం రెండు చొప్పున తీసుకుంటే కొద్ది రోజుల్లోనే లావు తగ్గే అవకాశం ఉంటుంది.

‘ఇలాచీ టీ’ తాగుతున్నారా.. దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..?

టీ లల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ఆరోగ్యానికి ఉపయోగపడేవి. మరికొన్ని ఆరోగ్యానికి హాని చేసేంది. ఉపశమనం కోసమో లేదా టైం పాస్ కోసంమో టీ ని చాలా మంది తాగుతారు. సాధారణ టీ ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ యాలకలు లేదా ఏలకలు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. యాలకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పాయసం చేయాలన్నా, వెరైటీ వంటలు చేయాలన్నా, పులావ్, బిర్యానీలు వండాలన్నా,ముఖ్యంగా స్వీట్స్ చేయాలాన్నా యాలకలను తప్పనిసరిగా వాడుతారు. ఎందుకంటే యాలకల్లో అద్భుతమైన ఆరోమా వాసన కలిగి ఉంటుంది. ఈ ఆరోమా వాసన వల్లే యాలకలను మసాలా దినుసులన్నింటిలోకి దీన్ని ‘క్వీన్ ఆఫ్ స్పైసెస్ ‘ అని పిలుస్తుంటారు. అద్భుతమైన రుచి, మరియు స్వీట్ ఫ్లేవర్ ను కలిగి ఉండే ఈ యాలకలు మీ వంటలకు అద్భుతమైన రుచి, వాసను అందిస్తాయి.

దీంతో తయారు చేసే టీ మాత్రం.. ఇండియాలో చాలా ఫేమస్. దీన్ని వాడుక భాషలో మనం ‘ఇలాచీ చాయ్’ అంటాం. దీనిలో కొద్దిగా పాలు, పంచదార కలిపి సర్వ్ చేయడం వల్ల చాలా అద్భుతంగా డిఫరెంట్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది. యాలకల్లో ఉండే ఆరోమా వాసనకు అద్భుతమైన రుచి తోడవ్వటం వల్లే ప్రపంచంలో మిలియన్ల మంది ఇలాచీ చాయ్ కి దాసోహం అవుతున్నారు. మానసిక ఒత్తిడికి గురైన వారు యాలకల “టీ” తాగితే ప్రశాంతతను పొందుతారు. టీ పొడి తక్కువగానూ, యాలక్కాయలు ఎక్కువగానూ కలిపి టీ తయారు చేస్తున్నపుడు వెలువడే సువాసనను పీల్చడం ద్వారా వల్ల, ఆ టీ తాగడం వల్ల కలిగే నూతనోత్సాహం వల్ల మానసిక ఒత్తిడి త్వరగా నయమైపోతుందట.

తలనొప్పి, వాంతులు మొదలైన సమస్యలు ఉన్నవారికి యాలకుల నోట్లో వేసుకొని నమలడంలోనే నివారణ అభిస్తుంది. భోజనం చేసిన తర్వాత యాలకలతో తయారుచేసిన టీ తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. భోజనం చేసిన వెంటనే ఒక కప్పు యాలకల టీ తాగడం వల్ల బ్యాడ్ బ్రీత్ తగ్గుతుంది, గొంతు తడి ఆరిపోవడం వంటి సమస్యలుండవు. దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లే, ఒక కప్పు ఇలాచీ ఛాయ్ తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం కలుగుతుంది. ఇంకా ఈ టీ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

రోజుకు మూడు గుడ్లు తినండి.. ఆ సమస్య నుంచి విముక్తి పొందండి!

గుడ్డు మనఆరోగ్యానికి మంచిది అనే సంగతి మనందరికీ తెలిసిందే.రోజు ఒక గుడ్డు తింటే ఎటువంటి అనారోగ్యాలు రావని ఇన్నిరోజులు భావించాము.కానీ రోజుకు మూడు గుడ్లు తినడం వల్ల సరైన ఆరోగ్యం మీదేనని తాజాగా నిపుణులు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రతి రోజుకు మూడు గుడ్లు తినడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఎన్నో రకాల జబ్బుల నుంచి మనం విముక్తి పొందవచ్చని తాజాగా నిపుణులు వెల్లడించారు.

గుడ్డులో అధిక మొత్తంలో పోషకాలు ఉండటం చేత గుడ్డు తింటే పిల్లలలో శరీర పెరుగుదలకు దోహదపడుతుంది, అదే విధంగా పిల్లలలోనూ, పెద్ద వారిలోనూ రోగనిరోధకశక్తిని పెంచడానికి కూడా గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయి.అయితే గుడ్డులో ఉన్నటువంటి పోషకాలు సరైన మోతాదులో మన శరీరానికి అందాలంటే వీలయినంతవరకు ఉడకబెట్టిన గుడ్లును కూర చేయడం లేదా ఉడకబెట్టిన వాటిని తినడం వల్ల ఈ పోషకాలు అందుతాయి.

రోజుకు మూడుగుడ్లు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ శక్తితో క్యాలరీలను అందించడమే కాకుండా, కంటిలోని శుక్లాలు వచ్చే అవకాశం పూర్తిగా తగ్గిపోతుందని,గుండెకు రక్తం సరఫరా సరైన స్థాయిలో చేరటం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు కూడా తగ్గిపోతాయని డాక్టర్లు తెలియజేస్తున్నారు.

ప్రతి రోజు మూడు గుడ్లకు మించి తినడం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయి. ఈ క్రమంలోనే ఉడకబెట్టిన గుడ్లను ప్రతి రోజు 3 తినడం ద్వారా మన శరీరానికి బలం అందించడమే కాకుండా వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తిని కూడా అందిస్తాయి.ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితులలో గుడ్లు తినడం ఎంతో ఉత్తమమని నిపుణులు తెలుపుతున్నారు.

ఈ ఆయుర్వేద చికిత్సలతో.. వర్షాకాల వ్యాధులకు చెక్ పెట్టండిలా!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండవ దశ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ మూడవ దశ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వర్షాకాలం మొదలవడంతో ఎన్నో రకాల వ్యాధులు మనల్ని వెంటాడుతాయి. అయితే ఈ విధమైనటువంటి వ్యాధుల్ని ఎదుర్కోవడం కోసం ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి వ్యాధులను ఎదుర్కోవడానికి ఆయుర్వేద చికిత్స ఒకటని చెప్పవచ్చు.ఈ వర్షాకాలంలో మన శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనపడటం ఎన్నో రకాల అంటు వ్యాధులకు కారణమవుతుంది. కనుక ఈ ఆయుర్వేద చికిత్స విధానాన్ని అనుసరించి ఈ విధమైనటువంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

సాధారణంగా మనం ఇంట్లో అప్పుడప్పుడు తైలమర్దన చేస్తుంటాము. ఈ విధంగా మర్దనా చేయటం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ పెరుగుదల, శరీరంలో మలినాలు విసర్జితమవుతాయి. ఈ క్రమంలోనే మన శరీరంలోని కణాలకు శక్తి ఉత్తేజితం అవుతుంది తద్వారా మనకు ఎంతో సుఖనిద్ర పడుతుంది. ఈ విధంగా మనం శరీరమంతటా మర్దనా చేయటం కోసం ఏదైనా నూనెలను లేదా సున్నిపిండితో మర్థన చేయడాన్ని ఆయుర్వేద భాషలో అభ్యంగన స్నానం అని పిలుస్తారు.

ఎవరైతే అధిక బరువు,ఒంట్లో నీరు నిల్వ ఉండిపోవడం, నిస్తేజం, రక్తప్రసరణ లోపం ఉంటుందో అలాంటివారు
ఉద్ఘర్షణ చికిత్స చేయించుకోవడం వల్ల దీర్ఘకాలంలో శరీరంలోని పేరుకుపోయిన కలుషితాలన్నీ విరిగి రక్తప్రవాహంలో కలుస్తాయి. దీని ఫలితంగా కొవ్వు కరగడంతో పాటు శరీర బరువు తగ్గుతారు.

అదేవిధంగా తల అధిక బరువు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారికి శిరోధార చికిత్స అందిస్తారు. వివిధ రకాల తైలాలతో తలకు జుట్టు బాగా మర్దన చేయడం వల్ల తల భారం తగ్గి,మెదడులో సెరటోనిన్‌, డోపమైన్‌ హార్మోన్లు సక్రమంగా స్రవించడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

ఈ ఆకుకూర తినడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..?

సాధారణంగా మనం తీసుకొనే ఆహారంలో ఏదో ఒక రకమైన పోషకాలు మన శరీరానికి అందుతాయి. అందులో ముఖ్యంగా తాజా కూరగాయలు,, ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన శరీరానికి సరిపడా పోషకాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ప్రకృతి ప్రసాదించిన ఆకులలో గోంగూర ఒకటని చెప్పవచ్చు. ఈ ఆకులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పుల్లటి రుచి కలిగిన ఈ ఆకును తినడానికి ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఈ ఆకును పచ్చడి రూపంలో నిల్వ చేసుకుని తీసుకుంటారు. అయితే ఈ గోంగూరను తినటం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. గోంగూర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

గోంగూరలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం ఐరన్, ఫైబర్, క్యాల్షియం, విటమిన్స్ మెండుగా లభిస్తాయి.ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో రక్తం వృద్ధి చెందడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా అధికరక్తపోటు సమస్య నుంచి కాపాడి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.మధుమేహ సమస్యతో బాధపడేవారు తరచూ గోంగూర తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో గోంగూర కీలకపాత్ర పోషిస్తుంది.

గోంగూరలో ఐరన్ క్యాల్షియం సమృద్ధిగా లభించటం వల్ల ఎముకలు పటుత్వాన్ని కోల్పోకుండా దృఢంగా తయారవుతాయి. గోంగూరలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల మన శరీరానికి సరిపడనంత రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అదేవిధంగా విటమిన్ ఏ వల్ల కంటి సమస్యలు దూరం అవడంతో పాటు రేచీకటిని కూడా నియంత్రిస్తుంది.గోంగూర అధిక శాతం ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి జీర్ణక్రియ సమస్యలను దూరం చేయడమే కాకుండా, మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది. మహిళలకు నెలసరి సక్రమంగా రావడానికి కూడా గోంగూర ప్రముఖ పాత్ర పోషిస్తుంది.నిద్రలేమి సమస్యతో బాధపడేవారు తరచూ ఆకుకూరలను తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఇన్ని ప్రయోజనాలు కలిగిన గోంగూరను తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

వేగంగా ఆహారం తింటున్నారా.. ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాల్సిందే..!

సాధారణంగా కొంత మంది భోజనం చేసేటప్పుడు చాలా నెమ్మదిగా తింటూ ఉంటారు. మరి కొందరు మాత్రం ఎంతో హడావిడిగా చాలా వేగంగా భోజనం చేయడం మనం చూస్తూనే ఉంటాము. పని ఒత్తిడి, సమయాభావం వల్ల ఇలా వేగంగా భోజనం చేస్తున్నామని చెబుతుంటారు. అయితే ఈ విధంగా వేగంగా ఆహారం తినడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. వేగంగా ఆహారం తినడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

వేగంగా ఆహారం తినటం వల్ల మనం తీసుకునే ఆహారంలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందవు. అంతేకాకుండా తొందరగా భోజనం చేసేవారు వారి శరీర బరువు పెరుగుతారని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మనం తీసుకున్న ఆహారం నమలకుండా మింగటం వల్ల ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తడంతో పాటు మలబద్దక సమస్య కూడా ఏర్పడుతుంది. తొందరగా భోజనం చేసేవారిలో షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. దీంతో మధుమేహ సమస్య తలెత్తుతుంది.

సాధారణంగా భోజనం చేయడం కంటే వేగంగా భోజనం చేసేవారు అధిక మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటారని నిపుణులు తెలియజేస్తున్నారు.ఈ విధంగా అధిక మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల శరీర బరువు పెరగడంతో పాటు ఊబకాయ సమస్యలు కూడా తలెత్తుతాయి. అదేవిధంగా నెమ్మదిగా ఆహారాన్ని నమిలి మింగటం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తకుండా, ఆహారంలో ఉన్న పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా చిన్న పిల్లలు తొందరగా భోజనం చేసే అలవాటు ఉంటే వారికి తల్లిదండ్రులు తగినన్ని జాగ్రత్తలు అని చెబుతూ అన్నం నమిలి తినే విధంగా సూచనలు ఇవ్వాలి. ఆహారం నమిలి మింగడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, శరీర బరువును కూడా నియంత్రించుకోవచ్చు.

క్యాన్సర్ కణాలను నివారించాలంటే.. క్యాబేజీ తినాల్సిందే..!

సాధారణంగా చాలా మంది క్యాబేజి తినడానికి ఇష్టపడరు. కానీ క్యాబేజీ నుంచి తయారు చేసిన గోబీ వంటి ఫాస్ట్ ఫుడ్డును తినడానికి ఎంతో మక్కువ చూపుతుంటారు. ఈ క్యాబేజీని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.క్యాబేజీలో లభించే అనేక పోషకాలు మన శరీరానికి అందడం వల్ల ఎన్నో రకాల వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుందని చెప్పవచ్చు. అయితే క్యాబేజీ తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

క్యాబేజీ లో అధిక శాతం ఫైబర్, విటమిన్లు, ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. క్యాబేజీని తయారు చేసుకునేటప్పుడు ఎక్కువగా ఉడికించకూడదు. ఆ విధంగా ఉడికించడం వల్ల అందులో ఉన్నటువంటి పోషకాలన్నింటిని కోల్పోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.అదేవిధంగా విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి కావలసినంత రోగ నిరోధక శక్తిని అందించడంలో క్యాబేజీ ప్రముఖ పాత్ర వహిస్తుంది.

ఇందులో ఉన్నటువంటి యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను నిరోధించడానికి దోహదపడతాయి. క్యాబేజీలో ఉన్నటువంటి బీటాకెరోటిన్ కంటిశుక్లం నివారించి కంటిచూపును మెరుగుపరుస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక కప్పు క్యాబేజీ ఉడికించిన రసం తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడానికి సహకరిస్తుంది. ఇందులో ఉన్నటువంటి క్యాల్షియం ఎముకల పటుత్వానికి, దంతాలు దృఢంగా ఉండటానికి ఉపయోగపడతాయి. ప్రకాశవంతంగా, కాంతివంతమైన చర్మం పొందాలనుకుంటే ఒక అరగంట పాటు క్యాబేజీని నానబెట్టిన నీటితో మొహం కడుక్కోవడం వల్ల కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బలపాలు, చాక్‌పీస్‌లు తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలివే..?

పిల్లల్లో చాలామంది బలపాలు, చాక్ పీస్ లు తింటూ ఉంటారు. తల్లిదండ్రులు వాటిని తినకూడదని సూచించినా కొందరు పిల్లలు వాటిని తింటూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. పిల్లలతో పాటు గర్భవతులైన మహిళలు, కొందరు పురుషులు కూడా బలపాలు, చాక్ పీస్ లను తింటూ ఉంటారు. అయితే రెండేళ్ల లోపు పిల్లలు బలపాలు, చాక్ పీస్ లు తింటే వారికి అవగాహన ఉండదు కాబట్టి ఆ సమస్యను తీవ్రంగా పరిగణించకూడదు.

అలా కాకుండా వయస్సు పెరుగుతున్నా వాటిని తింటూ ఉంటే మాత్రం పీకా అనే ఒక సమస్య ఉన్నట్టు భావించాలి. ఈ సమస్య బారిన పడి ఉంటే వీలైనంత త్వరగా చికిత్స తీసుకుంటే మంచిది. ఎక్కువగా బలపాలు, చాక్ పీస్ లు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయి. బలపాలు, చాక్ పీస్ లను చూడగానే నోరూరుతుందంటే ఈటింగ్ డిసార్డర్ గా పరిగణించాలి. శరీరంలో తగినంత జింక్ లేని వారిని ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది.

బలపాలు, చాక్ పీస్ లు విష పదార్థాలు కాకపోయినా ఎక్కువగా తినడం వల్ల నష్టాలు ఉంటాయి. వీటిని ఎక్కువగా తినేవారిలో దంతాలు పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో జీర్ణ సంబంధిత సమస్యలు ఉండటంతో పాటు మలబద్ధకం సమస్య కూడా వేధించే అవకాశం ఉంటుంది. కడుపులో నులిపురుగులు పెరగడం, ఆకలి తగ్గిపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా బలపాలు, చాక్ పీస్ లు తినేవాళ్లను వేధిస్తాయి.

బలపాలు, చాక్ పీస్ లు, మట్టి తినేవారికి బ్లడ్ టెస్ట్, మోషన్ టెస్ట్ చేసి ఫలితాల ఆధారంగా చికిత్స అందిస్తారు. కొన్నిసార్లు మందులతో పాటు వైద్యులు థెరపీ కూడా చేస్తారు. తినకూడని పదార్థాలు తినాలని అనిపిస్తే అది కూడా ఆరోగ్య సమస్యగానే భావించాలి.

స్పూన్ ద్వారా అనారోగ్య సమస్యలను గుర్తించవచ్చు.. ఎలానో తెలుసా..?

సాధారణంగా మనం ఇంట్లో ఉండే స్పూన్ లను తినడానికి మాత్రమే ఉపయోగిస్తాం. అయితే ఆ స్పూన్ సహాయంతో ఎన్నో అనారోగ్య సమస్యలను సులభంగా గుర్తించవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఒక స్పూన్ టెస్ట్ క్షణాల్లో మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామో లేక అనారోగ్యంతో ఉన్నామో తెలిసేలా చేస్తుంది. అయితే స్పూన్ టెస్ట్ ద్వారా సరైన ఫలితాలు పొందాలంటే ఏమీ తినకుండా ఉదయం సమయంలో మాత్రమే ఈ టెస్ట్ చేసుకోవాలి.

మన శరీరం అనారోగ్యానికి సంబంధించి ఏదో ఒకలా సంకేతాలను ఇస్తూ ఉంటుంది. ఆ సంకేతాలను మనం సరైన సమయంలో గుర్తించలేకపోతే మాత్రం చిన్న ఆరోగ్య సమస్య పెద్ద ఆరోగ్య సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సెకన్ల సమయంలో సులభంగా చేసుకునే ఈ స్పూన్ టెస్ట్ చేసుకోవాలంటే మంచి నీళ్లు కూడా తాగకూడదు. ఉదయం నిద్రలేచిన తరువాత స్పూన్ తో నాలుకపై రుద్దితే స్పూన్ కు లాలాజలం అంటుకుంటుంది.

ఆ స్పూన్ ను ప్లాస్టిక్ కవర్ లో ఉంచి 60 సెకన్ల పాటు ఎండలో ఉంచాలి. ఆ తరువాత ఆ స్పూన్ ను పరిశీలిస్తే స్పూన్ లో ఎటువంటి మచ్చలు కనిపించకపోతే శరీరంలోని అవయవాలు అన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లే. అలా కాకుండా మచ్చలు కనిపిస్తే శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఆ తరువాత స్పూన్ పై ఉన్న లాలాజలం వాసనను పరిశీలించాలి.

ఆ వాసన భరించలేని విధంగా ఉంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ కు సూచనగా భావించాలి. ఆ స్పూన్ పై నారింజ రంగులో మచ్చలు ఉంటే కిడ్నీ వ్యాధి, పసుపు మచ్చలు అయితే థైరాయిడ్ సమస్యలు, ఊదా రంగు మచ్చలు ఉంటే సాధారణంగా ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువ మొత్తం కొవ్వు పరిమాణం ఉందని భావించాలి. తెల్ల మచ్చలు ఉంటే వైరస్, అంటు వ్యాధుల వల్ల ఆరోగ్య సమస్యలు, పండ్ల వాసన వస్తే డయాబెటిస్, అమ్మోనియా వాసన ఇస్తే కిడ్నీల్లో లోపానికి సంకేతంగా గుర్తించాలి. ఈ విధంగా స్పూన్ టెస్ట్ చేయడం ద్వారా మన ఆరోగ్య సమస్యలను మనం సులభంగా తెలుసుకోవచ్చు.