ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండవ దశ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ మూడవ దశ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వర్షాకాలం మొదలవడంతో ఎన్నో రకాల వ్యాధులు మనల్ని వెంటాడుతాయి. అయితే ఈ విధమైనటువంటి వ్యాధుల్ని ఎదుర్కోవడం కోసం ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి వ్యాధులను ఎదుర్కోవడానికి ఆయుర్వేద చికిత్స ఒకటని చెప్పవచ్చు.ఈ వర్షాకాలంలో మన శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనపడటం ఎన్నో రకాల అంటు వ్యాధులకు కారణమవుతుంది. కనుక ఈ ఆయుర్వేద చికిత్స విధానాన్ని అనుసరించి ఈ విధమైనటువంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.
సాధారణంగా మనం ఇంట్లో అప్పుడప్పుడు తైలమర్దన చేస్తుంటాము. ఈ విధంగా మర్దనా చేయటం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ పెరుగుదల, శరీరంలో మలినాలు విసర్జితమవుతాయి. ఈ క్రమంలోనే మన శరీరంలోని కణాలకు శక్తి ఉత్తేజితం అవుతుంది తద్వారా మనకు ఎంతో సుఖనిద్ర పడుతుంది. ఈ విధంగా మనం శరీరమంతటా మర్దనా చేయటం కోసం ఏదైనా నూనెలను లేదా సున్నిపిండితో మర్థన చేయడాన్ని ఆయుర్వేద భాషలో అభ్యంగన స్నానం అని పిలుస్తారు.
ఎవరైతే అధిక బరువు,ఒంట్లో నీరు నిల్వ ఉండిపోవడం, నిస్తేజం, రక్తప్రసరణ లోపం ఉంటుందో అలాంటివారు
ఉద్ఘర్షణ చికిత్స చేయించుకోవడం వల్ల దీర్ఘకాలంలో శరీరంలోని పేరుకుపోయిన కలుషితాలన్నీ విరిగి రక్తప్రవాహంలో కలుస్తాయి. దీని ఫలితంగా కొవ్వు కరగడంతో పాటు శరీర బరువు తగ్గుతారు.
అదేవిధంగా తల అధిక బరువు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారికి శిరోధార చికిత్స అందిస్తారు. వివిధ రకాల తైలాలతో తలకు జుట్టు బాగా మర్దన చేయడం వల్ల తల భారం తగ్గి,మెదడులో సెరటోనిన్, డోపమైన్ హార్మోన్లు సక్రమంగా స్రవించడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…