Tag Archives: Hujurabad

దళిత బంధు పథకం కాదు మహోద్యమం _ సీఎం కేసీఆర్

దళిత బంధు ఒక పథకం కాదు మహోద్యమం అన్నారు సీఎం కేసీఆర్. ఇవాళ కరీంనగర్ లో పర్యటించిన ఆయన.. హుజూరాబాద్ లో ఏర్పాటు చేసిన దళిత బంధు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దళిత బంధు కొత్త చరిత్ర సృష్టిస్తుందని తెలిపారు.

కాగా రైతు బీమా పథకం కూడా విజయవంతంగా కొనసాగుతుందన్నారు సీఎం కేసీఆర్ . రైతు బంధు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుందొన్నారు.తెలంగాణా సాకారం అయినట్లే ఎస్సీలు అభివృద్ధి కూడా జరగాలన్నారు.

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ?

హుజురాబాద్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. కొండా సురేఖ పేరును కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు.. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. శనివారం పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హుజురాబాద్ అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది.

కాగా కొండా సురేఖతో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ, కృష్ణారెడ్డి, ప్యాట రమేష్ పేర్లను కాంగ్రెస్ పరిశీలంచింది. అయితే అంతిమంగా సురేఖ పేరును పార్టీ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక బీసీ సామాజిక వర్గం చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు చెందిన బీసి నేతలు బరిలో ఉండడంతో అధిష్టానం సురేఖ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయం_ మంత్రి హరీష్ రావు

హుజురాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి హరీష్ రావ్. కుక్కర్లో కుట్టు మిషను గడియారాలు పంచినా గెలిచేది మాత్రం టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. హుజురాబాద్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ ను గెలిపిస్తాయని మంత్రి వెల్లడించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది టీఆర్ఎస్ అని హరీశ్ రావు తెలిపారు.

దళిత బంధు కోసల్లే ప్రోగ్రాం కాదు_ ఈటల రాజేందర్

తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా కొసల్లే ప్రోగ్రాం కాదన్నారు. టిఆర్ఎస్ నేతలు గెలవలేమని నిర్ధారణకు వచ్చి చిల్లర పనులకు ఒడిగడుతున్నరని ఆగ్రహాం వ్యక్తం చేశారు. పథకాలన్నీ నా వల్లే వస్తున్నాయని.. నాకే ఓటేస్తామని హుజరాబాద్ ప్రజలు అంటున్నారని ఈటెల స్పష్టం చేశారు.

కాగా హుజురాబాద్ ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు తీసుకొచ్చారని అన్నారు ఈటెల. కేసిఆర్ ఎప్పుడు ఓట్ల కోణంలోనే ఆలోచిస్తారని.. ప్రజల కోణంలో ఆలోచించరని ధ్వజ మెత్తారు. సొంత పార్టీ నేతలను వెలకట్టే నీచానికి కేసీఆర్ దిగజారారని అన్నారు. అక్రమ సంపాదన ప్రభుత్వ ధనంతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది తానేనని ఈటెల పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలుచేస్తాం_ సీఎస్

కరీంనగర్ లో దళిత బంధు పై సోమేష్కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బందు అమలు చేస్తామని ఆయన తెలిపారు. దళిత బంధు పై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని అన్ని సరిచేస్తామని వెల్లడించారు. ఆర్థిక సాయం తో ఎలాంటి స్కీమ్ తీసుకుంటారో పర్యవేక్షిస్తామని సోమేష్ కుమార్ చెప్పుకొచ్చారు.

కాగా హుజరాబాద్ లో సర్వే చేసి వివరాలు సేకరించామని రాహుల్ బొజ్జా తెలిపారు. గ్రామాల్లో ప్రత్యేక సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపిక తర్వాత సాయం మంజూరు చేస్తామని రాహుల్ బొజ్జ చెప్పుకొచ్చారు.

హుజరాబాద్ లో దళిత బందు కోసం దళితుల ఆందోళన!

హుజురాబాద్ పెద్ద పాపయ్యపల్లి లో దళితుల రాస్తారోకో నిర్వహించారు. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి.. అనర్హులను దళిత బంధు కేటగిరిలో చేర్చారని నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి దళిత బంధు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా హుజరాబాద్ లోని పలు మండలాల్లో సైతం దళితులు ఇదే తరహాలో ఆందోళన చేపట్టారు. స్థానికులను కాదని ఇతరులను జాబితాలో చేర్చి దళిత బంద్ కు అర్హులుగా ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో సీఎం కేసిఆర్ సభ ఉన్న నేపథ్యంలో దళితుల ఆందోళన తో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

దళిత బంధుకు ఆదిలోనే అడ్డంకి!

తెలంగాణ ప్రభుత్వం ప్రవేపెడుతున్న దళిత బంధుకు ఆదిలోనే నిరసన సెగ తాకింది. హుజరాబాద్ లో ప్రారంభం అవుతున్న ఈ ప్రాజెక్ట్ లో.. కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో కొంత మందిని ఎంపిక చేయడంపై గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధు కోసం అన్ని గ్రామాల్లో జాబితాను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కందుకూరు గ్రామం నుంచి 8 మందిని ఎంపిక చేయడంపై గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొంత సేపు అక్కడ ట్రాఫిక్ జాం అయ్యింది.

సీఎం కేసీఆర్ కు గెల్లు శ్రీనివాస్ కృతజ్ఞతలు!

హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నమ్మి అవకాశం ఇచ్చినందుకు సీఎంకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. అభ్యర్థి కోసం ముమ్మర కసరత్తు చేసిన అధికార పార్టీ.. రాష్ట్ర టిఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడుగా ఉన్న శ్రీనివాస్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది.

హుజరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అన్నదానిపై చర్చ కొనసాగుతోంది. కొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయని .. తొందరగా అభ్యర్థిని తేల్చాలని సీనియర్ నేత కోమటి రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో మహిళ పోడు రైతులను హింసించడం నిరసిస్తూ టిపిసిసి రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.

ప్రస్తుతం హుజరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు దీటుగా ఎదుర్కొనే నేత కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న వినియోగం. ఈ రెండు పార్టీల నాయకులు బీసీ నేతను బరిలోకి దించడంతో .. పార్టీ అధిష్టానవర్గం దళిత అభ్యర్థిత్వం వైపు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది

ఈటెల రాజేందర్ పై ఫైర్ అయిన తలసాని!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై ఫైర్ అయ్యారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నాగార్జున సాగర్ లో జానారెడ్డికి పట్టిన గతే రాజేందర్ కి పడుతుందన్నారు. గెల్లు శ్రీనివాస్ ని బానిసగా పేర్కొనడం ఈటెల అహంకారానికి నిదర్శమన్నారు.

హుజురాబద్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఈటెలకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని తలసాని పేర్కొన్నారు. సీఎం కేసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే శ్రీనివాస్ని గెలిపిస్తాయని స్పష్టం చేశారు.