Tag Archives: immunity

కొత్తిమీర వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా?

సాధారణంగా కొత్తిమీరను అన్ని రకాల వంటలో ఉపయోగించడం మనం చూస్తూనే ఉన్నాం.అయితే ఈ కొత్తిమీరను కొందరు ఆహారంలో రుచి కోసం మాత్రమే ఉపయోగపడుతుందని భావిస్తుంటారు.మరికొందరు కూరలలో కోతిమిర కనిపిస్తే తీసి పక్కన పెడుతూ ఉంటారు. కానీ కొత్తిమీరలో ఉండే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలిస్తే ఒక్కరు కూడా కొత్తిమీరను తినకుండా ఉండరు. అయితే కొత్తిమీరను తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

కొత్తిమీర ఆకుల నుంచి మొదలుకొని కాండం వరకు ఎన్నో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, సి, కె ఇందులో విరివిగా లభిస్తాయి. కొత్తిమీర ఆకులు, కాండంలో పీచు పదార్థాలు కూడా అధికంగా ఉంటాయి.ఈ పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల మనం తీసుకునే ఆహారం తొందరగా జీర్ణం అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న యాంటీబయాటిక్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగు పరచడంతో పాటు, అనేక రకాల వ్యాధులతో పోరాడే శక్తిని కల్పిస్తుంది.

ఇందులో ఉన్న విటమిన్ ఏ, సి, కె రోగ నిరోధక శక్తిని మెరుగు పరిచి కంటిచూపును పెంపొందించడంలో విటమిన్ ఏ తోడ్పడుతుంది. అధిక రక్తస్రావం ఉన్న వారికి విటమిన్ కే ఎంతగానో ఉపయోగపడుతుంది.కీళ్ల నొప్పులతో బాధపడేవారు కోతిమిర ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఐరన్ పుష్కలంగా లభించే ఈ కొత్తిమీరను ఆహారంలో ఉపయోగించడం ద్వారా రక్తహీనత సమస్య నుంచి కూడా విముక్తి పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్న కొత్తిమీరను ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

ఈ అలవాట్లు ఎక్కువగా ఉంటే రోగ నిరోధక శక్తి తగ్గినట్లే!

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి వారికి రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటే ఈ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చని ఇప్పటికే ఎంతోమంది రోగనిరోధక శక్తిని పెంపొందించుకొనే పనిలో పడ్డారు. రోగనిరోధక శక్తి మెరుగుపడటానికి పౌష్టికాహారం తీసుకుంటూ, వివిధ రకాల కషాయాలను సేవిస్తూ ఉన్నారు. ఇలా చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. అయితే తరచూ మన అలవాట్లలో కొన్ని అలవాట్ల వల్ల రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుందని తాజాగా నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ అలవాటు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

కొంతమంది మందుబాబులు ఎల్లప్పుడు మద్యం మత్తులో తూగుతుంటారు. ఇలా ఎక్కువ మొత్తంలో మద్యం సేవించడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి.అంతే కాకుండా మద్యం ఎక్కువగా సేవించే వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని నిపుణులు తెలియజేశారు. ఇలాంటి వారిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందితే మరింత తీవ్రరూపం దాల్చి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.

మనం ప్రతిరోజు వండే వంటలలో సరిపడా ఉప్పు లేనిదే వంటకు తగినంత రుచి రాదు. అయితే ఈ ఉప్పును అధికంగా తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటు పెరగడమే కాకుండా, శరీరంలో అధిక శాతం సోడియంను మూత్రపిండాలు వడ పోసేటప్పుడు డొమినే ఎఫెక్ట్‌ సంభవిస్తుంది. తద్వారా మన శరీరం బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని కోల్పోయి అనేక వ్యాధులు చుట్టుముడతాయి.

సాధారణంగా కాఫీ,టీ తాగటం ద్వారా కొంతమంది మంచిదని చెబుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు రావడంతో పాటు, ఇందులో ఉండే కెఫిన్ అనే పదార్థం వల్ల నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా మరికొంత మంది ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటారు. అలా అనవసరంగా ఆందోళన చెందటం వల్ల మన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి వారిలో అధిక రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఇలాంటి అలవాట్లు ఉన్న వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని నిపుణుల తెలియజేశారు.

ప్రజలకు శుభవార్త.. వాళ్లకు వ్యాక్సిన్ అవసరం లేదట..?

కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో వైరస్ కు, వ్యాక్సిన్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శాస్త్రవేత్తలు కరోనా విషయంలో పరిశోధనలు చేసి ఇప్పటికే వైరస్ బారిన పడి కోలుకున్న వాళ్లకు వ్యాక్సిన్ అవసరం లేదని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో సంవత్సరాల తరబడి ఇమ్యూనిటీ పవర్ ఉంటుందని అందువల్ల వారికి వ్యాక్సిన్ అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో వైరస్ నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీలు ఉంటాయని అందువల్ల వీళ్లు రీఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం తక్కువని వెల్లడించారు. అధ్యయనకారులు వీళ్లకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పారు. 19 నుంచి 81 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న కరోనా నుంచి కోలుకున్న వారిపై పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో వైరస్ నుంచి సమర్థవంతంగా పోరాడే బీ, టీ లింఫోసైట్‌ కణాలు పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. బీ, టీ లింఫోసైట్‌ కణాలు కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు మళ్లీ రీ ఇన్ఫెక్షన్ సోకకుండా రక్షిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో యాంటీబాడీలు ఆలస్యంగా అంతరిస్తున్నట్టు గుర్తించామని అందువల్ల వీళ్లు వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ కరోనా వైరస్ ను సంవత్సరాల తరబడి గుర్తు పెట్టుకుంటుందని.. వైరస్ ఎప్పుడు శరీరంలోకి ప్రవేశించినా సమర్థవంతంగా పోరాడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధ్యయనకారులు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వల్ల భవిష్యత్తులో కరోనా కేసులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ట్యాబ్లెట్లు ఎక్కువగా వేసుకుంటున్నారా.. ప్రాణాలకే ప్రమాదం..?

మనలో చాలామంది చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా ట్యాబ్లెట్లను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. జలుబు, తలనొప్పి లాంటి సమస్యలను వేగంగా తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ట్యాబ్లెట్లపై ఆధారపడుతూ ఉంటారు. అయితే ట్యాబ్లెట్లను ఎక్కువగా తీసుకుంటే మనకు తాత్కాలికంగా ఆ ఆరోగ్య సమస్య నుంచి ఉపశమనం లభించినా భవిష్యత్తులో మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా ఇష్టానుసారం ట్యాబ్లెట్లను వాడితే భవిష్యత్తులో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోతుంది. గడిచిన 15 సంవత్సరాలలో భారత్ లో ట్యాబ్లెట్ల వినియోగం భారీగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో వైద్యులు సైతం రోగికి వ్యాధిని తగ్గించాలనే ఉద్దేశంతో ఎక్కువగా యాంటీబయోటిక్స్ ను రాస్తుంటారు. ఎక్కువగా మందులు వాడితే శరీరంపై మందులు దుష్ప్రభావాలు చూపుతాయి.

మన అవసరాలకు, ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా యాంటీ బయోటిక్స్ ను వాడితే మంచిది. దేశంలో కరోనా వైరస్ విజృంభించినప్పటి నుంచి యాంటీ బయోటిక్స్ వినియోగం గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. చాలామంది విటమిన్ల ట్యాబ్లెట్లను వైద్యుల సూచనలు లేకుండా ఇష్టానుసారం వాడేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. మెడికల్ షాపుల్లో మందులు సొంతంగా కొనుగోలు చేయకూడదు.

ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత గురించి చైతన్యం పెరిగితే అనేక వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఇష్టానుసారం మందులను వినియోగించడం వల్ల అత్యవసర సమయాల్లో మందులు వాడినా ప్రయోజనం ఉండదు. భారతదేశంలో యాంటీబయోటిక్స్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఏకంగా 7 లక్షల మంది ఏటా చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి.

విటమిన్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడుతున్నారా.. ఈ సమస్యల బారిన పడినట్టే..?

కరోనా మహమ్మారి విజృంభించిన తరువాత చాలామంది రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇమ్యూనిటీ పవర్ కోసం కొందరు సరైన ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యతనిస్తుంటే మరికొందరు విటమిన్ ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడుతున్నారు. మరి విటమిన్ ట్యాబ్లెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయా..? కీడు చేస్తాయా..? అనే ప్రశ్నకు విటమిన్ ట్యాబ్లెట్ల వల్ల మన శరీరానికి జరిగే మంచి కంటే చెడే ఎక్కువ అని వైద్యనిపుణులు చెబుతున్నారు.

వైద్యుల సలహాలు, సూచనలను తీసుకోకుండా విటమిన్ ట్యాబ్లెట్లను వాడితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లేనని వెల్లడిస్తున్నారు. శరీరంలో విటమిన్ల స్థాయిని పెంచుకోవడం కోసం ట్యాబ్లెట్లపై ఆధారపడితే అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టేనని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెల్లడిస్తోంది. ఇష్టానుసారం విటమిన్ ట్యాబ్లెట్లు వాడితే కొత్త ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

శరీరంలో విటమిన్ల స్థాయి పెరిగితే కడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. గొంతునొప్పి, అలసట సమస్యలు వీరిని ఎక్కువగా వేధిస్తాయి. విటమిన్లు ట్యాబ్లెట్ల ద్వారా కంటే ఆహార పదార్థాల ద్వారా శరీరానికి చేరితే మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రతిరోజూ కొంత సమయం ఎండలో తిరిగితే విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి ట్యాబ్లెట్లు వాడిన వారిలో కాల్షియం లెవెల్స్ పెరిగి కొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తాయని వైద్యులు తెలుపుతున్నారు.

శరీరంలో విటమిన్ ఇ ఎక్కువైతే కంటి కాంతిపై తీవ్ర ప్రభావం పడుతుంది. పప్పు దినుసులు, కూరగాయలను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు అన్నీ లభిస్తాయి. తగిన స్థాయిలో విటమిన్లు తీసుకోవడం వల్ల ఏ సమస్య లేదని విటమిన్ల స్థాయి పెరిగితే మాత్రం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. మోతాదుకు మించి విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకుంటే అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపి అవయవాలు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి.