ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి వారికి రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటే ఈ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చని ఇప్పటికే ఎంతోమంది రోగనిరోధక శక్తిని పెంపొందించుకొనే పనిలో పడ్డారు. రోగనిరోధక శక్తి మెరుగుపడటానికి పౌష్టికాహారం తీసుకుంటూ, వివిధ రకాల కషాయాలను సేవిస్తూ ఉన్నారు. ఇలా చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. అయితే తరచూ మన అలవాట్లలో కొన్ని అలవాట్ల వల్ల రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుందని తాజాగా నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ అలవాటు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….
కొంతమంది మందుబాబులు ఎల్లప్పుడు మద్యం మత్తులో తూగుతుంటారు. ఇలా ఎక్కువ మొత్తంలో మద్యం సేవించడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి.అంతే కాకుండా మద్యం ఎక్కువగా సేవించే వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని నిపుణులు తెలియజేశారు. ఇలాంటి వారిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందితే మరింత తీవ్రరూపం దాల్చి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.
మనం ప్రతిరోజు వండే వంటలలో సరిపడా ఉప్పు లేనిదే వంటకు తగినంత రుచి రాదు. అయితే ఈ ఉప్పును అధికంగా తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటు పెరగడమే కాకుండా, శరీరంలో అధిక శాతం సోడియంను మూత్రపిండాలు వడ పోసేటప్పుడు డొమినే ఎఫెక్ట్ సంభవిస్తుంది. తద్వారా మన శరీరం బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని కోల్పోయి అనేక వ్యాధులు చుట్టుముడతాయి.
సాధారణంగా కాఫీ,టీ తాగటం ద్వారా కొంతమంది మంచిదని చెబుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు రావడంతో పాటు, ఇందులో ఉండే కెఫిన్ అనే పదార్థం వల్ల నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా మరికొంత మంది ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటారు. అలా అనవసరంగా ఆందోళన చెందటం వల్ల మన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి వారిలో అధిక రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఇలాంటి అలవాట్లు ఉన్న వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని నిపుణుల తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…