Categories: FeaturedHealth News

అలాంటి వారు తిప్పతీగను వాడితే ఏం అవుతుందో తెలుసా?

సాధారణంగా మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల వనమూలికలను ఉపయోగిస్తూ ఉంటారు. ఎటువంటి హానికర రసాయనాలు లేకుండా కేవలం మొక్కల నుంచి లభించే వీటి ద్వారా ఎన్నో రకాల వ్యాధులను నయం చేయవచ్చునని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఇలాంటి వాటిలో తిప్పతీగ ముందు వరుసలో ఉంటుంది.ఈ తిప్పతీగను తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే దీని ఆకులను పొడి రూపంలో, గుళికల రూపంలో, కషాయం లాగా తయారు చేసుకునే తాగడం ద్వారా ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ తిప్పతీగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

తిప్పతీగలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ కణాలతో పోరాడి క్యాన్సర్ నుంచి విముక్తి కలిగిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా అందరినీ బాధ పెడుతున్న సమస్య అజీర్తి. అజీర్తితో బాధపడేవారు తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకొని తీసుకోవడం ద్వారా అజీర్తి సమస్యలు తొలగిపోతాయి.

దీర్ఘకాలికంగా ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు టేబుల్ టీ స్పూన్ తిప్పతీగ పొడిని గ్లాసు గోరువెచ్చని పాలలో కలుపుకొని తాగడం ద్వారా దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఈ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ తిప్పతీగ వల్ల మన చర్మంపై ఏర్పడే ముడతలు తొలగించి వృద్ధాప్య ఛాయలు ఏర్పడకుండా కాపాడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ తిప్పతీగతో చేసిన మందులలో గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వాడకూడదు. ఈ తిప్పతీగ హైపోగ్లైకేమిక్ ఏజెంట్‌గా పని చేయడం వల్ల మన శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడంతో టైపు-2 డయాబెటిస్ నుంచి మనల్ని కాపాడుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago