సాధారణంగా మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల వనమూలికలను ఉపయోగిస్తూ ఉంటారు. ఎటువంటి హానికర రసాయనాలు లేకుండా కేవలం మొక్కల నుంచి లభించే వీటి ద్వారా ఎన్నో రకాల వ్యాధులను నయం చేయవచ్చునని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఇలాంటి వాటిలో తిప్పతీగ ముందు వరుసలో ఉంటుంది.ఈ తిప్పతీగను తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే దీని ఆకులను పొడి రూపంలో, గుళికల రూపంలో, కషాయం లాగా తయారు చేసుకునే తాగడం ద్వారా ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ తిప్పతీగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

తిప్పతీగలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ కణాలతో పోరాడి క్యాన్సర్ నుంచి విముక్తి కలిగిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా అందరినీ బాధ పెడుతున్న సమస్య అజీర్తి. అజీర్తితో బాధపడేవారు తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకొని తీసుకోవడం ద్వారా అజీర్తి సమస్యలు తొలగిపోతాయి.
దీర్ఘకాలికంగా ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు టేబుల్ టీ స్పూన్ తిప్పతీగ పొడిని గ్లాసు గోరువెచ్చని పాలలో కలుపుకొని తాగడం ద్వారా దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఈ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ తిప్పతీగ వల్ల మన చర్మంపై ఏర్పడే ముడతలు తొలగించి వృద్ధాప్య ఛాయలు ఏర్పడకుండా కాపాడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ తిప్పతీగతో చేసిన మందులలో గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వాడకూడదు. ఈ తిప్పతీగ హైపోగ్లైకేమిక్ ఏజెంట్‌గా పని చేయడం వల్ల మన శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడంతో టైపు-2 డయాబెటిస్ నుంచి మనల్ని కాపాడుతుంది.



































