Tag Archives: Indian Cricketers

Ram Charan: కోహ్లీ బయోపిక్ చిత్రంలో నటించాలని ఉంది… మనసులో కోరిక బయటపెట్టిన చరణ్!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ వేడుకల నిమిత్తం అమెరికా వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఈ వేడుకలు ముగిసిన తర్వాత చిత్ర బృందం మొత్తం హైదరాబాద్ చేరుకోగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు మాత్రం ఢిల్లీ వెళ్లారు. రామ్ చరణ్ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ ప్రధాని నరేంద్ర మోడీ సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప వారితో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు రావడానికి గల కారణాలను అలాగే ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కూడా ఈ సందర్భంగా ఈయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ తన మనసులో ఉన్నటువంటి ఒక కోరికను కూడా బయట పెట్టారు. ఇప్పుడు ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాల హవా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది రాజకీయ సినీ క్రికెట్ సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన బయోపిక్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే చరణ్ సైతం ఇలాంటి ఒక బయోపిక్ చిత్రంలో నటించాలని ఉంది అంటూ తెలిపారు.

Ram Charan: కోహ్లీ నాకు ఆదర్శం…


ఇప్పటికే ఎంతోమంది ఇండియన్ క్రికెటర్ల బయోపిక్ చిత్రాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే తనకు ఎంతో ఆదర్శంగా స్ఫూర్తిగా నిలిచిన విరాట్ కోహ్లీ బయోపిక్ చిత్రంలో నటించాలని ఉంది అంటూ రామ్ చరణ్ ఈ సందర్భంగా తన మనసులో కోరికను బయటపెట్టారు. ఇలా ఈయన కోహ్లీ బయోపిక్ చిత్రంలో నటించాలని ఉందని చెప్పడంతో కోహ్లీ అభిమానులు, చరణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Indian Cricketers: ప్రభుత్వ ఉన్నతాధికారులుగా గుర్తింపు పొందిన ఇండియన్ క్రికెటర్స్ వీళ్లే?

Indian Cricketers: క్రికెట్ అంటే ప్రాణంగా అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఇలా క్రికెట్ అంటే ఇష్టపడడమే కాకుండా భారత క్రికెటర్లను ఇష్టపడే అభిమానులు కూడా ఎంతోమంది ఉన్నారు.ఇకపోతే టీమిండియాలో క్రికెటర్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో కొందరు ప్రభుత్వ శాఖలో ఎంతో ఉన్నతమైన పదవులలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు.మరి ప్రభుత్వ ఉన్నతాధికారులుగా గుర్తింపు పొందిన క్రికెటర్లు ఎవరు అనే విషయానికి వస్తే..

ఎంఎస్ ధోని: టీమిండియాలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ధోని క్రికెట్ లోకి రాకముందు ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ క్రికెట్ కలెక్టర్ గా ఉద్యోగం చేశాడు. 2011లో ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో టీం ఇండియా ప్రపంచ కప్ గెలిచింది. అదే సమయంలో ఈయన లెఫ్టినెంట్ కల్నేల్ గా ధోనిని నియమించారు.

సచిన్ టెండూల్కర్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ రంగంలో ఎన్నో అవార్డులు బిరుదులను సొంతం చేసుకున్న ఈయన 2010లో ఇండియన్ ఎయిర్ ఫోర్సులో గ్రూప్ కెప్టెన్ గా సచిన్ నియామకమయ్యారు..

చాహల్: టీమిండియాలో ఎంతో మంచి గుర్తింపు పొందిన చాహల్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాహల్ కు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ పోస్టును ఆఫర్ చేశారు.

కేఎల్ రాహుల్: కేఎల్ రాహుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం సంపాదించారు.

Indian Cricketers….

జోగిందర్ శర్మ:

జోగిందర్ శర్మ, 2007 టీ 20 వరల్డ్ కప్ లో చివరి ఓవర్ వేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈయన హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్నారు.

హర్భజన్ సింగ్: హర్భజన్ సింగ్ సైతం డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా పని చేశారు.

కపిల్ దేవ్: ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా  కపిల్ దేవ్ గా పనిచేశారు.